Daily Current Affairs in Telugu 05 November – 2022
ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ జాతీయ పురస్కారాన్ని గెల్చుకున్న డాక్టర్ నర్రెడ్డి సునీత :

మాజీ మంత్రి వై.ఎస్ వివేకా నంద రెడ్డి కుమార్తె ప్రముఖ వైద్యురాలు డాక్టర్ నర్రెడ్డి సునీత కు క్యాపిటల్ పౌండేషన్ సొసైటి అండ్ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది.అంటూ వ్యాదులతో పాటు టిబి నివారణ లో సమాజ హితం కోసం ఆమె కృషి చేసారని ఫౌండేషన్ పేర్కొంది.డిల్లి లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ యు.యు లలిత్ గారి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ జాతీయ పురస్కారాన్ని గెల్చుకున్న డాక్టర్ నర్రెడ్డి సునీత
ఎవరు : డాక్టర్ నర్రెడ్డి సునీత
ఎప్పుడు : నవంబర్ 05
నవంబర్ మాసంను హిందు వారసత్వ మాసంగా గుర్తించిన కెనడా దేశం :

నవంబర్ నేల కు గాను హిందు వారసత్వ మాసంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు కెనడా దేశం ప్రకటించింది.బహుళ సంస్కృతుల దేశ పురోగతిలో హిందు వర్గం (8,30,000మంది) యొక్క పాత్ర ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.నవంబర్ నెలను హిందు వారసత్వ మాసంగా ప్రకటించాలని అని లిబరల్ పార్టి కి చెందిన చంద్ర ఆర్య ప్రైవేట్ మెంబర్ మోషన్ ను మె నెలలో హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : నవంబర్ మాసంను హిందు వారసత్వ మాసంగా గుర్తించిన కెనడా దేశం
ఎవరు : కెనడా దేశం
ఎక్కడ ; కెనడా లో
ఎప్పుడు : నవంబర్ 05
డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 గా ఎంపిక అయిన పెర్మాక్రిసిస్ పదం :

పెర్మాక్రిసిస్ అనేది కాలిన్స్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 గా ఎంపిక చేయబడింది.ఈ పదానికి అస్థిరత మరియు అభద్రతా యొక్క సుదీర్గ కాలం అని అర్థం ఇది కొనసాగుతున్న యుక్రయిన్ యుద్ధం తత్పలితంగా జీవన వ్యయం పెరుగుదల మరియు 2022 లో ప్రపంచ౦ చూసిన రాజకీయ తిరుగుబాటును సూచిస్తుంది.కాలిన్స్ డిక్షనరీ ని గ్లాస్గో లోని హార్పర్ కోలిన్స్ ప్రచురించింది.కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021 –NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) అనేది ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 గా ఎంపిక అయిన పెర్మాక్రిసిస్ పదం
ఎవరు : పెర్మాక్రిసిస్
ఎప్పుడు : నవంబర్ 05
అంతర్జాతీయ హాకి సమాఖ్య నూతన అద్యక్షుడిగా మొహమ్మద్ తయ్యబ్ ఇక్రం ఎన్నిక :

మకావు కు చెందిన ఆసియా హాకి సమాఖ్య (AHF) CEO మొహమ్మద్ తయ్యబ్ ఇక్రం నవంబర్ 05న అంతర్జాతీయ హాకి సమాఖ్య FIH యోక్క కొత్త అద్యక్షుడిగా ఎన్నికయ్యారు. FIH ఎగ్సిక్యుటివ్ బోర్డ్ అధ్యక్షుడిని కలిగి ఉంటుంది.ఎనిమిది మంది సాదారణ సభ్యులు నలుగరు స్త్రీలు మరియు నలుగురు పురుషులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి సగం మంది పున్నరుద్దరించబడతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ హాకి సమాఖ్య నూతన అద్యక్షుడిగా మొహమ్మద్ తయ్యబ్ ఇక్రం ఎన్నిక
ఎవరు : మొహమ్మద్ తయ్యబ్ ఇక్రం
ఎప్పుడు : నవంబర్ 05
దేశ ప్రథమ పౌరుడు ఓటరు శ్యాం శరన్ నేగి కన్నుమూత :

దేశ ప్రథమ పౌరుడు ఓటరు శ్యాం శరన్ నేగి (106)గారు హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో తన స్వగృహంలో నవంబర్ 05న కన్నుమూసారు.రాష్ట్రంలో ఈ నెల 12 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 2వ తేదినే తన నివాసం నుంచే పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో ఆయన ఓటు వేసారు. ఎన్నికల సంఘం ప్రచారకర్తగా ఉన్న నేగి మృతిపైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సంతాపం వ్యక్తం చేసారు. మండి జిల్లా సుందర్ నగర్ లో ఎన్నికల సభలో ప్రసంగించిన ఆయన ప్రజాస్వామ్యం పట్ల నేగి నురక్తి నిబద్దత కు స్ఫూర్తి దాయకమని కొనియాడారు.ఆయన 34 సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని మరణించే ముందు కూడా ఓటు వేసి కర్తవ్యాన్ని నెరవెర్చారని ప్రశంసించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశ ప్రథమ పౌరుడు ఓటరు శ్యాం శరన్ నేగి కన్నుమూత
ఎవరు : శ్యాం శరన్ నేగి
ఎక్కడ ; హిమాచల్ ప్రదేశ్
ఎప్పుడు : నవంబర్ 05
కర్నాటక రత్న అవార్డు కు ఎంపిక అయిన పునిత్ రాజ్ కుమార్ :

67 వ కర్ణాటక రాష్ట్ర రాజ్యోత్సవ (రాష్ట్ర అవతరణ దినోత్సవం) సందర్బంగా దివంగత నటుడు పునిత్ రాజ్ కుమార్ గారికి మరణాంతరం కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారం అయిన “కర్నాటక రత్న” ను ప్రధానం చేసారు.ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న తొమ్మిదవ వ్యక్తిగా పునిత్ రాజ్ కుమార్ గారు నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కర్నాటక రత్న అవార్డు కు ఎంపిక అయిన పునిత్ రాజ్ కుమార్
ఎవరు : పునిత్ రాజ్ కుమార్
ఎక్కడ ; కర్నాటక లో
ఎప్పుడు : నవంబర్ 05
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |