Daily Current Affairs in Telugu 07-09-2021

Daily Current Affairs in Telugu 07-09-2021

RRB Group d Mock test

ఐసీసీ టీ20  బ్యాటింగ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన భారత మహిళా ప్లేయర్ షేఫాలి వర్మ  :

ఐసీసీ టీవీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ క్రీడాకారిణి షెఫాలి వర్మ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు.సెప్టెంబర్ 07న ప్రకటించిన ర్యాంకిం గ్స్ లో 759 పాయింట్లతో భారత మహిళా ప్లేయర్ షెఫాలి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. బెత్ మూనీ (744- ఆస్ట్రే లియా) ద్వితీయ స్థానం లో , టీమ్ ఇండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన (716) తృతీయ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ ర్యాంకిం గ్స్ లో దీప్తిశర్మ 6వ, పూనమ్ యాదవ్ 8వ ర్యాంకులు సాధించారు. ఆల్రౌండర్స్ ర్యాంకిం గ్స్ లో దీప్తిశర్మ నాలుగో స్థానంలో ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐసీసీ టీ20  బ్యాటింగ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన మహిళా ప్లేయర్ షేఫాలి వర్మ  

ఎవరు: టీమిండియ ప్లేయర్ షేఫాలి వర్మ

ఎప్పుడు: సెప్టెంబర్ 07

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక సలదారుగా రజనీష్ కుమార్ ను నియమించింది. మాజీ ఎస్.బి.ఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ గారు క్యాబినెట్ ర్యాంక్ పొజిషన్లో రెండేళ్ల పాటు ఉంటారు. రజనీష్ కుమార్ గారి నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో నుండి బయటపడటానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఎస్.బి.ఐ ఛైర్మన్ గా రిటైర్ అయిన రజనీష్ కుమార్ హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్లో స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకం

ఎవరు: రజనీష్ కుమార్

ఎక్కడ:  ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: సెప్టెంబర్ 07

టెస్టుల్లో వంద వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్ గా నిలిచిన జస్ ప్రిత్ బుమ్రా :

ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టుతో ఆడిన నాలుగో టెస్ట్ లో భారత బౌలర్ జస్ ప్రిత్ బుమ్రా  టెస్టుల్లో వంద వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్ గా నిలిచాడు.  ఇంతక ముందు కపిల్ దేవ్ పేరిట ఉన్న  ఈ రికార్డును  బూమ్రా అధిగమించాడు. జస్ ప్రీత్ బుమ్రా టెస్టు మ్యాచుల్లో 100 వికెట్లు తీసిన భారత బౌలర్లలో 8వ స్థానంలో బుమ్రా నిలిచాడు. కపిల్ దేవ్ 25 మ్యాచుల్లో 100 టెస్టు వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఇండియన్ బౌలర్ల జాబితాలో బుమ్ర 3వ స్థానంలో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో 127 పరుగులు సాధించిన టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: టెస్టుల్లో వంద వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్ గా నిలిచిన జస్ ప్రిత్ బుమ్రా

ఎవరు: జస్ ప్రిత్ బుమ్రా

ఎక్కడ:ఇంగ్లాండ్

ఎప్పుడు: సెప్టెంబర్ 07

భారతదేశంలోనే  మొదటి బయోఇటుక ఆధారిత భవనం ఐఐటి హైదరాబాద్ లో ప్రారంబం :

భారతదేశపు మొదటి బయోఇటుక ఆధారిత భవనం ఐఐటి హైదరాబాద్‌లో ప్రారంభించబడింది వ్యవసాయ వ్యర్థాల నుండి బయో ఇటుకలతో తయారు చేసిన భారతదేశపు మొదటి భవనం హైదరాబాద్ ఐఐటిలో ప్రారంభించబడింది. దీని నమూనా భవనం మెటల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వాటి సహాయం తో  చేయబడిన బయో-ఇటుకలతో రూపొందించబడింది. రూఫ్ కూడా వేడిని తగ్గించడానికి PVC షీట్లపై బయో-ఇటుకలతో తయారు చేయబడింది. మెటీరియల్ యొక్క బలం మరియు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి ఇది బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్‌మెంట్ నిర్మాణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది. గార్డ్ క్యాబిన్ యొక్క నమూనాను డిజైన్ చేసి, ఐ.ఐ.టి కేటాయించిన స్థలంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇది పదార్థం యొక్క బలం మరియు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్‌మెంట్ (BUILD) ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది. వేడిని తగ్గించడానికి పివిసి షీట్లపై బయో-ఇటుకలతో పైకప్పు కూడా తయారు చేయబడింది. బయో-ఇటుకలను వర్షం నుండి రక్షించడానికి లోపల మరియు వెలుపలి గోడలు సిమెంట్-ప్లాస్టర్ చేయబడ్డాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారతదేశంలోనే  మొదటి బయోఇటుక ఆధారిత భవనం ఐఐటి హైదరాబాద్ లో ప్రారంబం

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: సెప్టెంబర్ 07

భారత్ పెట్రో వనరుల లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్  గా ఎస్.రమేష్ నియామకం :

భారత్ పెట్రో వనరుల లిమిటెడ్ (BPRL) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా ఎస్ రమేష్ నియామకం కోసం పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 6 న జారీ చేసిన పర్సనల్ మినిస్ట్రీ ఆర్డర్ ప్రకారం, రమేష్ గారుఆ పదవికి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి అతని పదవీ విరమణ తేదీ వరకు అంటే జూలై 31, 2022 లేదా తదుపరి వరకు ఈ పదవిలో  నియమించబడ్డారు. ఆదేశాల ప్రకారం ఏది ముందు ఉంటే అది వర్తిస్తుంది.అతను ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.  .

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత్ పెట్రో వనరుల లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్  గా ఎస్.రమేష్ నియామకం

ఎవరు: ఎస్.రమేష్

ఎప్పుడు: సెప్టెంబర్ 07

ఆఫ్గనిస్తాన్ దేశ తాత్కలిక ప్రధానిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నియామకం :

అఫ్గానిస్థాన్ లో సర్కారు ఏర్పాటుపై ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. అక్కడ తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. తమ ముఠాలో శక్తిమంతమైన’రహబరీ శూరా’ అధినేతగా విభాగానికి ఉన్న ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ ను ప్రధానమంత్రిగా నియమించారు. రాజకీయ విభాగపు అగ్రనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కు ఉప ప్రధాని పదవిని కట్టబెట్టారు. ఈ మేరకు మొత్తం 33 మంది సభ్యులతో తాత్కాలిక కేబినెట్ రూపుదిద్దుకుంది. గత రెండు దశాబ్దాల్లో అమెరికా, నాటో దళాలపై పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కరడుగట్టిన తాలిబన్ అగ్ర నేతలకే అందులో కీలక పదవులు దక్కాయి. తాలిబనేరత నాయకులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటూ అంతర్జాతీయ సమాజం చేసిన సూచనలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. హక్కానీ నెట్వర్క్ ఉగ్రసంస్థ అధినేత సిరాజు ద్దీన్ హక్కానీ కొత్త ప్రభుత్వంలో కీలక పదవిని సొంతం చేసుకున్నారు. మహిళలెవరికీ చోటు దక్కలేదు. అఫ్గాన్ లో నూతన ఇస్లామిక్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆఫ్గనిస్తాన్ దేశ తాత్కలిక ప్రధానిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నియామకం

ఎవరు: ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్

ఎక్కడ: ఆఫ్గనిస్తాన్ దేశం

ఎప్పుడు:సెప్టెంబర్ 07

Daily current affairs in telugu August 2021
Daily current affairs in telugu 01-08-2021
Daily current affairs in telugu 02-08-2021
Daily current affairs in telugu 03-08-2021
Daily current affairs in telugu 04-08-2021
Daily current affairs in telugu 05-08-2021
Daily current affairs in telugu 06-08-2021
Daily current affairs in telugu 07-08-2021
Daily current affairs in telugu 08-08-2021
Daily current affairs in telugu 09-08-2021
Daily current affairs in telugu 10-08-2021
Daily current affairs in telugu 11-08-2021
Daily current affairs in telugu 12-08-2021
Daily current affairs in telugu 13-08-2021
Daily current affairs in telugu 14-08-202
Daily current affairs in telugu 15-08-2021
Daily current affairs in telugu 16-08-2021
Daily current affairs in telugu 17-08-2021
Daily current affairs in telugu 18-08-2021
Daily current affairs in telugu 19-08-2021
Daily current affairs in telugu 20-08-2021
Daily current affairs in telugu 21-08-2021
Daily current affairs in telugu 22-08-2021
Daily current affairs in telugu 23-08-2021
Daily current affairs in telugu 24-08-2021
Daily current affairs in telugu 25-08-2021
Daily current affairs in telugu 26-08-2021
Daily current affairs in telugu 27-08-2021
Daily current affairs in telugu 28-08-2021
Daily current affairs in telugu 29-08-2021
Daily current affairs in telugu 30-08-2021
     

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *