Daily Current Affairs in Telugu 11 October – 2022
సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పుర స్కారం-2022‘ గెలుచుకున్న డాక్టర్ అందెశ్రీ :

తొలితరం ప్రజావాగ్గేయకా ర్తులు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పుర స్కారం-2022′ ను ‘లోక కవి డాక్టర్ అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ ప్రకటించారు. ఈనెల 15న ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడిం చారు ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని నాలుగు కోట్ల నాలుకలపై ప్రతిష్టాపనం చేసిన అందెశ్రీకి పురస్కారాన్ని అందించనుండడం ఆనందంగా ఉందన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పుర స్కారం-2022′ గెలుచుకున్న డాక్టర్ అందెశ్రీ
ఎవరు : డాక్టర్ అందెశ్రీ
ఎక్కడ : అక్టోబర్ 11
50 వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై చంద్రచూడ్ నియామకం :

50 వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేరును సిజెఐ గా యు.యు లలిత్ ప్రతిపాదించారు.చీఫ్ జస్టిస్ యు.యు లలిత్ నవంబర్ 08న రిటైర్ కానున్నారు.ఈ నేపద్యంలో తదుపరి సిజె పేరును వెల్లడించాలని కొన్ని రోజుల క్రితం జస్టిస్ లలిత్ న్యాయ శాఖ లేఖ రాసింది.రిటైర్ కావడానికి నెల రోజుల ముందే సిజెఐ కాబోయే చీఫ్ జస్టిస్ పేరును సిపారసు చేయాల్సి ఉంటుంది.ఆ నియమం ప్రకారమే ఇవాళ సిజెఐ యు.యు లలిత్ తదుపరి సిజె పేరును ప్రకటించారు.జస్టిస్ డి.వై చంద్ర చూడ్ గారు సుప్రీం కోర్ట్ రెండవ సీనియర్ లాయర్ .ఆయన పేరును తదుపరి సి.ఐ గా ప్రతిపాదిస్తూ రాసిన లేఖను జస్టిస్ లలిత్ కేంద్రానికి పంపారు.ఒక వేల జస్టిస్ లలిత్ చేసిన ప్రతిపాదన ను కేంద్రం అంగీకరిస్తే అపుడు జస్టిస్ డి.వై చంద్ర చూడ్ రెండేళ్ళ పాటు సి.జే ఐ గా బాద్యతలు నిర్వర్తిస్తారు.నవంబర్ 10,2024 లో ఆయన రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.జస్టిస్ డి.వై చంద్ర చూడ్ తండ్రి జస్టిస్ వైవి చంద్ర చూడ్ భారత్ 16సిజెఐ గా చేసారు.ఆయన ఫిబ్రవరి 2 ,1978 నుంచి జులై ,1985 వరకు సిజె ఐ గా చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 50 వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై చంద్రచూడ్ నియామకం :
ఎవరు : డి.వై చంద్రచూడ్
ఎక్కడ : అక్టోబర్ 11
గ్లోనాస్ కె అనే నావిగేషన్ అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన రష్యా దేశం :

రష్యా దేశ౦ గ్లోనాస్ కె అనే నావిగేషన్ అనే ఉపగ్రహాన్ని సోయాజ్ -2 ,1 బి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది.గ్లోనాస్ –కె అనేది రష్యన్ గ్లోనాస్ రేడియో ఆధారిత శాటిలైట్ నావిగేషన్ సిస్టం లో భాగంగా ఉద్దేశించిన నావిగేషన్ ఉపగ్రహం.US గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం GPS కి సంబావ్య ప్రత్యర్థి గా కనిపించే గ్లోనాస్ వ్యవస్థను అబివృద్ది చేయడానికి రష్యా దేశం గత రెండు దశాబ్దాలలో బిలియన్ ల డాలర్ లను ఖర్చు చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : గ్లోనాస్ కె అనే నావిగేషన్ అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన రష్యా దేశం
ఎవరు : రష్యా దేశం
ఎక్కడ : అక్టోబర్ 11
ఆల్టర్నేటివ్ మేడిసన్ కోస౦ అంతర్జాతీయ అవార్డును అందుకున్న ప్రొఫెసర్ వజాహత్ హుస్సేన్ :

అలీఘర్ ముస్లిం యునివర్సిటీ కి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ వజాహత్ హుస్సేన్ సంప్రదాయ కాంప్లిమెంటరి మరియ్యు ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు. AMU లోని వృక్ష శాస్త్ర విభాగం యొక్క రిటైర్డ్ చైర్మన్ UAE యొక్క రెండవ షేక్ జాయెద్ గారు అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆల్టర్నేటివ్ మేడిసన్ కోస౦ అంతర్జాతీయ అవార్డును అందుకున్న ప్రొఫెసర్ వజాహత్ హుస్సేన్
ఎవరు : ప్రొఫెసర్ వజాహత్ హుస్సేన్
ఎక్కడ : అక్టోబర్ 11
అంతర్జాతీయ బాలికా దినోత్సవం గా అక్టోబర్ 11 :

అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బాలికలకు సాధికారత కల్పించడం కొసం మరియు వారి స్వరాన్ని విస్తరించడం కోసం జరుపుకుంటారు. ఈ రోజు ఆడపిల్లల హక్కులను మరియు ప్రపంచవ్యాప్తంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తుంది. ఈ రోజు యు.ఎన్ జనరల్ అసెంబ్లీ 2011చే స్థాపించబడింది మరియు మొదటిసారిగా 2012లో పాటించబడింది. కాగా 2022 థీమ్ ‘మన కాలం ఇప్పుడు మన హక్కులు, మన భవిష్యత్తు! గా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ బాలికా దినోత్సవం గా అక్టోబర్ 11
ఎక్కడ : అక్టోబర్ 11
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |