Daily Current Affairs in Telugu 09&10-10-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question ‘
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అదితి మహేశ్వరి దక్కిన అరుదైన గౌరవం:
ఢిల్లీ యూనివర్సిటీ పరిధి లోని మిరండా హౌస్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల అదితీ మహేశ్వరి అనే విద్యార్ధినికి అరుదైన అవకాశం లభించింది. భారత్ లోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయంలో ఒక్కరోజు హై కమిషనర్ గా వ్యవహించే గౌరవం దక్కింది. రాజస్థాన్లోని చిత్తోరడక్ చెందిన అదితీ కి బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం నిర్వ హించిన ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’ పోటీలో గెలుపొందడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది. అక్టోబర్ 09 న బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయానికి వచ్చిన ఆమె అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఉద్గారాల కట్టడికి సంబంధించి భారత్, యూకే అధికారుల మధ్య జరిగిన చర్చలతో పాటు మరికొన్ని కార్యక్రమాలను పరిశీలించారు. మహిళల నాయకత్వానికి సంబంధించిన చర్చలో పాల్గొన్నారు.. బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఆరోజుకు డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అదితి మహేశ్వరి దక్కిన అరుదైన అవకాశం
ఎవరు: అదితి మహేశ్వరి
ఎప్పుడు: అక్టోబర్ 09
తెలంగాణ హైకోర్టు. నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ :
తెలంగాణ హైకోర్టు. నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అక్టోబర్ 11 ఉదయం 11.05 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు దీనికి హాజరవుతారు. జస్టిస్ శర్మ అక్టోబర్ 11 న రాత్రి హైదరాబాద్ చేరుకుని ఓ హోటల్లో బసచేశారు. ఆయనకు పలువురు న్యాయాధికారులు, ప్రొటోకాల్ అధికారులు స్వాగతం పలికారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
ఎవరు: జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
ఎక్కడ: : తెలంగాణ రాష్ట్రం
ఎప్పుడు: అక్టోబర్ 09
టర్కిష్ గ్రాండ్ ఫార్ములావన్ టైటిల్ ను గెలుచుకున్న వాల్టెరీ బొటాస్ :
టర్కిష్ గ్రాండ్ ఫార్ములావన్ టైటిల్ ను వాల్టెరీ బొటాస్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 10న జరిగిన ఫైనల్ రేసులో ఈ మెర్సీడెజ్ డ్రైవర్ 26 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాక్స్ వెరాపెన్ (రెడ్ బుల్, 18) రెండో స్థానం సాధించగా. అదే జట్టుకు చెందిన సెర్గియో వెరెజ్ (15) మూడో స్థానంలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెజ్, 10) అనూహ్యంగా అయిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైర్లు మార్చడంలో ఆలస్యం కావడంతో అతడు వెనకబడిపోయాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టర్కిష్ గ్రాండ్ ఫార్ములావన్ టైటిల్ ను గెలుచుకున్న వాల్టెరీ బొటాస్
ఎవరు: వాల్టెరీ బొటాస్
ఎప్పుడు: అక్టోబర్ 09
సాహితీ పురస్కారానికి పండితుడు డా.కోవెల సుప్రసన్నాచార్య ఎంపిక :
తెలంగాణ సారస్వత పరివార్ నెలకొల్పిన పోలూరి హనుమజ్జానకీరామ శర్మ సాహితీ పురస్కారానికి పండితుడు డా.కోవెల సుప్రసన్నాచార్య ఎంపికయ్యారు.ఈ అవార్డును ఈనెల 13న పరిషత్తులోని డా. దేవులపల్లి రామానుజ రావు కళామందిరంలో ప్రధానం చేయనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై రూ.25 వేల నగదు. జ్ఞాపికతో సుప్రసన్నాచార్యను సత్కరిస్తారు. పరిషత్తు ఓ ప్రకటనలో పేర్కొంది. సంస్థ ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య రచించిన ‘డా. దేవులపల్లి రామానుజరావు’ గ్రంథాన్ని ఈ కార్యక్ర మంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నెల్లూరులోని వీఆర్ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు తెలుగు పాఠాలు బోధించిన విఖ్యాత కవి పోలూరి హనుమజ్ఞానకీరామశర్మ ను పేరిట ఈ సాహితీ పురస్కారం నెలకొల్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సాహితీ పురస్కారానికి పండితుడు డా.కోవెల సుప్రసన్నాచార్య ఎంపిక
ఎవరు: డా.కోవెల సుప్రసన్నాచార్య
ఎప్పుడు: అక్టోబర్ 09
బల్గేరియన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన ఇమాద్ ఫారూఖ్ :
హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖ్ అక్టోబర్ 10న ముగిసి బల్గేరియన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సామియా 16-21, 21-20, 21-11తో రెండో సీడ్ ఒద్దె బేరక్ (టర్కీ)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత్ కు చెందిన మీరాబా లువాంగ్ మైన్నమ్ 21-19, 7-21, 21-14తో ఐదో సీడ్ డానియల్ నికోలవ్ (బల్గేరియా)పై నెగ్గి బైటిల్ దక్కించుకున్నాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: బల్గేరియన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ఇమాద్ ఫారూఖ్
ఎవరు: ఇమాద్ ఫారూఖ్
ఎప్పుడు: అక్టోబర్ 09
‘యాంటీ డ్రగ్ సెల్’ ఏర్పాటు అనే కార్యక్రమం ను ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం :
మహారాష్ట్ర హోం శాఖా మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను మాదకద్రవ్యాల దాడిలో పట్టుకున్న తర్వాత ప్రతి జిల్లాలో ఒక ‘యాంటీ డ్రగ్ సెల్’ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల బెడదను అరికట్టడానికి మాదక ద్రవ్యాల యొక్క వాడకం అరికట్టడం కోసం ప్రతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అధ్యక్షతన యాంటీ-డ్రగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘యాంటీ డ్రగ్ సెల్’ ఏర్పాటు అనే కార్యక్రమం ను ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ఎవరు: మహారాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: మహారాష్ట్ర
ఎప్పుడు: అక్టోబర్ 09
జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలిస్ శాఖ :
రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. జాతీయ భద్రతాదళ విభాగం (ఎన్ఎ) ‘అగ్ని పరీక్ష 7 పేరుతో హరియాణాలో ఈ పోటీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ లు, ఇందులో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ లతో పాటవివిధ ఆయుధాలతో ఫైరింగ్, మారథాన్ రన్నింగ్, శారీరక ధారుడ్య పోటీలు నిర్వహించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బృందం మొదటి స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఎన్ఎస్ఓతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన బృంధాలు పాల్గొన్నాయి. ఏపీ అక్టోపస్ విభాగం మొదటి స్థానం సాధించడమే కాకుండా ఉత్తమ జట్టుగా కూడా నిలిచింది. రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎ.పాపారావు ఉత్తమ ఆల్రౌండర్గా ఎంపికయ్యారు
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలిస్ శాఖ
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ౦
ఎక్కడ: హరియాణా
ఎప్పుడు: అక్టోబర్ 09
పాకిస్థాన్ అణు పితామహుడైన శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదీర్ కన్నుమూత :
వివాదాస్పద శాస్త్రవేత్త, పాకిస్థాన్ అణు పితామహుడిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ ఖదీర్ ఖాన్(85) కన్నుమూశారు. ఇటీవలే కొవిడ్ నుంచి కోలుకున్న ఖదీర్ శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఊపిరితిత్తుల్లో రక్త స్రావం కావడంతో ఇస్లామాబాద్ లో ఆయన పేరు మీదే ఉన్న ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీస్ ఆసుపత్రిలో అక్టోబర్ 10 ఉదయం తుదిశ్వాస విడిచారు. ఖదీర్ మృతిపై పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్థాన్ అణు పితామహుడైన శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదీర్ కన్నుమూత
ఎవరు: అబ్దుల్ ఖాదీర్
ఎక్కడ: పాకిస్థాన్
ఎప్పుడు: అక్టోబర్ 09
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |