Daily Current Affairs in Telugu 08&9 October – 2022
దేశంలోనే మొదటి సారి 24 గంటలపాటు సౌర శక్తిని ఉపయోగించుకుంటున్న గ్రామంగా నిలిచిన మోదేరా గ్రామం :

గుజరాత్ రాష్ట్రం లోని మోధేరా గ్రామం భారతదేశం యొక్క మొదటి 24×7 పాటు సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రకటించింది.ప్రధాని మోడీ 9 అక్టోబర్ 2022 న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని మోధేరాను భారతదేశంలోని మొదటి 24×7 సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రకటించారు. గ్రామంలో నేలపై అమర్చిన సోలార్ పవర్ ప్లాంట్. మరియు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి 1,300 కంటే ఎక్కువ పైకప్పు సౌర వ్యవస్థలు ప్రతి ఇంటి పైన అమర్చబడ్డాయి. కాగ ఈ ప్రాజెక్టులో 780 కోట్లకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి .
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే మొదటి సారి 24 గంటలపా టు సౌర శక్తిని ఉపయోగించుకుంటున్న గ్రామంగా నిలిచిన మోదేరా గ్రామం
ఎవరు : మోదేరా గ్రామం
ఎక్కడ : గుజరాత్ లోని మోదేరా గ్రామం
ఎప్పుడు : అక్టోబర్ 08
జాతీయ క్రీడం బీచ్ వాలీబాల్‌లో స్వర్ణ పథకం గెలుచుకున్న తెలంగాణా జట్టు :

జాతీయ క్రీడం బీచ్ వాలీబాల్‌లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ జట్లు మెరిశాయి. పురుషుల విభాగంలో తెలంగాణ స్వర్ణం, ఆంధ్ర ప్రదేశ్ రజత పతకాలు సాధించాయి.. అక్టోబర్ 09 న జరిగిన ఫైనల్లో తెలంగాణ 2-21, 20-21, 15-11తో ఆంధ్రప్రదేశ్ పై గెలుపొందింది. తెలంగాణ జట్టులో కృష్ణ చైతన్య మహేశ్. ఆంధ్రప్రదేశ్ తరపున నరేశ్, కృష్ణంరాజు ప్రతిభ కనబరిచారు. కనోయింగ్ లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు లభించాయి. సి1 1000 మీ స్ప్రింట్‌లో ఫిరంబం అమిత్ కుమార్నింగ్, సి2 1000 మీ స్ప్రింట్‌లో ప్రదీపకుమార్ మూడో స్థానాల్లో నిలిచి కాంస్యాలు గెలుచుకున్నారు. బాక్సింగ్‌లో సెమీఫై నేల్ చేరిన తెలంగాణ కుర్రాడు మహ్మద్ హుసాముద్దీన్ పతకం నాయం చేశాడు. 57 కేజీల క్వార్టర్స్ లో అతడు రోహిత్ మోర్‌ను ఓడించి ముందలు వేశాడు. పురుషులు టెన్నిస్ డబుల్లో ఆంద్ర ప్రదేశ్ కు చెందిన శాసరాజు శివదీష్/ అనంతమణి ముని బోడ్ కారం వేతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్బాల్ పోటీలో ఫైనల్లో ప్రవేశించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ క్రీడం బీచ్ వాలీబాల్‌లో స్వర్ణ పథకం గెలుచుకున్న జాతీయ క్రీడం బీచ్ వాలీబాల్‌లో స్వర్ణ పథకం గెలుచుకున్న తెలంగాణా జట్టు
ఎవరు : తెలంగాణా జట్టు
ఎప్పుడు : అక్టోబర్ 08
రెండో ఏడాదీ ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ గా నిలిచిన మాక్స్ వెర్ స్టాఫన్ :

రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్ స్టాపెన్ సాధించాడు. ఈ సీజన్లో ట్రాక్ట్ప తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ 25 ఏళ్ల నెదర్లాండ్స్ డ్రైవర్ ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. జపనీస్ గ్రాండ్ ప్రిలో జయకేతనం ఎగురవేసి వరుసగా రెండో ఏడాదీ ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. వర్షం కారణంగా కుదించిన రేసులో అతను దూసుకెళ్లాడు వర్షంలోనే రేసు ఆరంభించిన నిర్వాహకులు రెండు ల్యాబ్‌ల తర్వాత అదేశారు. ఆ వాతావరణ పరిస్థితుల్లో కొన్ని కారు ప్రమాదా లకు గురి కావడమే అందుకు కారణం రెండు గంటల తర్వాత తిరిగి 53కు గాను 28 ల్యాప్స్ కు కుదించి రేసును మొదలెట్టారు పోల్ పొజిషన్ నుంచి. రేపు ప్రారంభించిన వెరా పెన్ 3 గంటల ఒక్క నిమిషం 44,001 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పెరెక్ (రెముల్), లెల్లెర్స్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఏడు సార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెజ్) అయిదో స్థానానికి పరిమి తమయ్యారు. కానీ ఈ రేసు విజేతకు ఎస్ఐఏ పూర్తి 25 పాయింటు ఇవ్వడంతో అతను మరో నాలుగు గ్రాండ్ ప్రి రేవలు మిగిలి ఉండగానే టైటిల్ ఖాయం చేసుకున్నాడు. ప్రపంచ చాంపియ జాబితాలో 335 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న పెరెజ్ (250) మిగిలిన నాలుగు రేసుల్లో నెగినా వ వేర్ స్టాఫన్ ను అదిగమించలేదు
క్విక్ రివ్యు :
ఏమిటి : రెండో ఏడాదీ ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ గా నిలిచిన మాక్స్ వెర్ స్టాఫన్
ఎవరు : మాక్స్ వెర్ స్టాఫన్
ఎప్పుడు : అక్టోబర్ 08
ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్య పథకం గెలుచుకున్న హర్షద గరుడ్ :

ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో భారత అమ్మాయి హర్చద గరుడ సత్తా చాటింది. మహిళల 45 కేజీల విభాగంలో ఆమె కాంస్యంతో మెరిసింది. స్కాన్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 64 కేజీలు ఎత్తిన ఈ భారత టీనే జర్ మొత్తం మీద 152 కేజీలు లిఫ్ట్ చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో కాంగ్ సెంగ్ (వియత్నాం. 166 కేజీలు) స్వర్ణం నెగ్గగా హరితో ((ఇండోనేసియా 162 కేజీలు) రజతం సాధించింది. “ఈ మేలో జరిగిన జూనియర్ ప్రపంచ ఛాయయన్ షప్ హచ్చక స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా కీపర్ గా చరిత్ర సృష్టించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్య పథకం గెలుచుకున్న హర్షద గరుడ్ :
ఎవరు : హర్షద గరుడ్
ఎప్పుడు : అక్టోబర్ 08
వెస్టిండీస్ క్రికెటర్ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్ పై నాలుగేళ్ల నిషేధం విదింపు :

వెస్టిండీస్ క్రికెటర్ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్‌పై నాలుగేళ్ల నిషేధం పడింది. నిషేధిత ఉత్ప్రేరకాల నియమావలిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఈ ఏప్రిల్ల లో తన ఇంటి వద్ద రక్తం నమూనాలు ఇవ్వడానికి క్యాంప్ బెల్ నిరాకరించాడని జమైకా డోపింగ్ నిరోధక కమిషన్ తెలిపింది. ఇలా ప్రవర్తించడం డోపింగ్ నిరోధక నియమావళికి వ్యతిరేకమని, అందుకే అతడిపై నిషేధం పడిందని ముగురు సభ్యుల కమిషన్ చెప్పింది. క్యాంప్‌బెల్ నికుండ మీరితేదీ మే 10 నుంచి ఈ నిషేధం అమల్లోకి చేస్తుంది. వెస్టిండీస్ తరపున 20 బెనలతో పాటు 6 బిలు 2 లో క్యాంప్ బెల్ ఆడారు. చివరిగా ఈ బంగ్లాదేశ్ తో టైపులో అతడు బరిలో దిగాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : వెస్టిండీస్ క్రికెటర్ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్ పై నాలుగేళ్ల నిషేధం విదింపు
ఎవరు : వెస్టిండీస్ క్రికెటర్ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్
ఎప్పుడు : అక్టోబర్ 09
జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న గోవా రాష్ట్రం :

గోవా రాష్ట్రం మరోసారి జాతీయ క్రీడలకు వేదికగా ఎంపికైంది. వచ్చే: ఏడాది అక్టోబరులో గోవా జాతీయ క్రీడలను నిర్వహిస్తుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా లభించిందని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తెలిపింది. ఇప్పటివరకు గోదా ఒక్కసారి జాతీయ క్రీడలకు ఆతిధ్య మివ్వలేదు. 2008 జాతీయ క్రీడలను గోవా నిర్వహించాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో కుదరలేదు. తర్వాత ఆ రాష్ట్రానికి అవకాశాలు వచ్చినా. వివిధ కారణాలతో క్రీడలు వాయిదా పడుతూ వచ్చాయి 2020లో గోవాలో జరగాల్సిన ఆటలు కోవిడ్-19 కారణంగా రద్దయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ లోపు 30న జాతీయ క్రీడలకు నిర్వహించడం కుదరదని గోవా చెప్పడంతో ఈసారి గుజరాత్ కు అవకాశం దక్కింది. కాగా 31వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి గోవాకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఈనెల 12న జరిగే 36 జాతీయ క్రీడల ముగింపు ఉత్సవంలో జాతీయ క్రీడలు జెండాను గోవా అందుకోనుంది అని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న గోవా రాష్ట్రం
ఎవరు : గోవా రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : గోవా రాష్ట్రం
ఎప్పుడు : అక్టోబర్ 09
ప్రపంచ చాంపియన్నిలిచిన భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అడ్వాణీ :

మంచి నీళ్ల ప్రాయంగా ప్రపంచ టైటిళ్లు సాధించడం అలవాటు చేసుకున్న భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అడ్వాణీ మరో సారి ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. అక్టోబర్ 08 న ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్) చాంపియన్‌షిప్స్ అతను జయకేతనం ఎగురవేశాడు. ఫైనల్లో 4-0 తేడాతో.. భారత్ కు చెందిన సౌరబ్ కొఠారిపై విజయం సాధించాడు. ఇది పంకజ్ కు 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. ఈ చాంపియన్‌షిప్ లో వరుసగా అయిదో టైటిల్, ఏడు ప్రేమ్ ఫైనల్లో ఆరంభం నుంచే పంకజ్ దూకుడు ప్రదర్శించాడు. తొలి ఫ్రేం లో ఆటతీరుతోనే టైటిల్ అతనిదేనని స్పష్టమైంది. ఆ తర్వాత వరుసగా మూడు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్ ముగించాడు. కరోనా కారణంగా మూడేళ్ల విరామం తర్వాత నిర్వహించిన టోర్నీ లో పంకజ్ అదిపత్యాన్ని కొనసాగించాడు. రికార్డు స్థాయిలో అయిదోసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ చాంపియన్నిలిచిన భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అడ్వాణీ
ఎవరు : పంకజ్ అడ్వాణీ
ఎప్పుడు : సెప్టెంబర్ 09
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: గా అక్టోబర్ 10 :

ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి మరియు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా ప్రయత్నాలను సమీకరించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటగా 1992లో వారి చొరవతో జరుపుకున్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్. 2022 థీమ్ ‘ప్రపంచవ్యాప్తంగా అందరికీ మానసిక ఆరోగ్యాన్ని అందించండి గా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: గా అక్టోబర్ 10
ఎవరు : ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : సెప్టెంబర్ 10
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |