
Daily Current Affairs in Telugu 18&19-09-2021
భారత చదరంగ చరిత్రలో మరో గ్రాండ్‌మాస్టర్ గా నిలిచిన తెలంగాణా కుర్రాడు :

భారత చదరంగ చరిత్రలో మరో గ్రాండ్ మాస్టర్ (జీఎం ) అవతరించాడు. 17 ఏళ్ల తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్ సెప్టెంబర్ 19న జీఎం హోదా అందుకున్నాడు. తెలంగాణా రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన మూడో చెస్ ఆటగాడిగా. మొత్తంగా దేశంలో 70వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. తెలంగాణ నుంచి ఇప్పటికే అర్జున్ ఎరిగేసి, హర్ష భరత్ కోటి జీఎంలుగా కొనసాగుతున్నారు. హంగేరీలో జరుగుతున్న వెజర్ కోస్ట్‌లో గ్రాండ్ మాస్టర్ టోర్నీలో గొప్ప ప్రదర్శనతో నాలుగు రౌండ్ల నుంచి అయిదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న రిత్విక్. 2501 ఎలో రేటింగ్ చేరుకోవడంతో, జీఎం హోదా దక్కింది. ఈ టోర్నీ కంటే ముందే అను మూడు జీఎం నార్మ్ లు సొంతం చేసుకున్న ప్పటికీ రేటింగ్ 2496 ఉండడంతో జీఎం కాలేకపోయాడు. ఇప్పుడీ టోర్నీలో అయిదు పాయింట్లతో తన కలను నిజం చేసుకున్నాడు. నాలుగో రౌండ్ లో తెల్ల పావులతో ఆడిన రిత్విక్ 57ఎత్తుల లో ఫినెక్ (చెకోస్లోవేకియా)ను ఓడించడంతో జీఎం హోదా పొందడానికి అవసరమైన ఎలో రేటింగ్ ను చేరుకున్నాడు. ప్రపంచ చెస్ సమాఖ్య నిబంధనల ప్రకారం గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే మూడు జీఎం నార్మ్ లు దక్కించుకోవడంతో పాటు ఖాతాలో 2500 రేటింగ్ పాయింట్లు ఉండాలి. 2019 డిసెంబర్లోనే రిత్విక్ తన తొలి జీఎం నార్మ్ సాధించాడు. కరోనా కారణంగా మధ్యలో విరామం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో రెండో నార్మ్ సాధించిన అతను. ఈ నెలలోనే మూడో నార్మ్ అందుకున్నాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత చదరంగ చరిత్రలో మరో గ్రాండ్‌మాస్టర్ గా నిలిచిన తెలంగాణా కుర్రాడు
ఎవరు : రాజా రిత్విక్
ఎప్పుడు: సెప్టెంబర్ 18
భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఎఐ) ఉపాధ్యక్షుడిగా అమిత్ సంఘీ ఎన్నిక :

భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఎఐ) ఉపాధ్యక్షుడిగా అమిత్ సంఘీ ఎన్నికయ్యాడు. ప్రస్తుతం తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న అతను ఎన్ఆర్ఎఐకు నిర్వహించిన ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలిచినట్లు సెప్టెంబర్ 18 నప్రకటించారు. తెలంగాణ రైఫిల్ సంఘం సీనియర్ ఉపాధ్య క్షుడు నోరియా పాలకవర్గం సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రణిందర్ సింగ్ గారు సంఘం అధ్యక్షుడిగా నాలుగో సారి ఎన్నికయ్యాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఎఐ) ఉపాధ్యక్షుడిగా అమిత్ సంఘీ ఎన్నిక
ఎవరు : అమిత్ సంఘీ
ఎప్పుడు: సెప్టెంబర్ 18
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా :

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) రాజీనామా చేశారు. ‘అవమానభారంతో పదవి నుంచి వైదొలుగుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను తదుపరి సీఎంగా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించనని కుండబద్దలు కొట్టారు. కొత్త సీఎంను ఎన్నుకునే అధికారాన్ని సోనియాకు అప్పగిస్తూ పంజాబ్ సీఎల్పీ నిర్ణయించింది. అమరీందర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతికి తెరదించినట్ల యింది, కానీ రాబోయే ఎన్నికల్లో ఎవరు సారధ్యం వహిస్తారనే ప్రశ్న మొదలైంది. పంజాబ్ లో పతనా వస్థలో ఉన్న పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి నివ్వడంలో అమరీందర్ పాత్ర చాలా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా
ఎవరు : కెప్టెన్ అమరీందర్ సింగ్
ఎక్కడ: పంజాబ్ రాష్ట్ర౦
ఎప్పుడు: సెప్టెంబర్ 18
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం గెలుచుకున్న ప్రముఖ అనువాద రచయిత రంగనాధ రామచంద్ర రావు :

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావును కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వరించింది. కన్నడ రచయిత శాంతినాథ దేశాయి రచించిన” ఓం ణమో “ పుస్తకాన్ని రంగనాథ రామచంద్ర 2018లో తెలుగులోకి అనువదించారు. ఈ రచనే పురస్కారానికి ఎంపికైంది. 2020 సంవత్సరానికి గాను అకాడమీ.24 భాషల నుంచి ఎంపిక చేసిన అనువాద రచనలకు సెప్టెంబర్ 19 అనువాద పురస్కారాలను ప్రకటించింది. అకాడమీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని అకాడమీ కార్యనిర్వాహక మండలి సెప్టెంబర్ 19 ఇక్కడ సమావేశమై ఈ పురస్కారాల ఎంపికను ప్రతి భాషలో ముగ్గురి సభ్యులతో ಎಂಬ కమిటీ ఈ పురస్కారాలను సిఫారసు చేసింది. 2014 నుంచి 2018 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఎంపికకు ప్రాతిపదికగా తీసుకుంది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం ప్రదానం చేస్తారు. రంగనాథ రామచంద్రరావు అనేక కలం పేర్లతో రచనలు.చేశారు. సూర్యనేత్ర, స్పప్నమిత్ర, రంగనాథ, మన్వని, నిగమ్మ స్వరూపాదేవి తదితర కలం పేర్ల తో ఇప్పటివరకు 300కు పైగా వివిధ ప్రక్రియల్లో రచనలు, 250కు పైగా అనువాద కథలు, 140కి పైగా బాలల కథలు, 70కి పైగా సొంత కథలు అందించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం గెలుచుకున్న ప్రముఖ అనువాద రచయిత రంగనాధ రామచంద్ర రావు
ఎవరు : రంగనాధ రామచంద్ర రావు
ఎప్పుడు: సెప్టెంబర్ 18
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్ని కి ఎన్నిక :

పంజాబ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ చన్నీకి అవకాశం దక్కింది. సెప్టెంబర్ 19న సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అతను రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి అయిన మొదటి దళిత నాయకుడు గ నిలిచాడు. 2017 సంవత్సరం లో అతను పంజాబ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య మరియు పారిశ్రామిక శిక్షణ, ఉపా కల్పన మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం క్యాబినెట్ మంత్రిగా నియమించబడ్డాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి :: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్ని కి ఎన్నిక
ఎవరు : చరణ్ జిత్ సింగ్ చన్ని
ఎక్కడ: పంజాబ్
ఎప్పుడు: సెప్టెంబర్ 19
2020 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న తెలుగు సాహిత్య కవి నిఖిలేశ్వర్ :

ప్రముఖ తెలుగు సాహితీవేత్త, విప్లవకవి నిఖిలేశ్వర్ 2020 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకు న్నారు. ఆయన తెలుగులో రచించిన అగ్నిశ్వాస కవితా సంపుటి (2015-2017)కి పురస్కారం లభించింది. సెప్టెంబర్ 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని 22 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. కన్నడభాషలో కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ రచించిన శ్రీ బాహుబలి. అహింస దిగ్విజయం’ పుస్తకానికిగాను ఆయన ఈ పురస్కారం పొందారు. ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’ అనే ఆంగ్ల రచనకుగాను ప్రముఖ రచయిత్రి అరుంధతి సుబ్రమణ్యం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు పొందినవారికి లక్ష రూపాయల ప్రైజ్ మనీతోపాటు జ్ఞాపికను అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: : 2020 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న తెలుగు సాహిత్య కవి నిఖిలేశ్వర్
ఎవరు : తెలుగు సాహిత్య కవి నిఖిలేశ్వర్
ఎప్పుడు: సెప్టెంబర్ 19
ఆర్.సి.బి క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లి :

విరాట్ కోహ్లి తన అభిమానులకు మరోసారి షాకిచ్చాడు. టీ 20 ప్రపంచకప్ వరకే భారత టీ20 జట్టుకు సారథిగా ఉంటానని చెప్పిన ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ లోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ముగించాలని నిర్ణయించుకున్నాడు. నాయకుడిగా ఈ సీజనే తనకు ఆఖరిదని సెప్టెంబర్ 19న ప్రకటించాడు. క్రికెటర్ తన కెరీర్ ముగిసే వరకు బెంగళూరు జట్టుతో కొనసాగుతానని చెప్పాడు. “బెంగళూరు కెప్టెన్ గా ఇదే నా ఆఖరి ఐపీఎల్. ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ.. ఫ్రాంఛైజీ ప్రయోజనాల దృష్ట్యా సరైందని భావిస్తున్నా. గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా క్రికెటర్ గా కెరీర్ ముగిసేవరకు ఐపీ ఎల్లో బెంగళూరు జట్టుకే ఆడతాను.. కోహ్లి ఐపీ ఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్.సి.బి క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లి
ఎవరు : విరాట్ కోహ్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 19
ప్రముఖ సాహిత్యవేత్త, సామజిక కార్యకర్త మనోరమ మహాపాత్ర కన్నుమూత :

ప్రముఖ సాహిత్యవేత్త, సామజిక కార్యకర్త మరియు ఒడియా దినపత్రిక ‘ది సమాజ’ మాజీ ఎడిటర్ మనోరమ మొహపాత్ర కన్నుమూశారు ఆమెకు 1984లో సాహిత్య అకాడమీ అవార్డు, 1988 లో సోవియట్ నెహ్రూ అవార్డు, 1990 లో క్రిటిక్ సర్కిల్ ఆఫ్ ఇండియా అవార్డు, 1991 లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సమ్మన్, 1994 లో రూపంబర అవార్డు, ఉత్కల్ సాహిత్య సమాజ్ అవార్డు, గంగాధర్ మెహర్ సమ్మన్, సాహితీ ప్రవీణ అవార్డు, సుచరిత అవార్డు అందుకున్నారు. సాహిత్య రంగానికి ఆమె చేసిన అపారమైన కృషికి, ఆమె 1982 నుండి 1990 సాహిత్య రంగాని కి ఆమె చేసిన అపారమైన కృషికి, అమె 1982 నుండి 1990 వరకు ఉత్కల్ 1 లో ఒగిశా సాహిత్య అకాడమీ అధ్యక్షురాలిగా సాహిత్య సమాజ కార్యదర్శిగా మరియు నియమితులయ్యార: 1994 వరకు ఈ పదవిలో ఉన్న మొదటి మహిళగా ఆమె నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ సాహిత్యవేత్త, సామజిక కార్యకర్త మనోరమ మహాపాత్ర కన్నుమూత
ఎవరు : మనోరమ మహాపాత్ర
ఎక్కడ: మనోరమ మహాపాత్ర
ఎప్పుడు: సెప్టెంబర్ 19
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |