
Daily Current Affairs in Telugu 16-09-2021
టీ20 క్రికెట్ ఫార్మాట్ లో కెప్టెన్సీ ని వదులుకున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లి :

యూఏఈలో జరిగే టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్ గా పిలిచే టి.20లకు సారథ్య బాధ్యతలను వీడతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెప్టెంబర్ 16న ప్రకటించాడు. ‘వన్డేలు,టెస్టుల్లో మాత్రం జట్టును నడిపిస్తానని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్ గా కోహ్లి భవిష్యత్తు గురించి కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్న నేపద్యంలో. ముఖ్యంగా నిరుడు రోహిత్ శర్మ కెప్టెన్ గా అయిదోసారి ముంబయి ఇండియన్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించిన తర్వాత కోహ్లి పరిమిత ఓవర్ల నాయకత్వంపై చర్చ ఎక్కువైంది. పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మార్పు సాఫీగా జరగడం కోసం టీ20 కోహ్లి 2017 లో ధోని నుంచి టీ20 పగ్గాలు అందుకున్నాడు. 45 మ్యాచ్ లో జట్టును నడిపించాడు. 27 గెలిచి, 14 ఓడిపోయాడు. రెండు మ్యాచ్లు టైగా ముగియగా.మరో రెండు రద్దయ్యాయి. కెప్టెన్ గా కోహ్లి టీ 20 గెలుపు శాతం 65.11. అతడి నాయకత్వంలోని టీమ్ ఇండియా విదేశాల్లో టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేసింది. 2018లో దక్షిణాఫ్రికాలో 21 పొట్టి సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా ఇంగ్లాండ్ లో 2-1తో ఓడించింది. 2019 – 20 సీజన్ లో న్యూజిల్యాండ్ దాని సొంతగడ్డపై 5-0తో చిత్తు చేసింది. 2020లో ఆస్ట్రేలియాలోవన్డే సిరీస్ కోల్పోయాక కోహ్లి బృందం టీ20ల్లో 2-1తో పైచేయి సాధించింది. ఇటీవల సొంతగడ్డపై భారత్ 3-2తో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. అప్పుడు కోహ్లి కి”ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివ రకు 90 టీ20ల్లో 52.65 సగటుతో 3159 పరుగులు చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టీ20 క్రికెట్ ఫార్మాట్ లో కెప్టెన్సీ ని వదులుకున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లి
ఎవరు: విరాట్ కోహ్లి
ఎక్కడ: ఇండియా
ఎప్పుడు: సెప్టెంబర్ 16
వై.ఎస్సార్.ఆర్ రైతు భరోసా కేంద్రాల చీఫ్ కమిషనర్ గా పూనం మాలకొండయ్య నియామకం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ఇటీవల ఏర్పాటు చేసిన వై.ఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను లను మరింత సమర్థ వంతంగా నిర్వహించే లక్ష్యంతో చీఫ్ కమిషనర్ గా పూనం మాలకొండయ్యను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధాదాస్ గారు ఉత్తర్వులిచ్చారు.వ్యవసాయ అనుబంధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పూనం మాలకొండయ్య ఇక నుంచి ఆర్బీకేల చీఫ్ కమిషనర్ గా కూడా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వై.ఎస్సార్.ఆర్ రైతు భరోసా కేంద్రాల చీఫ్ కమిషనర్ గా పూనం మాలకొండయ్య నియామకం
ఎవరు: పూనం మాలకొండయ్య
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: సెప్టెంబర్ 16
ఆసియా స్నూకర్ చాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన పంకజ్ అద్వాని :

కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్ క్రీడాకారుడు పంకజ్ అడ్వాణీ ఛాంపియన్ గా నిలిచాడు. ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ లో తన టైటి ల్ ను నిలబెట్టుకున్నాడు. సెప్టెంబర్ 16న జరిగిన ఫైనల్లో అతను 6-3 తేడాతో అమిర్ సర్ధోష్ (ఇరాన్) పై విజయం సాధించాడు. వరుసగా తొలి మూడు ఫ్రేమ్ లు గెలిచిన పంకజ్ 3-0 ఆధిక్యంతో దూసుకెళ్లాడు. మధ్యలో కాస్త వెనకబడ్డప్పటికీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలుపుతో మ్యాచ్ ముగించాడు. 2019 లో చివరగా పంకజ్ ఈ టైటిల్ గెలిచాడు. గతేడాది కరోనా కారణంగా జరగలేదు. ఇప్పటివరకూ స్నూకర్, బిలియర్డ్స్ కలిపి మొత్తం 11 ఆసియా టైటిళ్లు అతని ఖాతాలో చేరాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా స్నూకర్ చాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన పంకజ్ అద్వాని
ఎవరు: పంకజ్ అద్వాని
ఎక్కడ: దోహా
ఎప్పుడు: సెప్టెంబర్ 16
మాల్దీవులకు భారత తదుపరి హై కమిషనర్ సీనియర్ దౌత్యవేత్త మును మహవార్ నియామకం :

మాల్దీవులకు భారత తదుపరి హైకమిషనర్ సీనియర్ దౌత్యవేత్త మును మహవార్ నియమితులైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఈయన.1996 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ప్రస్తుతం ఒమన్ లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. మాల్దీవులలో భారత హై కమిషనర్ గా సుంజయ్ సుధీర్ గారి స్థానంలో మహావార్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2001 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అమిత్ నారంగ్ ఒమన్ లో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాల్దీవులకు భారత తదుపరి హై కమిషనర్ సీనియర్ దౌత్యవేత్త మును మహవార్ నియామకం
ఎవరు: మును మహవార్
ఎక్కడ: మాల్దీవులు
ఎప్పుడు: సెప్టెంబర్ 16
టైమ్స్ మ్యాగజిన్ ప్రకటించిన అత్యంత ప్రభావ వంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ప్రదాని మోడి ,మమత బెనర్జీ :

టైమ్స్ మ్యాగజిన్ ప్రకటించిన అత్యంత ప్రభావ వంతుల జాబితాలో భారత ప్రదాని మోడి మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గారు,సీరం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియా సియివో అయిన అదర్ పునావాలాలు చోటు దక్కించుకున్నారు.2021సంవత్సరానికిగాను దానికి సంబంధించి ప్రఖ్యాత టైం మ్యాగజిన్ సెప్టెంబర్ 16 నుంచి ఈ జాబితాను విడుదల చేసింది.ఏషియన్ ఫసిఫిక్ పాలసి ,ప్లానింగ్ కౌన్సిల్ కార్యనిర్వాహక డైరెక్టర్ పి.కులకర్ణి కూడా ఈ జాబితాలో ప్రముఖంగా పేర్కొన్నారు. స్వతంత్ర భారత్ లో జావహార్ లాల్ నెహ్రు ,ఇందిరా గాంధీ తర్వాత మోడీ లా మరెవరు దేశ రాజకీయాలను శాసించలేదు అని టైమ్స్ మ్యాగజిన్ ప్రశంసించింది.మమతా బెనర్జి రాజకీయాల్లో ధీరవనిత గా అవతరించారని ఆ మ్యాగజిన్ పేర్కొంది. కాగా ఈ జాబితాలో అమెరికా అద్యక్షుడిగా జో బైడెన్ ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్మా జీ అద్యక్షుడు ట్రంప్ ,చైనా అద్యక్షుడు జిన్ పింగ్ లతో పాటు తాలిబాన్ సహా వ్యవస్థాపకుడు ముళ్ళ అబ్దుల్ ఘని బరాధర్ పేరు కూడా ఇందులో చేర్చారు. టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా ,సంగీత స్రష్ట బ్రిట్నీ స్పియర్స్,ఆపిల్ సియివో టీం కుక్ తదితరుల పేర్లు కూడా అత్యంత ప్రభావ వంతుల జాబితాలో ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: టైమ్స్ మ్యాగజిన్ ప్రకటించిన అత్యంత ప్రభావ వంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ప్రదాని మోడి ,మమత బెనర్జీ
ఎవరు: ప్రదాని మోడి ,మమత బెనర్జీ, అదర్ పునావాలా
ఎప్పుడు: సెప్టెంబర్ 16
ఓజోన్ పోర సంరక్షణ దినం గా సెప్టెంబర్ 16 :

ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ఓజోన్ పొర క్షీణతపై అవగాహన కల్పిస్తూ మరియు దానిని సంరక్షించడానికి తీసుకునే పరిష్కారాల కోసం శోధించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 న ఓజోన్ పొర కోసం పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం (ప్రపంచ ఓజోన్ దినోత్సవం) జరుపుకుంటారు. ఓజోన్ పొర అనేది సూర్యుని కిరణాలద్వారా వచ్చే హానికరమైన భాగం నుండి భూమి, తద్వారా గ్రహం మీద ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచ ఓజోన్ దినోత్సవ థీమ్: ‘మాంట్రియల్ ప్రోటోకాల్ గా ఉంది..’ ఈ రోజు యునైటెడ్ చేత నియమించబడింది 1987 లో ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేసినందుకు గుర్తుగా డిసెంబర్ 19,2000న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ రోజును గుర్తించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఓజోన్ పోర సంరక్షణ దినం గా సెప్టెంబర్ 16
ఎవరు: సెప్టెంబర్ 16
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: సెప్టెంబర్ 16
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |