
Daily Current Affairs in Telugu 06&07 November – 2022
ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఫ్యూచర్ ఎకానమీ నాయకత్వ అవార్డు అందుకున్న ఏపి రైతు సాధి కార సంస్థ :

రాష్ట్రంలో ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థకు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఫ్యూచర్ ఎకానమీ నాయకత్వ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి అధ్య ర్యంలో ఈజిప్టులో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 (కాప్-27) సదస్సులో ఈ అవార్డును ప్రకటించి౦ది.. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న సంస్థలకు ఫ్యూచర్ ఎకానమీ ఫోరం ఆధ్వర్యంలో ఏటా అవార్డులు అందిస్తారు. 2022 సంవత్సరానికి సంబంధించి. ప్రకృతి వ్యవసాయ విస్తరణ, రైతుల్ని ఆర్ధికంగా బలోపేతం చేయడంలో రైతు సాధికార సంస్థ కృషిని ఫోరం గుర్తించి అవార్డు అందించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో భూసార పెంపు. పర్యావరణ పరిరక్షణ విధానాలు కొనసాగుతున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఫ్యూచర్ ఎకానమీ నాయకత్వ అవార్డు అందుకున్న ఏపి రైతు సాధి కార సంస్థ
ఎవరు : ఏపి రైతు సాధి కార సంస్థ
ఎప్పుడు : నవంబర్ 06
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా శ్రీనివాసన్ వరదరాజన్ నియామకం :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా శ్రీనివాసన్ వరదరాజన్ ను మూడేళ్ల కాలానికి గాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణం అమల్లో వచ్చేలా నవంబరు 7 తేదీతో ఒక నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. తాత్కాలిక అనధికార డైరెక్టర్ గానూ ఆయన బాధ్యతలు చేపడతాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో వరదరాజన్ కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది 2019లో సొంతంగా సలహా సేవలను ప్రారంభించడానికి ముందు యస్ బ్యాంక్ డిప్యూటీ ఎండీగా పనిచేశారు. ఐఐఎమ్ కలకత్తా నుంచి డిప్లొమో పొందిన ఆయన వివిధ ఆర్బీఐ కమిటీల్లోనూ సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా శ్రీనివాసన్ వరదరాజన్ నియామకం
ఎవరు : శ్రీనివాసన్ వరదరాజన్
ఎప్పుడు : నవంబర్ 06
ఐసీసీ అక్టోబర్ నెల ఉత్తమ ఆటగాడిగా ఎంపికైన విరాట్ కోహ్లి :

ఐసీసీ అక్టోబర్ నెల ఉత్తమ గా డిగా విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచంలో చెలరేగి ఆడుతున్న భారత స్టార్ గత నెలలో పొట్టి పార్యాల్లో 205 పరుగులు చేశాడు. పాకిస్థాన్ పై సంచలన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ (82) నెదర్లాండ్స్ (62) పైనా అర్ధసెంచరీతో మెరిశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అజేయంగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), సికందర్ (జింబాబ్వే)లను వెనక్కి నెడుతూ విరాట్ ఐసీసీ అక్టోబర్ నెల ఉత్తమ ఆటగాడి ఆవార్డును దక్కిన్చున్నారు. ఐసీసీ అక్టోబర్ ఉత్తమ ఆటగాడిగా నిలవడం గౌరవంగా భావిస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కోవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది” అని విరాట్ అన్నాడు. మహిళల విభాగంలో పాకిస్థాన్ ఆలో రాధా ఆక్టోబర్ నేలకు ఉత్తమ క్రీడాకారిణి ఆచార్లు దక్కించుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐసీసీ అక్టోబర్ నెల ఉత్తమ ఆటగాడిగా ఎంపికైన విరాట్ కోహ్లి
ఎవరు : విరాట్ కోహ్లి
ఎప్పుడు : నవంబర్ 07
. అన్ని రకాల క్రికెట్ నుంచి నిషేదానికి గురైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక :

అత్యాచార ఆరోపణలతో ఆస్ట్రేలియాలో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక పై వేటు పడింది. అన్ని రకాల క్రికెట్ నుంచి అతణ్ని తక్షణమే నిషేదిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్ఎ) నవంబర్ 07న ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వచ్చిన గుణతి ఆన్లైన్ డేటింగ్ యాప్ లో పరిచయమైన -మహిళపై ఈ నెల 2న లైంగిక హింసకు పాల్ప దాడన్న ఆరోపణలపై ఆదివారం సిడ్నీలో అరె స్టయ్యాడు. “తక్షణమే అన్ని రకాల క్రికెట్ నుంచి జాతీయ ఆటగాడు గా ఉన్న గుణతిలకను నిషేదించాలని ఎస్ఎల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అన్ని రకాల క్రికెట్ నుంచి నిషేదానికి గురైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక
ఎవరు : శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక
ఎక్కడ: : శ్రీలంక
ఎప్పుడు : నవంబర్ 06
లా కమిషన్ చైర్ పర్సన్ గా జస్టిస్ రితురాజ్ అవస్థిని నియామకం :

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు లా కమిషన్ నియామకాలు చేపట్టింది. కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థిని ఈ లా కమిషన్ చైర్పర్సన్గా నియమించి నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు 07న వెల్లడించారు. జస్టిస్ కేటీ శంకరన్, ప్రొఫెసర్ ఆనంద్ పలివాల్, ప్రొఫెసర్ డీపీ వర్మ, ప్రొఫెసర్ ఢాకా ఆర్య ఎం.కరుణానిధిలు కమిషన్ సభ్యులుగా నియమితులైనట్టు ఆయన తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లా కమిషన్ చైర్ పర్సన్ గా జస్టిస్ రితురాజ్ అవస్థిని నియామకం
ఎవరు : జస్టిస్ రితురాజ్ అవస్థి
ఎప్పుడు : నవంబర్ 07
నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2021’ను గెలుచుకున్న మిద్యాల ఝాన్సీ రాణి :

నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2021’ను రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము గారి చేతుల మీదుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న మిద్యాల ఝాన్సీ రాణి అందుకున్నారు. కరోనా కష్టకాలంలోనూ, దేశవ్యాప్తంగా రోగులకు అనుమానమైన సేవలు అందించిన 51 మంది నర్స్ లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి మిద్నాల ఝాన్సీరాణి అందుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఝాన్సీ రాణి ఒక్కరే నిలిచారు. సమాజం కోసం నర్సులు, నర్సింగ్ వృత్తిలో ఉన్నవారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర వైద్య ఆరోగ్యంకా 1978లో ఈ ఆవార్డును ప్రారంభించింది మిర్యాల రూ రాణి గత 25 ఏళ్లుగా ఎయిడ్స్ ఫుడ్ ట్యాంకింగ్ జిసిక్ లైప్ సపోర్ట్, ఆడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్, మిడై వైఫ్. సర్వీస్ మెడికల్ ట్రాన్స్ స్క్రిప్షన్, నరింగ్ విద్యా బోధన రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2021’ను గెలుచుకున్న మిద్యాల ఝాన్సీ రాణి
ఎవరు : మిద్యాల ఝాన్సీ రాణి
ఎప్పుడు : నవంబర్ 07
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును నడిపిన దేశంగా నిలిచిన స్విట్జర్ ల్యాండ్ :

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును నడిపి స్విట్జర్లాండ్ దేశం గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలు దేశం యొక్క మొదటి రైలు వ్యవస్థ యొక్క 175వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును నడిపిన దేశంగా నిలిచిన స్విట్జర్ ల్యాండ్
ఎవరు : స్విట్జర్ ల్యాండ్
ఎక్కడ: స్విట్జర్ ల్యాండ్ లో
ఎప్పుడు : నవంబర్ 07
ప్రతిష్టాత్మక మైన ఎఝుతాచన్ పురస్కారం కు ఎంపికైన కేరళ రచయిత సేతు మాధవన్ :

ప్రముఖ మలయాళ రచయిత కల్పన సేతు మలయాళ భాష మరియు సాహిత్యానికి చేసిన మొత్తం సహకారానికి గుర్తింపుగా 2022 సంవత్సరానికి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఎఝుతాచన్ అనే పురస్కారం కు ఎంపిక అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మకమైన ఎఝుతాచన్ పురస్కారం కు ఎంపికైన రచయిత సేతు మాధవన్
ఎవరు :సేతు మాధవన్
ఎక్కడ: కేరళ రాష్ట్రం లో
ఎప్పుడు : నవంబర్ 07
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |