
Daily Current Affairs in Telugu 09&10 November – 2022
కీన్ స్వోర్డ్ అనే పేరుతో అమెరికా-జపాన్ సైనిక విన్యాసాలు ప్రారంభం:

ఒక వైపు చైనా దూకుడు. మరోవైపు ఉత్త రకొరియా క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో నవంబర్ 10న దక్షిణ జపాన్ లో అమెరికా దేశ జపాన్లు భారీస్థాయిలో సంయుక్త సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టారు. “కీన్ స్వోర్డ్” పేరుతో జరుగుతున్న ఈ విన్యాసాల్లో జపాన్ కు చెందిన 26 వేల మంది, ఆమెరికాకు చెందిన. 10 వేల మంది సైనికులతో పాటు 30 నౌకలు, 370 విమానాలు పాల్గొననున్నాయి.కాగా నవంబర్ 19 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి
క్విక్ రివ్యు :
ఏమిటి : కీన్ స్వోర్డ్ అనే పేరుతో అమెరికా-జపాన్ సైనిక విన్యాసాలు ప్రారంభం
ఎవరు : అమెరికా-జపాన్
ఎక్కడ : జపాన్ లో
ఎప్పుడు : నవంబర్ 10
(ఐఓసీ) పర్యవేక్షణలో ముసాయిదా రాజ్యాంగానికి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమోదం :

సుప్రీంకోర్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పర్యవేక్షణలో ముసాయిదా రాజ్యాంగానికి నవంబర్ 10న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమోదం తెలిపింది. డిసెంబరులోపు ఎన్నికలు జరగకపోతే ఐఓసీ నుంచి సస్పెన్షన్ ముప్పు పొంచి ఉండటం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఐఓఏకు తమ రాజ్యాంగంలో మార్పులు తీసుకురావడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. డిసెంబరు 10న ఐఓఏకు ఎన్నికలకు సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపింది. దీనిపై నవంబర్ 10న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ‘సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం స్వల్ప మార్పులతో రాజ్యాంగాన్ని సవరించాం దాని విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు తీర్మానాన్ని సమర్పిస్తాం. ప్రభుత్వానికి కూడా అందజేస్తాం. అని సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు
క్విక్ రివ్యు :
ఏమిటి : (ఐఓసీ) పర్యవేక్షణలో ముసాయిదా రాజ్యాంగానికి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమోదం :
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
ఎప్పుడు : నవంబర్ 10
కెనరా బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ) గా సత్యనారాయణ రాజు నియామకం :

కెనర బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధి కారి (సీఈఓ) గా కలిదిండి సత్యనారాయణ రాజు ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో సత్యనారాయణ రాజు నియామకాన్ని ఖరారు చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి మూడేళ్లు లేదా ఆయనకు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పదవిలో ఉంటారు. కాగా ప్రస్తుతం అయన కెనరా బ్యాంక్ లోనే ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కెనరా బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ) గా సత్యనారాయణ రాజు నియామకం
ఎవరు : సత్యనారాయణ రాజు
ఎప్పుడు : నవంబర్ 10
వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్ 2022 లిస్ట్ లో దేశీయంగా మొదటి స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ :

భారత్లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం దేశీయంగా తొలిస్థానంలో ఉన్న రిలయన్స్, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొత్తం 800 కంపెనీలు ఉన్నాయి. వీటిలో దక్షిణ కొరియాకి చెందిన . శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా, అమెరికా సంస్థలు మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫా బెట్ (గూగుల్), యాపిల్ తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి.ఈ జాబితాలో మన దేశం నుంచి హెచ్ ఎఫ్సీ బ్యాంక్ (137వ స్థానం), బజాజ్ (173). ఆదిత్య బిర్లా గ్రూప్ (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్ అండ్ టీ (354), ఐసీఐసీఐ బ్యాంక్ (365) హెచ్సీఎల్ టెక్నా లజీ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంట ర్ప్రైజెస్ (547), ఇన్పోసిస్ (668) లు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్ 2022 లిస్ట్ లో దేశీయంగా మొదటి స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎప్పుడు : నవంబర్ 10
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన భారత సంతతి మహిళా అరుణా మిల్లర్ :

అమెరికా దేశం లో మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ (58), మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు పలువురు భారతీయ అమెరికన్లు ఆయా రాష్ట్రాల చట్టసభల్లోనూ ఉనికి చాటుకున్నారు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన అరుణ ఇదివరకు మేరీలాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్’ సభ్యురాలిగా కూడా ఉన్నారు. కాగ ఇటీవల అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్లకు మంచి పట్టున్న మేరీలాండ్ లో డెమొక్రటిక్ పార్టీ తరపున అరుణ విజయకేతనం ఎగరవేయ౦తో భారతీయ అమెరికన్లలో ఆనందం నెలకొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ లెఫ్టినెంట్ గవ ర్నర్గా ఎన్నికైన భారత సంతతి మహిళా అరుణా మిల్లర్
ఎవరు : అరుణా మిల్లర్
ఎక్కడ : అమెరికా లో
ఎప్పుడు : నవంబర్ 09
లా కమిషన్ చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రీతూ రాజ్ అవస్థి :

లా కమిషన్ చైర్పర్సన్ గా కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి గారు నవంబర్ 09న బాధ్యతలు చేపట్టారు. హిజాబ్ పైన ఇటీ వల తీర్పు వెలువరించిన బెంచ్ కు రీతూ రాజ్ అవస్థి నేతృత్వం వహించారు. ప్రస్తుత లా కమిషన్ ను2020 ఫిబ్రవరి ఒకటోతేదీన ఏర్పాటు చేశారు. సభ్యుల్ని మాత్రం గత కొద్ది రోజుల క్రితం నియమించారు. జస్టిస్ కె.టి. శంకరన్, ప్రొఫెసర్ ఆనంద్ పలీవాల్, ప్రొఫెసర్ డి.పి.వర్మ, ప్రొఫెసర్ రాకా ఆర్య ఎం.కరుణానిధిలు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లా కమిషన్ చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రీతూ రాజ్ అవస్థి
ఎవరు : జస్టిస్ రీతూ రాజ్ అవస్థి
ఎప్పుడు : నవంబర్ 09
ప్రతిష్టాత్మక ‘క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ 2020 ర్యాంకింగ్స్ లో లో అగ్రస్థానం లో నిలిచిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం :

ప్రతిష్టాత్మక ‘క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ 2020లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ 351-400 మధ్య, ఏపీలో ఆగ్రస్థానంలో నిలిచిందని వీసీ ఆచార్య రాజారెడ్డి ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియాలోని 760 విశ్వవిద్యాలయాల అభివృద్ధి సూచికలను పరిశీలించిన తర్వాత ఎస్వీ. యూకు ఏపీలో ప్రథమస్థానం. భారతదేశంలో 44వ ర్యాంకు, ఆసియాలో 351-100వ స్థాయి ర్యాంకు వచ్చాయన్నారు. ఎస్వీయూ నైటేషన్లలో 22 చౌర్పౌండ్ ఎక్స్ఛేంజ్లో 62.5, ఇన్బౌండ్ ఎక్స్ఛేంజ్లో 315. అధ్యాపక -విద్యార్ధి నిష్పత్తి 29.6, అధ్యాపకుల పీహెచ్చీ విషయంలో 95.5 పాయింట్లను సాధించడం గర్వకారణమన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక ‘క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ 2020 ర్యాంకింగ్స్ లో లో అగ్రస్థానం లో నిలిచిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ఎవరు : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ఎప్పుడు : నవంబర్ 10
లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి నియమకం :

లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి నియమితులయ్యారు. నవంబర్ 10న లోక్ సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. కమిటీలో సభ్యుడిగా తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు గారు నియమితు లయ్యారు. ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలశౌరి, లోక్ సభ సభ్యులకు ఇళ్లు కేటాయించే హౌస్ కమిటీ సభ్యుడిగా విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ శ్రీ సత్యనారాయణను నియమించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి నియమకం
ఎవరు : వల్లభనేని బాలశౌరి:
ఎప్పుడు : నవంబర్ 09
జాతీయ న్యాయ సేవల దినోత్సవ౦ గా నవంబర్ 09 :

లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, 1987 ప్రారంభమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ చట్టం 1995లో అదే రోజు అమలులోకి వచ్చింది. ఈ రోజున, ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయపరమైన అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు..
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ న్యాయ సేవల దినోత్సవ౦ గా నవంబర్ 09
ఎప్పుడు : నవంబర్ 09
ఉత్తరాఖండ్ గౌరవ్ సమ్మాన్ 2022 కు ఎంపికైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ :

జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్తో పాటు ఐదుగురు ప్రముఖులు “ఉత్తరాఖండ్ గౌరవ్ సమ్మాన్ 2022” కోసం ఎంపికయ్యారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్ ప్రసూన్ జోషి (CBFC చైర్పర్సన్), దివంగత గిరీష్ చంద్ర తివారీ ‘గిర్దా’ (గీత రచయిత), మరియు దివంగత నీరేవ్ దంగ్వాల్ (కవి) ఈ అవార్డును అందుకోనున్నారు.ఉత్తరాఖండ్ గౌరవ్ సమ్మాన్ ఉత్తరాఖండ్ రత్నతో పాటు రాష్ట్రంలోని రెండు అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి.మానవ ప్రయత్నానికి సంబంధించిన ఏదైనా రంగంలో వారి అసాధారణ సహకారం కోసం ఇది ఒక వ్యక్తికి ఇవ్వబడుతుంది.ఈ అవార్డును 2021 లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్ర 21వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 9, 2021న ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉత్తరాఖండ్ గౌరవ్ సమ్మాన్ 2022 కు ఎంపికైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
ఎవరు : అజిత్ దోవల్
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : నవంబర్ 09
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |