
Daily Current Affairs in Telugu 21-09-2021
ప్రపంచ నవకల్పన సూచీ-2021 ర్యాంకింగ్ 46 వ స్థానం లో నిలిచిన భారత్ :

ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జారీచేసిన ప్రపంచ నవకల్పన సూచీ-2021 ర్యాంకింగ్ లో భారత్ 46వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే భారత్ రెండు ర్యాంకులు పైకి ఎగబాకిందని, తన పరిస్థితిని మరింత మెరుగుపరచుకుందని నీతి ఆయోగ్ తెలిపింది. 2015లో 81వ ర్యాంకులో నిలిచిన భారత్ ఈ ఆరేళ్లలో 35 స్థానాలు మెరుగుపరచుకొని టాప్-50 లోకి చేరినట్లు పేర్కొంది. మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఎన్నో నవకల్పనలకు ప్రాణం పోసిందని వివరించింది. మొదటి ఐదు స్థానాలలో స్విట్జర్ ల్యాండ్ ,స్వీడన్ రెండో స్థానంలో ,అమెరికా మూడో స్థానంలో , ఉనితెద్ కింగ్ డం నాలుగో స్థానం లో ,రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఐదవ స్థానంలో ఉంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ నవకల్పన సూచీ-2021 ర్యాంకింగ్ 46 వ స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: సెప్టెంబర్ 21
ప్రపంచ స్నూకర్ టైటిల్ ను గెలుచుకున్న భారత క్యుయిస్ట్ పంకజ్ అద్వాని :

భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వాణీ 24వ సారి ప్రపంచ టైటిల్ సాధించాడు. అతడు సెప్టెంబర్ 20 ఐబీఎస్ఎఫ్ 6-రెడ్ స్నూకర్ ప్రపంచక విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 7-5తో పాకిస్థాన్ కు చెందిన బాబర్ మసిప్ పై విజయం సాధించాడు. ఇద్దరి మధ్య పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఒక దశలో 3-1 ఆధిక్యంతో సులభంగానే టైటిల్ సాధించేలా కనిపించాడు. ఈ దశలో ఒక ఫ్రేమ్ గెలిచి బాబర్ పుంజుకున్నా వెంటనే మూడు’ ఫ్రేమ్ లు నెగ్గిన పంకజ్ 6-2తో టైటిలకు చేరవయ్యాడు. అయితే ప్రత్యర్థి వరుసగా మూడు ప్రేమ్ లు నెగ్గి గట్టిపోటీనిచ్చాడు. అదే విదంగా పంకజ్ ఆధిపత్యం చెలాయించి విజయాన్ని అందుకున్నాడు. పంకజ్ గతవారమే 11వ సారి ఆసియా టైటిల్ను గెలుచుకున్నాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ స్నూకర్ టైటిల్ ను గెలుచుకున్న భారత క్యుయిస్ట్ పంకజ్ అద్వాని
ఎవరు: పంకజ్ అద్వాని
ఎప్పుడు: సెప్టెంబర్ 21
ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారాన్ని నిషేధించిన ఆఫ్గనిస్తాన్ దేశం :

అఫ్గానిస్తాన్ లో ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారాన్ని తాలిబన్ల నేతృత్వంలోని ప్రభుత్వం నిషేధించింది. స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉండడమే కారణమని పేర్కొంది అఫ్గానిస్థాన్ జాతీయ టీవీ ఎప్పటిలా ఐపీఎల్ ను ప్రసారం చెయ్యదని, ఇస్లామ్ వ్యతిరేక అంశాలు ఉండే అవకాశం ఉండడమే అందుకు కారణమని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ మీడియా మేనేజర్ ఇబ్రహీం చెప్పాడు. “ఐపీఎల్ ప్రసారాలను తాలిబన్ నిషేధించింది. మహిళల డాన్స్ మహిళా ప్రేక్షకుల కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం చేయరాదని అఫ్గాన్ మీడియా సంస్థలను తాలిబన్లు హెచ్చరించారు” అని ఫవాద్ అనే అఫ్గాన్ పాత్రికేయుడు ట్వీట్ చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారాన్ని నిషేధించిన ఆఫ్గనిస్తాన్ దేశం
ఎవరు: ఆఫ్గనిస్తాన్ దేశం
ఎక్కడ: ఆఫ్గనిస్తాన్
ఎప్పుడు: సెప్టెంబర్ 21
భారత వైమానిక దళానికి కొత్త అధిప తిగా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి నియామకం :

భారత వైమానిక దళానికి కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్. కె. ఎస్. భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం వివేక్ రామ్ ఈ పగ్గాలు చేపడతారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ప్రస్తుతం వైమానిక దళ ఉప అధిపతిగా వ్యవహ రిస్తున్నారు. అంతకుముందు ఆయన వివిధ హోదాల్లో సేవలు అందించారు. పశ్చిమ వాయు సేన విభాగం అధిపతిగానూ పనిచేశారు. సమస్యాత్మకమైన లద్దాఫ్ సెక్టార్ సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలు ఈ విభాగం ఉత్తర పరిధిలోకి వస్తాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం వివేక్ మ్ 1982 డిసెంబరు 29న వాయు సేనలో ఫైటర్ పైలట్ గా చేరారు. 38 ఏళ్ల సర్వీసులో ఆయన మిగ్-21, మిగ్-23 ఎంఎఫ్, మిగ్-29, సుఖోయ్-30 ఎంకేఐ తదితర యుద్ధవిమానాలను నడిపారు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత వైమానిక దళానికి కొత్త అధిప తిగా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి నియామకం
ఎవరు: వివేక్ రామ్ చౌధరి
ఎప్పుడు: సెప్టెంబర్ 21
అంతర్జాతీయ శాంతి దినోత్సవం గా సెప్టెంబర్ 21 :

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యు.ఎన్ జనరల్ అసెంబ్లీ దీనిని 24 గంటల అహింస మరియు కాల్పుల విరమణ ద్వారా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడానికి అంకితం చేసిన రోజుగా దీనిని ప్రకటించింది. కాగా 2021 సంవత్సరం అంతర్జాతీయ శాంతి దినోత్సవం యొక్క థీమ్ “ఈక్విటీబుల్ మరియు సస్టైనబుల్ వరల్డ్ కోసం మెరుగైన పునరుద్ధరణ.” ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ద్వేషపూరిత చర్యలకు వ్యతిరేకంగా నిలబడి, మరియు మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పుడు కరుణ, దయ మరియు ఆశను వ్యాప్తి చేయడం ద్వారా శాంతిని జరుపుకోవాలని తెలియజేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ శాంతి దినోత్సవం గా సెప్టెంబర్ 21
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: సెప్టెంబర్ 21
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |