Daily Current Affairs in Telugu 08-09-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 08-09-2021

RRB Group d Mock test

టీ20 ప్రపంచకప్ భారత జట్టు మెంటార్ గా ఎం.ఎస్ ధోని నియామకం :

 టి-20 ప్రపంచకప్ లో  పోటీపడే భారత జట్టుకు మాజీ కెప్టెన్ ధోనీని మెంటార్ గా నియమించింది. 2007లో కెప్టెన్ గా జట్టుకు తొలి టి20 ప్రపంచకప్ అందించిన ధోని తర్వాతి ఐదు టోర్నీలలో కూడా సారథిగా వ్యవహరించారు. ఐపీఎల్ లో మినహా రెండేళ్లుగా టీమిండియాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న అతను.బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం ‘మెంటార్ గా ఉండేందుకు అంగీకరించాడు. కెప్టెన్, కోచ్ తో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు.ఇక టోర్నీ సంబంధించి సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 08న 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. టోర్నీ అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్ లో  జరుగుతుంది. అక్టో బరు 24న పాకిస్థాన్ తో పోరుతో టీమ్ ఇండియా టైటిల్ వేట ఆరంభమవుతుంది.

  • బి.సి.సి.ఐ అద్యక్షుడు :సౌరభ్ గంగూలి
  • బి.సి.సి.ఐ స్థాపన :1928
  • బి.సి.సి.ఐ ప్రధాన కార్యాలయం : ముంబై
  • ఐ.సి.సి  చైర్మన్ :గ్రెగ్ బార్క్లే

క్విక్ రివ్యు :

ఏమిటి: టీ20 ప్రపంచకప్ భారత జట్టు మెంటార్ గా ఎం.ఎస్ ధోని నియామకం

ఎవరు: ఎం.ఎస్ ధోని

ఎప్పుడు: సెప్టెంబర్ 08

ఉత్త రాఖండ్ గవర్నర్ పదవికి రాజీనామా ప్రకటించిన  బేబీ రాణి మౌర్య  :

ఉత్త రాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య బుధ వారం తన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం మరో రెండేళ్లు  ఉండగా వ్యక్తిగత  కారణాల వల్ల రాజీనామా చేసినట్లు రాజ్ భవన్ అధికారి ఒకరు తెలిపారు.  మౌర్య తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు. కాగా ఆమె క్రియాశీలక రాజ కీయాల్లోకి వెళ్లేందుకు తన పదవికి రాజీనామా చేశారన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 5న ఆమె ఢిల్లీలో అమిత్ షాతో” భేటీ కావడం ఊహాగనాలకు  తావిస్తోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తు బాజపాతో సుదీర్ఘ అనుబంధం ఉన్న మౌర్య 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆగ్రాకు మొదటి మహిళా మేయర్ గా పనిచేసిన ఆమె  (1995-2000 ) మధ్య  ఈఘనత ఆమె సాధించారు. 2002-2005 మధ్య జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారు.

  • ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని : వేసవిలో (గైర్ సన్ ) శీతాకాలం లో (డెహ్రాడూన్)
  • ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : పుష్కర్ సింగ్ దామి

క్విక్ రివ్యు :

ఏమిటి: ఉత్త రాఖండ్ గవర్నర్ పదవికి రాజీనామా ప్రకటించిన  బేబీ రాణి మౌర్య

ఎవరు: బేబీ రాణి మౌర్య

ఎక్కడ: ఉత్త రాఖండ్ రాష్ట్రం

ఎప్పుడు: సెప్టెంబర్ 08

ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్‌గా సతీష్ పరేఖ్ నియామకం :

సతీష్ పరేఖ్ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.  అశోక బిల్డ్‌కాన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రమోటర్ సతీష్ పరేఖ్ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (IRF) ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతను సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మాజీ డైరెక్టర్ గా సుబ్‌మయ్ గంగోపాధ్యాయ్ గారి నుండి బాధ్యతలు స్వీకరించాడు. జెనీవా ఆధారిత గ్లోబల్ రోడ్ సేఫ్టీ బాడీ IRF ప్రపంచవ్యాప్తంగా మెరుగైన మరియు సురక్షితమైన రోడ్ల నిర్మాణం కోసం పనిచేస్తోంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్‌గా సతీష్ పరేఖ్ నియామకం

ఎవరు: సతీష్ పరేఖ్

ఎప్పుడు: సెప్టెంబర్ 08

అడోబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రతివ మహాపాత్ర నియామకం :

అడోబ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా ప్రతివ మహాపాత్ర నియమితులయ్యారు.  టెక్నాలజీ రంగంలో పాతికేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె పీడబ్ల్యూసీలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇటీవల వరకు ఐబీఎంలో పనిచేశారు. అడోబ్ లో ఆమె అడోబ్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్, అడోబ్ క్రియేటివ్ క్లౌడ్, అడోబ్ డాక్యుమెంట్ క్లౌడ్ ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరిస్తారని సంస్థ వెల్లడించింది. మొహపాత్రా అడోబ్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్, అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ మరియు అడోబ్ డాక్యుమెంట్ క్లౌడ్ అడోబ్ ఇండియా బిజినెస్ కు నాయకత్వం వహిస్తుంది. అడోబ్ ఇండియాకు ఒక మహిళ నేతృత్వం వహించడం ఇదే ప్రథమం.

క్విక్ రివ్యు :

ఏమిటి: అడోబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రతివ మహాపాత్ర నియామకం

ఎవరు: ప్రతివ మహాపాత్ర

ఎప్పుడు: సెప్టెంబర్ 08

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా సెప్టెంబర్ 08 :

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు వ్యక్తులు, సంఘాలు మరియు సమాజాలకు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత మరియు మరింత అక్షరాస్యత కలిగిన సమాజాల పట్ల తీవ్ర ప్రయత్నాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించింది. దీనిని 1967లో మొదటిసారిగా జరుపుకున్నారు .యునెస్కో (UNESCO) 1990 సంవత్సరాన్ని అక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించింది.55వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యొక్క థీమ్ మానవ-కేంద్రీకృత పునరుద్ధరణ కోసం అక్షరాస్యత: డిజిటల్ విభజనను తగ్గించడంగా ఉంది..

క్విక్ రివ్యు :

ఏమిటి: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా సెప్టెంబర్ 08 :

ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా

ఎప్పుడు: సెప్టెంబర్ 08

Daily current affairs in telugu September- 2021
Daily current affairs in telugu 01-09 -2021
Daily current affairs in telugu 02-09 -2021
Daily current affairs in telugu 03--09 -2021
Daily current affairs in telugu 04-09 -2021
Daily current affairs in telugu 05-09 -2021
Daily current affairs in telugu 06-09 -2021
Daily current affairs in telugu 07-09 -2021
Daily current affairs in telugu 08-09-2021
Daily current affairs in telugu 09-09 -2021
Daily current affairs in telugu 10-09 -2021
Daily current affairs in telugu 11-09 -2021
Daily current affairs in telugu 12-09 -2021

Daily current affairs in telugu 13-09 -2021
Daily current affairs in telugu 14-09 -2021
Daily current affairs in telugu 15-09 -2021
Daily current affairs in telugu 16-09 -2021
Daily current affairs in telugu 17-09 -2021
Daily current affairs in telugu 18-09 -2021
Daily current affairs in telugu 19-09 -2021
Daily current affairs in telugu 20-09 -2021
Daily current affairs in telugu 21-09 -2021
Daily current affairs in telugu 22-09 -2021
Daily current affairs in telugu 23-09 -2021
     

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *