Daily Current Affairs in Telugu 06 October – 2022
ల్
యూఏపీఏ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా జస్టిస్ దినేష్ కుమార్ నియమకం :

యూఏపీఏ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా జస్టిస్ దినేష్ కుమార్ నియమితులయ్యారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ దినేష్ కుమార్ శర్మను ప్రభుత్వం నియమించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) మరియు దాని సహచరులపై నిషేధాన్ని సమీక్షించడానికి అతను నియమించబడ్డాడు. నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్న కేంద్రం ఇటీవల ఐదేళ్ల పాటు PFI ని నిషేధించింది.
క్విక్ రివ్యు ;
ఏమిటి : యూఏపీఏ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా జస్టిస్ దినేష్ కుమార్ నియమకం
ఎవరు : జస్టిస్ దినేష్ కుమార్
ఎప్పుడు : అక్టోబర్ 6
ఒమన్‌లో రూపే డెబిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందం సంతకం చేసిన భారత్ :

ఒమన్‌లో భారతదేశం యొక్క రూపే డెబిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు చారిత్రాత్మక అవగాహన ఒప్పందం సంతకం చేయబడింది. ఒమన్‌లో రూపే డెబిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ చారిత్రక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి..భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రివి మురళీధరన్ సాక్షిగా ఆమోద ముద్ర వేశారు పాఠకులకు వనరులను అందించే లక్ష్యంతో కొత్తగా రూపొందించిన లైబ్రరీని కూడా ఆయన ప్రారంభించారు
క్విక్ రివ్యు ;
ఏమిటి : ఒమన్‌లో రూపే డెబిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందం సంతకం చేసిన భారత్
ఎవరు : భారత్
ఎక్కడ : ఒమన్‌లో
ఎప్పుడు : అక్టోబర్ 6
ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహకమండలిలో అమెరికా ప్రతినిదిగా సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి నియామకం :

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.వో) కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిదిగా భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి (45)ని అధ్యక్షుడు జో బైడెన్ గారు నియమించారు. అమెరికాలో సర్జన్ జనరల్ గా ఉన్నత హోదాలో ఉంటున్న డా. వివేక్ మూర్తి ఆ విధులు కొనసాగిస్తూనే కొత్త బాధ్యతలు నిర్వహిస్తాడు శ్వేతసౌధం నుంచి ఓ ప్రకటన వెలువడింది. వీరి కుటుంబం భారత్లోని కర్ణాటక నుంచి వలస వెళ్లింది..
క్విక్ రివ్యు ;
ఏమిటి : ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహకమండలిలో అమెరికా ప్రతినిదిగా సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి నియామకం
ఎవరు : డాక్టర్ వివేక్ మూర్తి
ఎప్పుడు : అక్టోబర్ 6
ఫ్రెంచి రచయిత్రి అనీ ఎర్నోకు దక్కిన నోబెల్ సాహిత్య బహుమతి :

ఫ్రెంచి రచయిత్రి అనీ ఎర్నోకు ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించారు. ఆత్మకథ నవలలు రాయడంతో ప్రారంభించిన 82 ఏళ్ల ఎన్నో జ్ఞాపకాలు రాసేందుకు ఫిక్షన్ ను వదిలిపెట్టారు. ఆమె ఇప్పటి వరకు 20కి పైగా పుస్తకాలు రాశారు. వాటిలో చాలావరకు తన, తన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోని చిన్న చిన్న ఘటనల్లోంచి తీసుకున్న కధలే. లైంగిక విషయాలు, అబార్షన్, అనారోగ్యం, తన తల్లి.దండ్రుల మరణం లాంటి విషయాలు వాటిలో ఉన్నాయి. చాలా సరళమైన భాషలో, ఏమాత్రం రాజీ పడకుండా ఎన్నో రాశారని నోబెల్ శాంతి బహుమతి కమిటీ చైర్మన్ తెలిపారుఉంటారు. తండ్రితో తన సంబంధం: గురించి రాసిన ‘లా ప్లేస్’ అనే పుస్తకంలో ‘సాంస్కృతిక జ్ఞాపకాలు ఏమీ లేవు, నిందాస్తుతిని ఘనంగా ప్రకటించుకోలేదు. ఈ నిష్పాక్షిక రచనా శైలి నాకు సహజంగానే అబ్బింది’ అని రాశారు. ఆమె రాసిన వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం ‘లెస్ అనీస్’ (ద ఇయర్స్) 2008లో ప్రచురితమైంది. రెండో ప్రపంచయుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటివ రకు తన గురించి, ఫ్రెంచి సమాజం గురించి అందులో ఉంటుంది. ఈ పుస్తకంలో తనను ‘వేరే వ్యక్తిలా ‘ఆమె’ అని ప్రస్తావించడం. విశేషం. ఈ పుస్తకానికి అనేక అవార్డులు లభిం
క్విక్ రివ్యు ;
ఏమిటి : ఫ్రెంచి రచయిత్రి అనీ ఎర్నోకు దక్కిన నోబెల్ సాహిత్య బహుమతి
ఎవరు : అనీ ఎర్నో
ఎప్పుడు : అక్టోబర్ 6
‘గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైన భారత స్టార్ పీఆర్ శ్రీజేశ్

భారత స్టార్ పీఆర్ శ్రీజేశ్ ఎఫ్బహెచ్ ‘గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక య్యాడు. మహిళల విభాగంలో సవితా పునియా ‘గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ నిలిచింది. ఉత్తమ గోల్కీపర్లుగా నిలవడం వీరికిది వరుసగా రెండో ఏడాది. నిపుణులు, జట్లు, అభిమానులు, మీడియా పాల్గొన్న ఆన్లైన్ ఓటింగ్ ద్వారా వీళ్లను ఆవార్డులకు ఎంపిక చేశారు. శ్రీజేశ్ 39, 3 పాయింట్లతో అగ్రస్థానంలో సాదించగా… సవిత 3746 పాయింట్లతో ముందు నిలిచింది
క్విక్ రివ్యు ;
ఏమిటి : ‘గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైన భారత స్టార్ పీఆర్ శ్రీజేశ్
ఎవరు : పీఆర్ శ్రీజేశ్
ఎప్పుడు : అక్టోబర్ 6
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో విజేతగా నిలిచిన ఇండియా క్యాపిటల్స్ జట్టు

లెజెండ్స్ లీగ్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్ జట్టు విజేతగా నిలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” రాస్ టేలర్ (82 41 బంతుల్లో 4.4, 8.6), మిచెల్ జాన్సన్ (62, 35 బంతుల్లో 7.4, 3-6). ఆష్లే నర్స్ (42 నాటౌట్; 19 బంతుల్లో 64, 1.6) చెలరేగడంతో బిల్వారా కింగ్స్ 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ జట్టు చిత్తు చేసింది. మొదట గంబీర్ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగుల భారీస్కోరు. సాధించింది. 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టుకు భారీస్కోరు అందించిన ఘనత టేలర్, , జాన్సన్ అయిదో వికెట్ కు 126 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. బిల్వారా బౌలర్లలో రాహుల్ శర్మ: (4/30), మాంటీ పనేసర్ (2/13), టిమ్ డ్రెస్నన్ (1/11) సఫలమయ్యారు. అనంతరం బిల్వారా కింగ్స్ 18.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో షేన్ వాట్సన్ (27), 19 బంతుల్లో 3×4, 1×6) అత్యధిక స్కోరర్. క్యాపిటల్స్ బౌలర్లలో జాన్సన్ (1/28), పవన్ సుయాల్ (2/27), ప్రవీణ్ తంటె (2/11), ప్లంకెట్ (1/15). వెంకట్సంగ్ (2/14), రజత్ భాటియా (1/2) రాణించారు
క్విక్ రివ్యు ;
ఏమిటి : లెజెండ్స్ లీగ్ క్రికెట్లో విజేతగా నిలిచిన ఇండియా క్యాపిటల్స్
ఎవరు : ఇండియా క్యాపిటల్స్
ఎప్పుడు : అక్టోబర్ 6
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |