Daily Current Affairs in Telugu 11-10-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question ‘
డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా రాము అబ్బాగాని నియామకం :
డొమినికన్ రిపబ్లికన్ లో భారత రాయబారిగా 2001 లో బ్యాచ్ ఐ.ఎ ఎస్ అధికారి రాము అబ్బాగాని గారు నియమితులయ్యారు .ప్రస్తుతం కేంద్ర విదేశాంగశాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పని చేస్తున్న ఆయన్ను డొమినికన్ రిపబ్లికన్ రాయబారిగా నియమిస్తూ విదేశాంగ శాఖ అక్టోబర్ 11 న ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాద్యతలు చేపట్టనున్నారు .ఈయన స్వస్తలం హనుమకొండ అక్కడి మర్కాజి ప్రభుత్వ ఉన్నత పాటశాలలో విద్య పూర్తి చేసారు .ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు.ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో బి.వి.ఎస్సి అం.వి.ఎస్సి చేసారు. ఆయన 2001 లో ఇండియన్ ఫారిన్ సర్వీసును ఎంపికయ్యారు. జపాన్ ,థాయ్ ల్యాండ్ లలోని భారతీయ రాయబార కర్యాలయలలోను పని చేసారు.
- డొమినికన్ రిపబ్లిక్ రాజదాని :శాంటో డోమింగో
- డొమినికన్ రిపబ్లిక్ కరెన్సీ : డొమినికన్ పెసో
క్విక్ రివ్యు :
ఏమిటి: డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా రాము అబ్బాగాని నియామకం
ఎవరు: రాము అబ్బాగాని
ఎక్కడ: డొమినికన్ రిపబ్లిక్
ఎప్పుడు: అక్టోబర్ 11
ఆర్ధిక శాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను ముగ్గిరికి దక్కిన నోబెల్ ప్రైజ్ :
కనీస వేతనాల పెంపుదల పలితాలను విశ్లేశింసిన అమెరికాకు చెందిన డేవిడ్ కార్ట్ కు ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్ బహుమతి లబించింది. మరో ఇద్దరు ఆర్తికవేత్తలతో కలిసి ఆయన ఈ బహుమతి పంచుకోనున్నారు. కార్ట్ తో పాటు అమెరికా కే చెందిన జాషువా అన్గ్రిస్ట్, గైడో ఇంబేన్స్ లకు ఈ ఏడాది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమి ప్రకటించిది. బహుమతి మొత్తం లో సగాన్ని డేవిడ్ కార్ట్ కు మిగతా సగాన్ని జాషువా గైడో అందజేస్తారు. లేబర్ మార్కెట్ వలసలు విద్యపై కనీస వేతనాల ప్రభావాన్ని కార్ట్ విశ్లేషించారు.అలాగే ఆర్ధిక శాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మమైన పరిశోదన లపై సహకారం అందించినందుకు జాషువా గైడో లకు కూడా ఈ పురస్కారం ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమి తెలిపింది. సామాజికంగా ఎదురవుతున్న పలు ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాదానం ఇవ్వవచ్చు అని శాస్త్రవేత్తలకు డేవిడ్ జాషువా ఇంబేన్స్ రుజువు చేసారవి అకాడమి ప్రసంసించింది. వీరు ఆవిష్కరించిన సహజ ప్రయోగాలు వాస్తవ జీవిత పరిస్తితులు ప్రపంచంపై ఎలాంటి ప్రభావమ చూపుతాయనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయని పేర్కొంది.కనీస వేతనాల పెంపుతో ఉద్యోగాల్లో సైతం పెరుగుదల నమోదు అయిందని అమెరికాలో డేవిడ్ కార్ట్ చేసిన అద్యయనంలో తెలియవచ్చింది. సామాజిక శాస్త్రంలో కార్యాచరణ ప్రభావంతో సామాజిక శాస్త్రంలో పెద్ద సమస్యలకు సైతం పరిష్కారాలు లబిస్తాయనే విషయాన్నే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు నిరూపించారని నోబెల్ అకాడమి పేర్కొంది.
- నోబెల్ బహుమతి స్థాపన :1895
- నోబెల్ బహుమతి ని స్థాపించింది : ఆల్ఫ్రైడ్ నోబెల్
- 2021 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్న వ్యక్తులు : మరియ రేసా,దిమిత్రి మురాటోవ్
- 2021 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి దక్కించుకున్న వ్యక్తులు : సుకురో మనాబె), క్లాస్ హాజల్మాన్ ,జార్జియో పారిసి
- 2021 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రం లో నోబెల్ బహుమతి దక్కించుకున్న వ్యక్తులు: బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మెక్ మిలన్
- 2021 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రం లో నోబెల్ బహుమతి దక్కించుకున్న వ్యక్తులు : డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్
- 2021 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్కించుకున్న వ్యక్తులు : అబ్దుల్ రజాక్ (టాంజానియా)
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్ధిక శాస్త్రం లో 2021 సంవత్సరానికి గాను ముగ్గిరికి దక్కిన నోబెల్ ప్రైజ్
ఎవరు: డేవిడ్ కార్ట్, జాషువా అన్గ్రిస్ట్ ,గైడో ఇంబేన్స్
ఎక్కడ: స్వీడన్
ఎప్పుడు: అక్టోబర్ 11
వయలార్ రామ వర్మ స్మారక సాహిత్య పురస్కారం ను అందుకున్న బెన్మానిన్ :
ప్రముఖ మళయాళ రచయిత బెన్మానిన్ తన యొక్క మంత్లి రిలే 20 కమ్యునిస్ట్ వర్షంగల్ అనే పుస్తకానికి గాను ఆమె 45 వ వయలార్ రామ వర్మ స్మారకసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. రాజకీయ వ్యంగ్యంతో కూడిన ఈ నవల మంతలిర్ అనే నాన్ దేస్మిస్ట్ అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. మరియు రెండు దశాబ్దాలలో దాని సంస్కృతి మతం మరియు రాజకీయ ప్రభావం గురించి వివరిస్తుంది. వయలార్ రామ వర్మ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక పురస్కారం రూ.లక్ష రూపాయల నగదుబహుమతిని ప్రముఖ శిల్పి కనాయి కునిరామన్ రూపొందించిన శిల్పం మరియు ప్రశంసా పత్రం ఇస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వయలార్ రామ వర్మ స్మారక సాహిత్య పురస్కారం ను అందుకున్న బెన్మానిన్
ఎవరు: బెన్మానిన్
ఎప్పుడు: అక్టోబర్ 11
ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2021 అవార్డు దక్కించుకున్న జి.సతీష్ రెడ్డి :
భారత దేశంలోనే వ్యోమగామి ని ప్రోత్సహించడం లో జీవిత కాల అత్యుత్తమ కృషికి గాను సెక్రటరి డి.డి.ఆర్ &డి మరియు చైర్మన్ డి.ఆర్.డి. డాక్టర్ జి.సతీష్ రెడ్డి కి ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) ప్రతిష్టాత్మక ఆర్యబట్ట అవార్డును ప్రదానం చేసింది.అవార్డ్ ఫంక్షన్ యు.ఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూర్ లో జరిగింది.డాక్టర్ జి.సతీష్ రెడ్డి అధునాతన ఎవియానిక్స్ ,నావిగేషన్ మరియు క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన మరియు అబివృద్ది మార్గదర్శకుడు గా ఉన్నారు.
- డి.ఆర్.డి.వో సంస్థ ఏర్పాటు:1958
- డి.ఆర్.డి.వో ప్రధాన కార్యాలయం : న్యుడిల్లి
- డి.ఆర్.డి.వో సంస్థ చైర్మన్ : జి.సతీష్ రెడ్డి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2021 అవార్డు దక్కించుకున్న జి.సతీష్ రెడ్డి
ఎవరు: జి.సతీష్ రెడ్డి
ఎప్పుడు: అక్టోబర్ 11
అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా అక్టోబర్ 11:
అంతర్జాతియ బాలికల దినోత్సవం గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతుల గళాన్ని విస్తరించడానికి మరియు వారు ఎదుర్కొన్న సమస్యలపై అవగాహన పెంచడానికి ఈ రోజును యునైటెడ్ నేషన్ ప్రకటించినది. ఈ పరిశీలన బాలికలకు మరిన్ని అవకాశాలకు మద్దతు ఇస్తుంది.మరియు వారి లింగం ఆదారంగా బాలికలు ఎదుర్కొనే లింగ సమానత్వం పైన అవగాహన పెంచుతుంది. సమానత్వం విద్య పోషణ చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ మరియు వివక్ష నుంచి రక్షణ వంటి ప్రస్తావన కలిగి ఉంటుంది. 2012 లో మొదటి అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా జరిగింది. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కెనడా తీర్మానంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించారు. మరియు డిసెంబర్ 19,2011 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 11 ను అంతర్హతియ బాలికల దినోత్సవం స్వీకరించే తీర్మానాన్ని ఆమోదించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా అక్టోబర్ 11
ఎవరు: యునైటెడ్ నేషన్
ఎప్పుడు: అక్టోబర్ 11
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |