Daily Current Affairs in Telugu 11&12-09-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 11&12-09-2021

RRB Group d Mock test

గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన విజయ్ రూపానీ :

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు సమర్పించారు. గాంధీనగర్‌లో జరిగిన ఒక సమావేశం తర్వాత గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని మోడీ సర్దార్ధమ్ భవన్‌ను ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన రాజ్ భవన్‌కు చేరుకున్నారు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సర్దార్ధమ్ ఫేజ్ -2 కన్యా ఛత్రాలయ (బాలికల హాస్టల్) ‘భూమి పూజ’ చేశారు ఇటీవలి నెలల్లో రాజీనామా చేసిన నాలుగో బిజెపి ముఖ్యమంత్రి మిస్టర్ రూపానీ నిలిచారు.  జూలైలో బిఎస్ యడ్యూరప్ప జూలైలో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు మరియు ఉత్తరాఖండ్‌లో, త్రివేంద్ర రావత్ స్థానంలో తిరథ్ సింగ్ రావత్ నాలుగు నెలలకే ఆయనకూడా  రాజీనామా చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన విజయ్ రూపానీ

ఎవరు: విజయ్ రూపానీ

ఎక్కడ: గుజరాత్

ఎప్పుడు: సెప్టెంబర్ 11

ఆసియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇనిస్టిట్యూషన్స్ అసెంబ్లీ చైర్మన్ గా ఎన్నికైన జి.సి ముర్ము :

కాగ్ గిరీష్ చంద్ర  ముర్ము  గారు 2024-27 సంవత్సర కాలానికి గాను ఆసియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇనిస్టిట్యూషన్స్ (ASOSAI) అసెంబ్లీ యొక్క ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 12న ఒక ప్రకటనలో తెలిపారు ఇది 2024 లో ASOSAI యొక్క పదహారవ అసెంబ్లీకి భారతదేశం ఆతిథ్యం ఇస్తుందని పేర్కొంది. ఆసియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇనిస్టిట్యూషన్స్ యొక్క 56 వ పాలక మండలి  గిరీష్ చంద్ర  ముర్ముని ఎన్నుకుంది ASOSAI యొక్క 15 వ అసెంబ్లీ ద్వారా దీనికి ఆమోదం తెలియజేయబడింది. కాగా గిరీష్ చంద్ర ముర్ము గారు కాగ్ గాను మరియు  అసెంబ్లీ యొక్క ఛైర్మన్ గాASOSAI కి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండనున్నారురు. జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో వ్యవహరించే ASOSAI కి ఈయన ప్రాతినిధ్యం వహించనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆసియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇనిస్టిట్యూషన్స్ అసెంబ్లీ చైర్మన్ గా ఎన్నికైన జి.సి ముర్ము

ఎవరు: కాగ్ గిరీష్ చంద్ర  ముర్ము  

ఎప్పుడు: సెప్టెంబర్ 11

ఇటాలియన్ గ్రాండ్ ఫార్ములావన్ టైటిల్ విజేతగా నిలిచిన డానియల్ రికియార్డో :

ఇటాలియన్ గ్రాండ్ ఫార్ములావన్ టైటిల్ ను  మెక్ లారెన్ డ్రైవర్ డానియల్ రికియార్డో గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 12 న జరిగే ఫైనల్లో అతడు 53 ల్యాప్ లలో 26 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో నిలిచిన అతని సహచరుడు లాండో నోరిస్ కంటే 1.747 సెకన్ల ముందే రికియార్డో రేసు పూర్తి చేశాడు. బొటాస్ (మెర్సిడెజ్) మూడో స్థానంలో నిలిచాడు. టైటిల్ కు పోటీలో ఉన్న మాక్స్ వెర్డెపెన్ (రెడ్ బుల్) తో పాటు డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెజ్) రేసు మధ్యలో ఒకరినొకరు ఢీకొన్నారు. 26వ ల్యాప్ జరుగుతుండగా ఇద్దరు డ్రైవర్లు కార్లను మలుపు తిప్పే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇటాలియన్ గ్రాండ్ ఫార్ములావన్ టైటిల్ విజేతగా నిలిచిన డానియల్ రికియార్డో

ఎవరు: డానియల్ రికియార్డో

ఎప్పుడు: సెప్టెంబర్ 12

‘యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్న ఏమ్మా రదుకా  :

ఎమ్మా రదుకాను (బ్రిటన్)దేశానికి టీనేజర్  అదరగొట్టింది. అంచనాలకు మించి సత్తాచాటిన ఆమె ‘యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను అందుకుంది. ఫైనల్లో ఆమె 6-4, 6-3 తేడాతో కెనడా కు అమ్మాయి లెలా ఫెర్నాండె జ్ ను  ఓడించింది. 1999 తర్వాత ఇద్దరు టీనేజర్ల మధ్య సాగిన తొలి గ్రాండ్ స్లామ్ తుదిపోరు అభిమానులను అలరించింది. ఫైనల్ చేరే క్రమంలో ఒలింపిక్ ఛాంపియన్ బెన్సిచ్, సకారి లాంటి క్రీడాకారిణులను చిత్తుచేసిన ఠదుకాను ఓ వైప. డిఫెండింగ్ ఛాంపియన్ ఒసాకా, కెర్బర్, స్వితోలినా, సబలెంకా లాంటి అగ్రశ్రేణి ప్లేయర్లను ఓడించిన 73వ ర్యాంకు ఫెర్నాండెజ్ మరో వైపు. దీంతో ఈ ఇద్దరు టీనేజర్ల నడుమ టైటిల్ పోరు హోరాహోరీగాజరిగింది గొప్ప ఆట తీరును ప్రదర్శించి ఏమ్మా రదుకా ఈ టైటిల్ ను గెలుచుకుంది.. కాగా రదుకా ట్రోఫీతో పాటు దాదాపు రూ.18.38 కోట్లు (2.5 మిలియన్ల అమెరికా డాలర్లు) నగదు బహుమతి సొంతం చేసుకుంది. రన్నరప్ ఫెర్నాండెజ్ సుమారు రూ.9.19 కోట్లను అందుకుంది.

 • 2014 (సెరెనా) తర్వాత ఒక్క సెట్ కూడా కోల్పోకుండా యుఎస్ ఓపెన్ గెలిచిన తొలి మహిళా క్రీడా కారిణిగా రదుకాను నిలిచింది.
 • 1977 తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ ట్రోఫీ గెలిచిన తొలి బ్రిటీష్ అమ్మాయిగా రదుకాను రికార్డు సృష్టించింది. 44ఏళ్ల క్రితం ఆ దేశానికి చెందిన వర్జీనియా వింబుల్డన్లో విజేతగా నిలిచింది.
 • 18 ఏళ్ల రద్దుకాను 2004 (17 ఏళ్ల వయసులో షరపోవా. వింబుల్డన్ టైటిల్) తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ లో విజేతగా నిలిచిన అతి పిన్న వయసు క్రీడాకారిణిగా క్యాలిఫయర్ గా అడుగు పెట్టి గ్రాండ్  స్లామ్ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారిణి రదుకాను. తన రెండో గ్రాండ్లైమ్ లోనే టైటిల్ నెగిన ఆమె.. అతి తక్కువ గ్రాండ్గామ్ అనుభవంతో విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకుంది.

.

క్విక్ రివ్యు :

ఏమిటి: ‘యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్న ఏమ్మా రదుకా 

ఎవరు: ఏమ్మా రదుకా 

ఎప్పుడు: సెప్టెంబర్ 12

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ రజినీకాంత్ పటేల్  ఎన్నిక :

 గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ రజనీకాంత్ పటేల్ (59) సెప్టెంబర్ 12న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎటువంటి ప్రచారం లేనప్పటికీ ఈ ఎంపిక జరగడం విశేషం. ఉదయం తన నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని సాదా సీదాగా మెలిగిన ఆయనకు అనూహ్య పదోన్నతి లభించి౦ది ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడి పార్టీ కార్యాలయం ‘కమలం’లో జరిగిన  భాజాపా శాసనసభా పేక్షం సమావేశంలో ఆయన పేరును ముఖ్యమంత్రిగా గద్దె దిగుతున్న విజయ్ రూపాణీ గారు ప్రతిపాదించారు.

 • గుజరాత్ రాష్ట్ర రాజధాని ; గాంధీ నగర్
 • గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  : విజయ్ రూపాని
 • గుజరాత్ రాష్ట్ర గవర్నర్ : ఆచార్య దేవ్ వ్రథ్

క్విక్ రివ్యు :

ఏమిటి: గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ రజినీకాంత్ పటేల్  ఎన్నిక

ఎవరు: భూపేంద్ర భాయ్ రజినీకాంత్ పటేల్

ఎక్కడ: గుజరాత్

ఎప్పుడు: సెప్టెంబర్ 11

ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా  బాధ్యతలు స్వీకరించిన రాజా రణదీర్ సింగ్ :

స్విస్ ఫోర్జరీ విచారణలో షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సబా దోషిగా తీర్పునివ్వడంతో  భారత్ కు చెందిన రాజా రణధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.  ఈయన 1978 లో ఐదుసార్లు ఒలింపిక్ షూటర్ గా మరియు ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత గా ఆయనకు పేరుంది.

 • ఇండియన్ ఒలింపిక్ కమిషన్ స్థాపన :  1927
 • ఇండియన్ ఒలింపిక్ కమిషన్ ప్రదాన కార్యాలయం : న్యు డిల్లి
 • ఇండియన్ ఒలింపిక్ కమిషన్ సెక్రటరి జనరల్ : రాజీవ్ మెహతా
 • ఇండియన్ ఒలింపిక్ కమిషన్ ప్రస్తుత అద్యక్షుడు : నరేంద్ర బాత్రా

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా నిలిచిన బాధ్యతలు స్వీకరించిన రాజా రణదీర్ సింగ్

ఎవరు: రాజా రణదీర్ సింగ్

ఎప్పుడు: సెప్టెంబర్ 12

హర్యానా రాష్ట్రానికి నూతన లోకాయుక్తగా నియమితులయిన జస్టిస్ హరి పాల్ వర్మ :

పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హరిపాల్ వర్మ హర్యానా రాష్ట్రానికి నూతన లోకాయుక్తగా నియమితులయ్యారు. జస్టిస్ వర్మ దాదాపు ఏడు సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత ఆయన ఈ ఏడాది ఏప్రిల్లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుండి పదవీ విరమణ పొందారు.

 • హర్యానా రాష్ట్ర రాజధాని :చండీఘర్
 • హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి : మనోహర్ లాల్ ఖట్టర్
 • హర్యానా రాష్ట్ర గవర్నర్ : బండారు దత్తాత్రేయ

క్విక్ రివ్యు :

ఏమిటి: హర్యానా . రాష్ట్రానికి నూతన లోకాయుక్తగా నియమితులయిన జస్టిస్ హరి పాల్ వర్మ

ఎవరు: జస్టిస్ హరి పాల్ వర్మ

ఎప్పుడు: సెప్టెంబర్ 12

Daily current affairs in telugu September- 2021
Daily current affairs in telugu 01-09 -2021
Daily current affairs in telugu 02-09 -2021
Daily current affairs in telugu 03--09 -2021
Daily current affairs in telugu 04-09 -2021
Daily current affairs in telugu 05-09 -2021
Daily current affairs in telugu 06-09 -2021
Daily current affairs in telugu 07-09 -2021
Daily current affairs in telugu 08-09-2021
Daily current affairs in telugu 09-09 -2021
Daily current affairs in telugu 10-09 -2021
Daily current affairs in telugu 11-09 -2021
Daily current affairs in telugu 12-09 -2021

Daily current affairs in telugu 13-09 -2021
Daily current affairs in telugu 14-09 -2021
Daily current affairs in telugu 15-09 -2021
Daily current affairs in telugu 16-09 -2021
Daily current affairs in telugu 17-09 -2021
Daily current affairs in telugu 18-09 -2021
Daily current affairs in telugu 19-09 -2021
Daily current affairs in telugu 20-09 -2021
Daily current affairs in telugu 21-09 -2021
Daily current affairs in telugu 22-09 -2021
Daily current affairs in telugu 23-09 -2021
     

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *