
Daily Current Affairs in Telugu 14-09-2021
ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 ను గెలుచుకున్న హైదరాబాద్ కు చెందిన ఇక్రిసాట్ :

హైదరాబాద్ కు చెందిన ఇక్రిసాట్ సంస్థ ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 ను గెలుచుకుంది. హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీ-అరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) కి సహారా ఆఫ్రికాలో ఆహార భద్రతను మెరుగుపరిచినందుకు ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 లభించినట్లు ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యాలోని నైరోబిలో జరుగుతున్న ఆఫ్రికా ఫోరమ్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (AGRF) 2021 సమ్మిట్ లో ఈ అవార్డును అందజేశారు. సహారా ఆఫ్రికాలోని 13 దేశాలలో ఆహార భద్రతను మెరుగుపరిచిన ఉష్ణమండల పప్పుధాన్యాల ప్రాజెక్ట్ కోసం దానికి చేసిన కృషికిగాను ఇక్రిసాట్ కు ఈ అవార్డును .
- ICRISAT అనగా International Crops Research Institute for the Semi Arid Tropics
- ఇక్రిసాట్ స్థాపన : 1972
- ఇక్రిసాట్ ఉన్న ప్రదేశం : పటాన్ చెరువు
- ఇక్రిసాట్ యొక్క విధి : ఇది గ్రామీణాభివృద్ధి కోసం వ్యవసాయ పరిశోధనను నిర్వహిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 ను గెలుచుకున్న హైదరాబాద్ కు చెందిన ఇక్రిసాట్
ఎవరు: ఇక్రిసాట్
ఎక్కడ: హైదరబాద్
ఎప్పుడు : సెప్టెంబర్ 14
నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ గా జస్టిస్ ఎం.వేణు గోపాల్ నియామకం :

జస్టిస్ ఎం వేణుగోపాల్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) యొక్క ప్రస్తుత చైర్పర్సన్ నియమితులయ్యారు. NCLAT వెబ్ సైట్ తాజా అప్డేట్ ప్రకారం, జస్టిస్ వేణుగోపాల్ గారు సెప్టెంబర్ 11, 2021 నుండి అప్పీలేట్ ట్రిబ్యునల్ యాక్టింగ్ చైర్పర్సన్ గా ఉండనున్నారు.. అతను మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి. గా పని చేసారు. అతను జూన్ 5, 1997 న తమిళనాడు స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ సబ్ జడ్జిగా చేరాడు మరియు ఆతరువాత నవంబర్ 2007 లో మద్రాస్ హైకోర్టుకు పదోన్నతి పొంది కొన్ని సంవత్సరాలు పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ గా జస్టిస్ ఎం.వేణు గోపాల్ నియామకం
ఎవరు: జస్టిస్ ఎం.వేణు గోపాల్
ఎప్పుడు : సెప్టెంబర్ 14
శ్రీలంక ఫేస్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటింపు :

పదునైన యార్కర్లతో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ను దశాబ్దానికి పైగా వణికించిన శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఆటగాడిగా క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్ నుంచి రిటైరైన ఈ 38 ఏళ్ల పేసర్ టీ20లతో పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.టీ20 గొప్పబౌలర్లలో ఒకడిగా పేరున్న మలింగ. 2014 టీ20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించాడు. మలింగ 2011లోనే టెస్టులలో రిటైరయ్యాడు. ఆ తర్వాత వన్డేలకు క్రికెట్ నుంచి కూడా గుడ్ బై చెప్పిన టీ20ల్లో మాత్రం కొనసా గాడు. ఇప్పుడు పొట్టి క్రికెటు కూడా వీడ్కోలు పలికాడు. అతడు చివరిసారి 2020 మార్చిలో మార్చిలో శ్రీలంక తరపున తన చివర టీ20 మ్యాచ్ ఆడాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ లో పోటీ పడే లంక జట్టులో అతడికి చోటు దక్కలేదు. మలింగ మూడు ఫార్మాట్లలో కలిపి 546 వికెట్లు పడగొట్టాడు. అతడు 84 వన్డేల్లో 107 వికెట్లు చేజిక్కించుకున్నాడు. 226 వన్డేల్లో 338, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్ మలింగనే. ఐపీఎల్ 122 మ్యాచ్లో 170 వికెట్లు చేజిక్కించుకు న్నాడు.
- శ్రీలంక దేశ రాజధాని : కోలో౦బో’
- శ్రీలంక దేశ అద్యక్షుడు : గటబాయ రాజపక్స
- శ్రీలంక దేశ ప్రదాని : మహీంద్రా రాజపక్స
- శ్రీలంక దేశ ODI క్రికెట్ జట్టు కెప్టెన్ : దాసుణ్ షనక
క్విక్ రివ్యు :
ఏమిటి: శ్రీలంక ఫేస్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: లసిత్ మలింగ
ఎక్కడ: శ్రీ లంక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
జింబాబ్వే మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు వికెట్ బ్రెండన్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటింపు:

జింబాబ్వే దేశ మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. టేలర్ 2004 లో శ్రీలంకతో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు మరియు అంతర్జాతీయ క్రికెట్ లో జింబాబ్వే క్రికెట్ జట్టు యొక్క అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు అయ్యాడు. టేలర్ 204 వన్డే మ్యాచ్ లు ఆడి 6677 పరుగులు చేశాడు.
- జింబాబ్వే దేశ రాజదాని :హరారే
- జింబా౦బ్వే దేశ అద్యక్షుడు : ఏమ్మర్సాన్ మంగాగ్వ
క్విక్ రివ్యు :
ఏమిటి: జింబాబ్వే మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ బ్రెండన్ టేలర్
ఎవరు: బ్రెండన్ టేలర్
ఎక్కడ: జింబాబ్వే దేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
హింది దివాస్ గా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 :

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీని కేంద్ర ప్రభుత్వం హిందీని అధికార భాషగా ప్రకటించి సరిగ్గా నేటికి 72 ఏండ్లు పూర్తయ్యాయి. ఏటా సెప్టెంబర్ 14 న హిందీ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. సంస్కృతం ప్రపంచంలోని తొలి భాషగా పరిగణిస్తుంటారు. ప్రపంచంలో అత్యంత అర్ధమయ్యే భాషగా మారింది. సుదీర్ఘ చర్చ తర్వాత, రాజ్యాంగ పరిషత్ సెప్టెంబర్ 14న హిందీని భారతదేశ అధికారిక భాషగా నిర్ణయించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 (1) లో పేర్కొన్నారు. దీని ప్రకారం, భారతదేశ అధికారిక భాష ‘హిందీ’ స్క్రిప్ట్ ‘దేవనాగరి’లో ఉంటుంది. 1953 నుంచి హిందీ ప్రచారం కోసం ఏటా సెప్టెంబర్ 14న హిందీ దివాస్ ను నిర్వహిస్తున్నారు. 1963 లో అధికారిక భాషా చట్టాన్ని తీసుకురావడంతో ఏ భాషలోనైనా అధికారిక పనులు చేసే హక్కు రాష్ట్రాలకు ఇవ్వబడింది. ప్రస్తుతం, దేశంలో 22 భాషలకు అధికారిక భాష హోదా లభించింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాషగా హిందీ నిలిచింది. మన దేశంలో 77 శాతం మంది హిందీ మాట్లాడతారు. అర్థం చేసుకుంటారు. చదువుతారు.
- భారత్ లో కేంద్ర ప్రబుత్వం గుర్తించిన భాషల సంఖ్య :22 భాషలు
- భాషల గురించి రాజ్యాంగం లో 8 వ షెడ్యుల్ తెలుపుతుంది .
- భారత్ లో ఎక్కువగా మాట్లాడే భాష : హింది
క్విక్ రివ్యు :
ఏమిటి: హింది దివాస్ గా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14
ఎవరు: భారత ప్రభుత్వం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |