Daily Current Affairs in Telugu 08 November – 2022
నేషనల్ మ్యాన్యుమేంట్ అథారిటీ చైర్మన్ గా ప్రొఫెసర్ కిషోర్ కుమార్ బాసా నియామకం :

నేషనల్ మ్యాన్యుమేంట్ అథారిటీ (ఎన్.ఎం.ఎ)చైర్మన్ గా ప్రొఫెసర్ కిషోర్ కుమార్ బాసా గారు నియమితులయ్యారు.ఆయన పదవి కాలం మూడేళ్ళ పాటు ఉంటుంది.బాస బరిపడ లోని మహారాజా శ్రీరామా చంద్ర భంజ్ డియో విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ మరియు భారత దేశ౦ లో అతిపెద్ద మానవ శాస్త్ర సంఘం అయిన ఇండియన్ నేషనల్ కాన్ఫడరేషణ్ మరియు అకాడమి ఆఫ్ అంత్రాలజిస్ట్ చైర్మన్ గా కూడా ఉన్నారు.సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నేషనల్ మ్యాన్యూ మెంట్స్ అథారిటీ 2010 లో అమలులోకి వచ్చిన పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాలు సవరణ మరియు దృవికరణ చట్టం 2010యొక్క నిబంధనల ప్రకారం భారత్ ఏర్పాటు చేయబడింది.స్మారక చిహ్నాలు రక్షణ మరియు సంరక్షణ కోసం NMA అనేక విధులు కేటాయించబడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ మ్యాన్యుమేంట్ అథారిటీ చైర్మన్ గా ప్రొఫెసర్ కిషోర్ కుమార్ బాసా నియామకం
ఎవరు : కిషోర్ కుమార్ బాసా
ఎప్పుడు : నవంబర్ 07
ఫోర్బ్స్ ఆసియా నవంబరు మ్యాగజైన్లో ముగ్గురు భార మహిళా వ్యాపారవేత్తలకు చోటు :

ఫోర్బ్స్ ఆసియా నవంబరు మ్యాగజైన్లో ముగ్గురు భార మహిళా వ్యాపారవేత్తలకు చోటు దక్కింది. మూడేళ్ల పాటు కరోనా పరిణా మాలతో ఇబ్బంది పెట్టినా, వ్యాపారాలను తమదైన వ్యూహాలతోముందుకు నడిపించిన 20 మంది ఆసియా మహిళలతో ఓ జాబితాను ఫోర్బ్స్ ప్రచురించింది.
- భారత్ నుంచి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మండల్, ఎమ్ క్యూర్ ఫార్మా భారత వ్యాపార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా దాపర్, హొనాసా కన్జూమర్ సహ-వ్యవస్థాపకులు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గజల్ అలఘ్ ఈ జాబితాలో నిలిచారు.
- కొంత మంది మహిళలు నౌకాశ్రయాలు, స్థిరాస్తి, నిర్మాణ రంగంవంటి కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన విభాగాల్లో టెక్నాలజీ, ఔషధ, కమడిటీ రంగాల్లోనూ రాణించారని పోర్భ్స్ కొనియాడింది.
- ఆస్ట్రేలియా చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా. జపాన్, సింగపూర్, తైవాన్, థాయ్ లాండ్ దేశాల మహిళలూ ఈ జాబితాలో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫోర్బ్స్ ఆసియా నవంబరు మ్యాగజైన్లో ముగ్గురు భార మహిళా వ్యాపారవేత్తలకు చోటు
ఎప్పుడు : నవంబర్ 07
ప్రతిష్టాత్మకమైన బెయిలీ కె ఆష్ఫర్డ్ పతకం గెలుచుకున్న డాక్టర్స్ సుభాష్ బాబు :

భారత వైద్య పరిశోధకుడు డాక్టర్ సుభాష్ బాబును ప్రతిష్టాత్మకమైన బెయిలీ.కె.ఆష్ఫర్డ్ పతకం వరించింది. ఉష్ణమండల వ్యాధులకు సంబంధించి “ప్రపంచంలోనే అతిపెద్ద శాస్త్రీయ సంస్థ ‘అమెరికన్ ఎ. సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ ఈ ‘మేరకు ప్రకటించింది. అలాగే ఫెలో ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ అవార్డ్ కు ఆయనను ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఒక భారతీయుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఉష్ణమండల ప్రాంత వ్యాధులపై పరిశోధనలకు గాను సుబాష్ కు ఈ గౌరవందక్కింది. చెన్నైలోని ఐసీఈ, ఆర్-ఇండియా సంస్థలో సైంటిఫిక్ డైరెక్టర్ గా ఆయన వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మకమైన బెయిలీ కె ఆష్ఫర్డ్ పతకం గెలుచుకున్న డాక్టర్స్ సుభాష్ బాబు
ఎవరు : డాక్టర్స్ సుభాష్ బాబు
ఎప్పుడు : నవంబర్ 07
2022 సంవత్సరానికి గాను సెక్సియెస్ట్ మ్యాన్ “అలైవ్ గా ఎంపికైన సినీ నటుడు క్రిస్ ఎవాన్స్ :

సినీ నటుడు క్రిస్ ఎవాన్స్(41)కు ఒక అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది. సెక్సియెస్ట్ మ్యాన్ “అలైవ్ గా ఆయనను ఎంపిక చేసినట్లు పీపుల్ మేగజీన్ ప్రకటించింది. నవంబర్ 08న స్టీవెన్ కోల్బె ర్ట్ రేట్ నైట్ షోలో తొలుత ఈ నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని మేగజీన్ వెబ్ సైట్ ద్వారా తెలియజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 సంవత్సరానికి గాను సెక్సియెస్ట్ మ్యాన్ “అలైవ్ గా ఎంపికైన సినీ నటుడు క్రిస్ ఎవాన్స్
ఎవరు : క్రిస్ ఎవాన్స్
ఎప్పుడు : నవంబర్ 07
దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించనున్న స్కై రూట్ ఏరో స్పేస్ :

దేశీయంగా అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పడనుంది. తొలిసారిగా ఒక ప్రైవేటు రంగ మళ్ళీ అందులోనూ హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ రూపొందించిన రాకెట్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ మంచి ప్రయోగించనున్నారు. తమ తొలి రాకెట్ ‘విక్రమ్.ఎస్ ‘ను వాతావరణ అనుకూలతను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 12 నుంచి 16లోపు ప్రయోగించ స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రయోగానికి “ప్రారంభ్” అని పేరు పెట్టారు
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించనున్న స్కై రూట్ ఏరో స్పేస్
ఎవరు : స్కై రూట్ ఏరో స్పేస్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు : నవంబర్ 07
2022 క్లైమేట్ యొక్క తాత్కాలిక స్థితిని విడుదల చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ :

ప్రపంచ వాతావరణ సంస్థ 2022 నివేదికలో గ్లోబల్ క్లైమేట్ యొక్క తాత్కాలిక స్థితిని విడుదల చేసింది.నివేదిక ప్రకారం గ్రీన్ హౌస్ వాయు సాంద్రత లు పెరగడం మరియు పేరుకుపోయిన వేడి కారణంగా గత ఎనిమిది సంవత్సరాలు గా రికార్డ్ స్థాయిలో ఎనిమిది అత్యంత వేడి కలిగిన స్థితులు ఉన్నాయి.విపరీతమైన వేడిపెరుగుదల కరువు మరియు వినాశకరమైన వరదలు మిలియన్ ల మందిని ప్రభావితం చేస్తుంది. మరియు ఈ సంవత్సరం దీనికి గాను బిలియన్ లు ఖర్చు చేశాయని కూడా పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 క్లైమేట్ యొక్క తాత్కాలిక స్థితిని విడుదల చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ
ఎవరు : ప్రపంచ వాతావరణ సంస్థ
ఎప్పుడు : నవంబర్ 07
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |