
Daily Current Affairs in Telugu 26-09-2020
మహిళల సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నీతూ డేవిడ్ నియామకం:

భారత మహిళల సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నీతూ డేవిడ్‌ను బిసిసిఐ నియమించింది.హేమలత కళ స్థానంలో ఆమె బాద్యతలు స్వీకరించనుంది.మిధు ముఖర్జీ ,రేణు మార్గరెట్ ,ఆర్తి వైద్య కల్పన కమిటీలో ఇతర సబ్యులు వీళ్ళందరూ భారత మాజీ క్రికేటర్లె. సీనియర్ అయిన మాజీ లెగ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ అయిదుగురు సబ్యుల సెలక్షన్ కమిటీ కి నాయకత్వం వహిస్తుంది. భారత్ తరపున వన్డే లలో మహిళల క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నీతూ (141) రెండో స్థానంలో ఉంది .వన్డేలో 100 వికెట్లు తీసిన భారత తొలి బౌలర్ ఆమె అని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.నీతూ భారత మహిళల జట్టు తరపున 10టెస్టులు ,90వన్డేలు మ్యాచ్ లు ఆడింది.ఒక టెస్టులో ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డు (8/53) నెలకొల్పింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళ ల సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నీతూ డేవిడ్ నియామకం
ఎవరు: నీతూ డేవిడ్
ఎప్పుడు: సెప్టెంబర్ 26
ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల్లో నరేంద్ర మోడి కి దక్కిన నాలుగో స్థానం :

ప్రపంచంలోనే అత్యంత అరాద్యులైన 20మంది పురుషుల జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కి నాలుగో స్థానం దక్కింది.బాలివుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (14వ స్థానం)భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి (16స్థానం) బాలివుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు 17స్థానం కూడా ఈ జాబితాలో ఉన్నారు. 42దేశాలలో సర్వే నిర్వహించిన” యవ్ గన్ సంస్థ” దీన్ని తాయారు చేసింది.అమెరికా మాజీ అద్యక్షుడు బరాక్ ఒబామా ఇందులో మొదటి స్థానం లో ఉండగా సాఫ్ట్ వేర్ దిగ్గజం అయిన బిల్ గేట్స్ చైనా అద్యక్షుడు జిన్ పింగ్ లు రెండు మూడు స్థానాలలో ఉన్నారు.బౌద్ద మత గురువు దలైలామా (8వ స్థానం) రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (12),అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (15) క్రైస్తవ మత గురువు పాప్ ఫ్రాన్సిస్ కు 18స్థానం చోటు దక్కింది.భారత్ లో అత్యంత ఆరాధ్య పురుషుల జాబితాలో మోది అగ్రస్తాన౦ లో ఉండగా ఆ తర్వాతి స్థానాలలో వరుసగా రతన్ టాటా ,మాజీ క్రికెటర్ ఎం.ఎస్ ధోని ఉన్నారు.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎదవ స్థానంలో ,విరాట్ కోహ్లి 09వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల్లో నరీంద్ర మోడి కి దక్కిన నాలుగో స్థానం
ఎవరు: నరీంద్ర మోడి
ఎప్పుడు: సెప్టెంబర్ 26
కరోనా గుర్తింపు కిట్ ను అబివృద్ది చేసిన భారతీయ విజ్ఞాన సంస్థ :

కరోనా వైరస్ ను గుర్తించే కిట్ ను భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సి)కి అనుబందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈక్విన్ బయోటెక్ అంకురా పరిశ్రమ అబివృద్ది చేసింది.పరీక్షను తెలికాగా చౌకగా ఖచ్చితమైన పలితాలను రాబట్టేందుకు రూపొందించిన కిట్ ను “గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ కిట్” గా పేరు పెట్టారు.పూర్తి గా దేశీయ సాంకేతికతతో రూపొందించిన ఈ ఉపకరణం రివర్స్ ట్రాన్స్ స్క్రిప్తేజ్ పాలిమ రేస్ చైన్ రియాక్షన్ విధానంలో పని చేస్తుందని ఈక్విన్ బయోటెక్ వ్యవస్థాపకుడు ఐఐఎస్సి జీవ రసాయన శాఖ ఆచార్యుడు ఉత్పల్ టబు తెలిపారు.కరోన అనుమానితుడి నుంచి సేకరించిన నమూనాలతో గంటన్నర లోగా పలితాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది అని వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కరోనా గుర్తింపు కిట్ ను అబివృద్ది చేసిన భారతీయ విజ్ఞాన సంస్థ :
ఎవరు: ఈక్విన్ బయోటెక్ అంకురా
ఎక్కడ: బెంగళూర్
ఎప్పుడు:సెప్టెంబర్ 26
ప్రముఖ ఆర్ధిక వేత్త ఇషార్ అహ్లువాలియా కన్నుమూత :

ప్రఖ్యాత ఆర్థిక వేత్త పద్మభూషణ్ అవార్డు గ్రహీత భారత అంతర్జాతీయ ఆర్ధిక సంబందాల పరిశోధన మండలి (ఐసిఆర్‌ఐఈఆర్) చైర్ పర్సన్ ఇషార్ జడ్జ్ అహ్లువాలియా (74)క్యాన్సర్ తొ పోరాడుతూ సెప్టెంబర్ 26న కన్నుమూసారు.ఆమె గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పని చేసిన మంటేంగ్ సింగ్ అహ్లువాలియా సతిమణి. అనారోగ్యంతో కారణంగా ఆమె గత నెల ఐసిఆర్‌ఐఈఆర్ చైర్ పర్సన్ పదవి నుంచి ఆమె తప్పుకున్నారు.ఇషార్ జడ్జ్ రచించిన ఇండస్త్రియాల్ గ్రోత్ ఇన్ ఇండియా ప్రోడక్టివిటి అండ్ గ్రోత్ ఇన్ ఇండియా మాను ఫాక్చరింగ్ పుస్తకాలు అత్యంత ప్రభావశీలమైనవిగా గుర్తింపు పొందాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ ఆర్ధిక వేత్త ఇషార్ అహ్లువాలియా కన్నుమూత
ఎవరు: ఇషార్ అహ్లువాలియా
ఎప్పుడు: సెప్టెంబర్ 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |