Daily Current Affairs in Telugu 11 November – 2022
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లకు అతిత్యం ఇవ్వనున్న భారత్ :

గ్లోబల్ గవర్నింగ్ బాడీకి అవసరమైన రుసుము చెల్లించనందుకు పురుషుల ఈవెంట్ యొక్క హోస్టింగ్ హక్కులను దేశం తొలగించిన రెండేళ్ల తర్వాత, 2023లో న్యూ ఢిల్లీలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 2006 & 2018లో చాంపియన్‌షిప్‌లను నిర్వహించి దేశంలో మహిళల పోటీ నిర్వహించడం ఇది మూడోసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లకు అతిత్యం ఇవ్వనున్న భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : నవంబర్ 11
ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ పసిడి పథకం గెలుచుకున్న భారత్ :

ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ లో భారత బాక్సర్లు పసిడి మోత మోగించారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (75 కేజీ)తో పాటు పర్వీన్ హుదా (63 కేజీ), స్వీటీ (81 కేజీ), అల్ఫియా బాన్ (81 రేజీల పైన) స్వర్ణాలతో మెరిశారు. నవంబర్ 11న మహిళల 75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5-0తో రజ్ మెటోవా (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది ఈ పోరులో లవ్లీనా, రజ్మా టోవా ఆరంభం నుంచి పరస్పరం దాడులు చేసుకున్నారు. కానీ చక్కని డిఫెన్స్ ప్రత్యర్థిని అద్దుకున్న లవ్లీనా కీలక సమయాల్లో ఇలమైన పంచ్ తో పైచేయి సాధించింది. ఒక పంచ్ రజిమెటోవాకు గట్టిగా తాకడంతో ఏరి బాటను అనేసి లవ్లీచాడు విజేతగా ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన తర్వాత ప్రపంచ చాంపియన్షిప్: కామన్వెల్త్ క్రీడల్లో రాజించలేకపోయిన ఆఫ్రినాడు ఇది స్ఫూర్తినిచ్చే విజయమే మరో ఫైనల్లో పర్విన్ హుడా 5- 10తో కిలో మాయ్ (జపాన్) ను చిత్ర చేయగా స్వీటీ అంత తేడాతో యెన్షన్ (ఈజిపాన్)ను ఓడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ పసిడి పథకం గెలుచుకున్న భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : నవంబర్ 11
ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ భారత యువ షూటర్ దివ్యాంక్ సింగ్ పన్వర్ :

ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత యువ షూటర్ దివ్యాంక్ సింగ్ పన్వర్ సత్తా చాటాడు. కొరి యాలో జరుగుతున్న టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ విభాగంలో ‘అతడు స్వర్ణం సాధించాడు. పసిడి పతక పోరులో దివ్యాంక్ 17-9లో బాంగ్ సెంగో (కొరియా)ను ఓడించాడు. ర్యాంకింగ్ రౌండ్లో 260.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన దివ్యాంక్ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించాడు. ర్యాంకింగ్ రౌండ్లో, మూడో స్థానం సాధించిన మరో భార్య మాటర్ శ్రీకార్తీక్స్ (258 8) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ కిరణ్ జాదవ్ రజత పథకం నెగ్గాడు.ఫైనల్లో అతడు 10-16 తో ఫార్ హజున్ (కొరియా) చేతిలో ఓడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ భారత యువ షూటర్ దివ్యాంక్ సింగ్ పన్వర్
ఎవరు : దివ్యాంక్ సింగ్ పన్వర్
ఎప్పుడు : నవంబర్ 11
ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ కేజీవాల్ ఎన్నిక :

రమేష్ కేజీవాల్ 2022-23కి గాను ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (AIRIA) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను డాక్టర్ సావర్ ధనానియా వారసుడు, దేశంలో రబ్బరు పరిశ్రమల కోసం AIRIA యొక్క రోడ్ మ్యాప్ ను ముందుకు నడిపించడం దీని యొక్క పాత్ర. దీనికి ముందు, అతను AIRIA మేనేజింగ్ కమిటీ సభ్యుడు మరియు తూర్పు రీజియన్ ఛైర్మన్ గా పనిచేశాడు. AIRIA సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా శశిసింగ్ గారు నియమితులయ్యారు. AIRIA 1945లో స్థాపించబడింది, ఇది రబ్బరు పరిశ్రమల కోసం ఒక అపెక్స్ బాడీ
. క్విక్ రివ్యు :
ఏమిటి : ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ కేజీవాల్ ఎన్నిక
ఎవరు : రమేష్ కేజీవాల్
ఎప్పుడు : నవంబర్ 11
జాతీయ విద్యా దినోత్సవం గా నవంబర్ 11 :

భారతదేశంలో ఏటా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలో, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం యొక్క మొదటి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ విద్యా దినోత్సవం గా నవంబర్ 11
ఎప్పుడు : నవంబర్ 11
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |