
Daily Current Affairs in Telugu 13-09-2021
ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అవార్డుకు ఎంపికైన మధ్యప్రదేశ్ లోని లద్పర ఖాస్ గ్రామం :

ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అవార్డుకు మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లాలోని లధ్పరా భాస్ ‘ఉత్తమ పర్యాటక గ్రామం గాఎంపికైనట్లు ఆ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ షియో శేఖర్ శుక్లా గారు ప్రకటించారు. మధ్యప్రదేశ్ గ్రామంతో పాటు మేఘాలయలోని కాంగ్జాంగ్ గ్రామం మరియు తెలంగాణలోని పోచంపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. మధ్యప్రదేశ్ లోని గ్రామాలు రూరల్ టూరిజం ప్రాజెక్ట్’ లో భాగంగా పర్యాటక గ్రామాలుగా మార్చబడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామీణ పర్యాటక కోణాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే దశాబ్దంలో 100 గ్రామాలను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రయోజనాల దృష్ట్యా అక్కడ ప్రదేశాల చుట్టూ ఉన్న సైట్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అవార్డుకు ఎంపికైన మధ్యప్రదేశ్ లోని లద్పర ఖాస్ గ్రామం
ఎవరు: లద్పర ఖాస్ గ్రామం
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: సెప్టెంబర్ 13
మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయిన పవన్ కుమార్ గోయెంకా :

మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్ గోయెంకా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ చైర్పర్సన్ నియమితులయ్యారు. మహీంద్రా గ్రూపుతో 27 సంవత్సరాలు గడిపిన తర్వాత, ఏప్రిల్ 1, 2021 న కంపెనీ ఎండి గా రిటైర్ అయ్యారు. IN-SPACE అనేది భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ కింద ఒక స్వతంత్ర నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఆర్గ న్ (ఇస్రో) కొత్త టెక్నాలజీలు, హ్యూమన్ స్పేస్ ఫైట్ ప్రోగ్రామ్ లు మరియు డీప్ స్పేస్ మిషన్లను నిర్మించడంపైన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సారిస్తుంది మరియు ఆపరేషనల్ శాటిలైట్లు, రాకెట్లు మరియు అప్లికేషన్లను న్యూ స్పేస్ ఇండియా లిమిటెడకు బదిలీ చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయిన పవన్ కుమార్ గోయెంకా
ఎవరు: పవన్ కుమార్ గోయెంకా
ఎప్పుడు: సెప్టెంబర్ 13
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కు ఎంపికైన జో రూట్ :

ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ICC player of the month) అవార్డులను ఇటీవల ఐసిసి ప్రకటించింది. మెన్ .వుమెన్స్ లలో క్రికెట్లో ఆగస్ట్ నెలకుగాను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఈ అవార్డులు వరించాయి. మెన్స్ క్రికెట్ విభాగం లో ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జో రూట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎంపికయ్యాడు. వుమెన్స్ క్రికెటర్ప్లేయర్ ఆఫ్ ఆగస్ట్ మంత్ గాను అమీర్ రిచర్వ్ నిలిచింది. ఐర్లాండ్ కు చెందిన క్రికెటర్ ఆమె. ఈమె టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫయర్ లో అద్భుతంగా రాణించింది. ఈ టోర్నీలో ఆమె 7 వికెట్లు తీసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కు ఎంపికైన జో రూట్
ఎవరు: జో రూట్
ఎప్పుడు: సెప్టెంబర్ 13
యాహూ సంస్థ నూతన చీఫ్ ఎగ్సిక్యుటివ్ గా నియమితులైన జిమ్ లాంజోస్ :

యాహూ సంస్థ జిమ్ లాన్జోన్ ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రకటించింది. గతంలో మిస్టర్ లాగ్ చాలా ప్రసిద్ధ డేటింగ్ యాప్ టిండెర్ యొక్క CEO గా పనిచేశారు, మరియు అతను 23 సంవత్సరాలుగా డిజిటల్ మీడియాలో పని చేస్తు మంచి అనుభవం కలిగి ఉన్నారు.. యాహూ ఇప్పటికీ 3జర్లలో అత్యంత ప్రాచుర్యం పొందింది, కంపెనీకి యాహూ ఫైనాన్స్ మరియు యాహు AOI వరకు ‘నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యాహూ సంస్థ నూతన చీఫ్ ఎగ్సిక్యుటివ్ గా నియమితులైన జిమ్ లాంజోస్
ఎవరు: జిమ్ లాంజోస్
ఎప్పుడు: సెప్టెంబర్ 13
భారత్ మరియు అమెరికా మద్య జరిగిన పర్యావరణ సంబంధిత చర్చలు :

పర్యావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన అంశాలపై ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకొనేందుకు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె.సింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక ప్రతినిధి(పర్యావరణ) జాన్ కెర్రీ సెప్టెంబర్ 13న దిల్లీలో సమావేశమయ్యారు. ‘భారత్-అమెరికా పర్యావరణ, శుద్ధ ఇంధన అజెండా 2030 భాగస్వామ్యం’లో భాగంగా వీరి భేటీ కొనసాగింది. అనంతరం కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ. ఇంధన పరివర్తన, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలకు మార్గ నిర్దేశం చేసేవిధంగా భారత్, అమెరికా కలిసి పనిచేయాలన్నది సమావేశ లక్ష్యమని పేర్కొంది. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 450 గెగావాట్లకు పెంచుకొనేలా భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని అమెరికా ప్రశంసించింది. 18 నెలల వ్యవదిలో 2.82కోట్ల గృహాలకు విద్యుత్తు సదుపాయాన్ని ఇళ్లకు కరెంటు సరఫరా చేయడంపైనా హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధనాలను నిల్వచేసుకోవడం అతి పెద్ద సమస్యగా ఉందని కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ తెలిపారు. పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తిలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు అమెరికా సహకరిస్తుందని జాన్ కెర్రీ హామీ ఇచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ మరియు అమెరికా మద్య జరిగిన పర్యావరణ సంబంధిత చర్చలు
ఎవరు: భారత్ మరియు అమెరికా
ఎప్పుడు: సెప్టెంబర్ 13
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ రమీజ్ రజా :

మాజీ కెప్టెన్ రమీజ్ రజా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాడు. సెప్టెంబర్ 13న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పీసీబీ ఏకగ్రీవంగా అతడిని ఈ పదవికి ఎన్నుకుంది. పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. రమీజ్న చైర్మన్ గా ప్రతిపాదించాడు. పీసీబీలో పని చేయడం అతడికి ముఖ్య కార్య నిర్వాహణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అధికారికంగా చైర్మన్ గా లేకపోయినా గత కొన్ని రోజులుగా రమీజ్ పాక్ క్రికెట్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే జట్టు ప్రస్తుత ఛైర్మన్ ఇహ్సన్ మణి గత నెలలోనే తన మూడేళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. హఫీజ్, జావెద్ బుర్కీ ఇజాజ్ బట్ తర్వాత పీసీబీ చైర్మన్ అయిన నాలుగో క్రికెటర్ గా రమీజ్ నిలిచాడు మరోవైపు టీ20 ప్రపంచకప్ కోసం కొత్త కోచ్‌లుగా హేడెన్ (బ్యాటింగ్), ఫిలాండర్ (బౌలింగ్)ను పీసీబీ నియ మించింది
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ రమీజ్ రజా
ఎవరు: మాజీ క్రికెటర్ రమీజ్ రజా
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: సెప్టెంబర్ 13
యుఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న రష్యా ఆటగాడు మెద్వెదేవ్ :

యుఎస్ ఓపెను సంచలన ముగింపు అయింది. పురుషుల సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ కు కన్నీళ్లను మిగిలిస్తూ మెద్వెదేవ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ మెద్వెదేవ్ 6–4, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో టాప్ సీడ్ జకోవిచ్ ను ఓడించాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకూ ఈ ఏడాది గ్రాండ్ స్లామ్ గా అజేయంగా నిలిచిన 34 ఏళ్ల జకోకు తొలి ఓటమి రుచి చూపాడు. పాయింట్లు గెలుస్తూ గేమ్‌లు సాధిస్తూ. మ్యాచ్‌లు సొంతం చేసుకుంటూ సాగుతూ కోర్టులో ఉత్సాహంగా కనిపించే జకోవిచ్ ఈ మ్యాచ్ లో మాత్రం అనవసర తప్పిదాలు చేస్తూ. ఒత్తిడికి లోనై కోపం ప్రదర్శిస్తూ రాకెట్‌ను నేలకు కొడుతూ అసహనం వ్యక్తం చేస్తూ కనిపించాడు. అందుకు కారణం అమోఘమైన ఆటతీరుతో తనపై ఆధిపత్యం చలాయించిన మెద్వెదెవ్ ను అడ్డుకోలేకపోవడమే కాగా ఈ ఆరున్నర అడుగులున్న 25 ఏళ్ల మెద్వెదేవ్ 2000 (సఫిన్) తర్వాత యు.ఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి రష్యా ఆటగాడిగా మెద్వెదేవ్ నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న రష్యా ఆటగాడు మెద్వెదేవ్
ఎవరు: రష్యా ఆటగాడు మెద్వెదేవ్
ఎప్పుడు: సెప్టెంబర్ 13
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |