
Daily Current Affairs in Telugu 03&04 November – 2022
కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు రూపొందించిన కేజీఎస్3 శాట్ కు కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ నామకరణ :

. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు రూపొందించిన కేజీఎస్3 శాట్కు దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారి పేరు పెట్టారు. దీనిని ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కక్ష్య లోకి పీఎస్ఎల్వీ-సి51 వాహకనౌక ద్వారా పంపనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యా ర్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి : కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు రూపొందించిన కేజీఎస్3 శాట్ కు కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ నామకరణ
ఎవరు : కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్
ఎక్కడ; కర్ణాటకలో
ఎప్పుడు ; నవంబర్ 03
ఆస్ట్రేలియా దేశ౦ తో ఆర్ధిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం పై సంతకం చేసిన ఇండియా :

కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ గారు ఆస్ట్రేలియా దేశ మంత్రితో వర్చువల్ సమావేశం ను నిర్వహించారు. ఏప్రిల్ 2022 లో సంతకం చేసిన ind aus ECTA (ఇండియా –ఆస్ట్రేలియా ఆర్ధిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం )యొక్క దృవికరణ స్థితిని చర్చించడానికి ఈ సమావేశం జరిగింది.ఈ ఒప్పందం యొక్క ముందస్తు అమలు పైన కూడా వీరు చర్చించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆస్ట్రేలియా దేశ౦ తో ఆర్ధిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం పై సంతకం చేసిన ఇండియా
ఎవరు : ఇండియా
ఎప్పుడు ; నవంబర్ 03
డిల్లీలో భవన నిర్మాణ కార్యక్రమాలను నిషేధం విధించిన అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వ౦ ::

కాలుష్యం పెరిగోపోతున్న క్రమ౦లో కొత్త నిర్మాణాలు కూల్చివేతలపైన డిల్లి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.దీంతో వందల మంది భవన కార్మికుల పైన తీవ్ర ప్రభావం పడింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ నిర్ణయం తో ప్రభావితం అయిన నిర్మాణ రంగ కార్మికులకుఅందరికి ఆర్ధిక సాయం అందించాలని కార్మిక శాఖ మంత్రి మనీష్ సిసోడియా ను ఆదేశించారు.కాలుష్యం కారణంగా డిల్లీలో నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయి. నిషేధం తొలగించే వరకు నిర్మాణ రంగంలో పని చేసే ప్రతి కార్మికునికి ఐదు వేల రూపాయల ఆర్ధిక సాయం అందించాలని లేబర్ మినిస్టర్ ఐన మనీష్ సిసోడియా ను ఆదేశించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : డిల్లీలో భవన నిర్మాణ కార్యక్రమాలను నిషేధం విధించిన అరవింద్ కేజ్రి వాల్ ప్రభుత్వ౦
ఎవరు : అరవింద్ కేజ్రి వాల్
ఎక్కడ; డిల్లి లో
ఎప్పుడు ; నవంబర్ 03
ఖండాంతర క్షిపణి ని ఐ.సి.బి.ఎం ను పరీక్షించిన ఉత్తర కొరియా దేశం :

ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు ఆగడం లేదు నవంబర్ 04 న ఏకంగా ఖండాంతర క్షిపణి ని ఐ.సి.బి.ఎం ను పరీక్షించింది.ఈ విషయాన్నీ దక్షిణ కొరియా సైన్యం ద్రువీకరించి౦ది. ఈ క్షిపణి 1.920 కిలోమీటర్ ల ఎత్తులో 760 కిలో మీటర్ లు ప్రయాణించింది.ఈ క్షిపణి పరీక్ష విఫలం అయినట్లు దక్షిణ కొరియా దేశ న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది ఏడు సార్లు ఐ.సి.బి.ఎం లను పరీక్షించింది. ఈ ఐ.సి .బి.ఎం తో పాటు మరో స్వల్ప శ్రేణి క్షిపణులను కూడా ప్యాంగ్ యాంగ్ ప్రయోగించింది. ఉత్తర కొరియా దేశ ఖండాంతర క్షిపణి పరీక్షతో ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరికల ను జారీ చేసింది.తొలుత ఈ క్షిపణి జపాన్ పైన నుంచి వెళ్లిందని భావించారు. కాని తమ ద్వీప సమూహాన్ని దాటి వెళ్లలేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు.కాగా ప్రధాని కిషిదా ఈ క్షిపణి ప్రయోగంను ఖండించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఖండాంతర క్షిపణి ని ఐ.సి.బి.ఎం ను పరీక్షించిన ఉత్తర కొరియా దేశం
ఎవరు : ఉత్తర కొరియా దేశం
ఎప్పుడు ; నవంబర్ 04
ఆసియా స్క్వాష్ టీం చాంపియన్ షిప్ విజేతగా నిలిచిన భారత్ :

ఆసియా స్క్వాష్ టీం చాంపియన్ షిప్ లో భారాత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక టోర్నీ లో భారత్ తొలిసారిగా విజేతగా నిలిచింది. నవంబర్ 04 న జరిగిన ఫైనల్ లో భారత్ 2-0 తో కువైట్ ను మట్టి కరిపించింది. తొలి మ్యాచ్ లో రమిత్ టాండన్ 11-5,11-7,11-4 తో అలీ అరామేజి పై విజయం సాధించాడు.రెండో పోరులో కెప్టెన్ సౌరబ్ ఘోషల్ 11-9 ,11-2,11-3 తో అమ్మార్ అల్తామియా పైన నెగ్గడం తో అభయ్ సింగ్ ఫలా మహ్మద్ జోడి డబుల్స్ మ్యాచ్ తో పని లేకుండా భారత్ కు జయ భేరి మోగించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా స్క్వాష్ టీం చాంపియన్ షిప్ విజేతగా నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు ; నవంబర్ 04
2026 మహిళల పురుషుల హాకి ప్రపంచ కప్ లకు అతిత్యం ఇవ్వనున్న నెదర్లాండ్ &బెల్జియం దేశాలు :

హాకి ప్రపంచ కప్ లకు ఆథిత్యం ఇవ్వనున్న డచ్ ,బెల్జియం దేశాలు 2026 మహిళల పురుషుల హాకి ప్రపంచ కప్ లకు నెదర్లాండ్ బెల్జియం ఉమ్మడిగా ఆథిత్యం ఇవ్వనున్నాయి. నవంబర్ 04న జరిగిన ప్రపంచ కప్ హాకీ సమాఖ్య వర్చువల్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2026 జులై లేదా ఆగస్ట్ లో నెదర్లాండ్ బెల్జియం ఉమ్మడిగా మహిలు పురుషుల హాకి ప్రపంచ కప్ కు ఆథిత్యం ఇస్తాయి.నెదర్లాండ్ /ఆం స్టెల్ వీన్ బెల్జియం లోని వాన్రి లో ఈ ప్రపంచ కప్ పోటీలు జరుగుతాయి. అని ఎఫ్ ఐ.హెచ్ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2026 మహిళల పురుషుల హాకి ప్రపంచ కప్ లకు అతిత్యం ఇవ్వనున్న నెదర్లాండ్ &బెల్జియం దేశాలు
ఎవరు : నెదర్లాండ్ &బెల్జియం దేశాలు
ఎప్పుడు ; నవంబర్ 04
సియివో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్న అరాజేన్ లైఫ్ సైన్సెస్ సియివో మన్ని కంటి పూడి :

హైదరబాద్ కు చెందిన అరాజేన్ లైఫ్ సైన్సెస్ సియివో గా మన్ని కంటి పూడికి ప్రతిష్టాత్మక “సియివో ఆఫ్ ది ఇయర్ అవార్డ్” లబించింది.జర్మని లోని ఫ్రాంక్ ఫర్డ్ లో నిర్వహించిన సి.పి.హెచ్ఐ ఫార్మా అవార్డ్ 2022 లో ఆరుగురితో పోటి పడిన ఆయన ఈ అవార్డు సంపాదించుకున్నారు. చిన్న మూలకణాలు ,బయో లాజిక్స్ విభాగంలో ప్రపంచ స్థాయి కాంట్రాక్ట్ సేవల సంస్థగా అరాజేన్ లైఫ్ సైన్సెస్ ను ఆయన తీర్చిదిద్దినట్లు సి.పి.హెచ్ ఐ ఫార్మా అవార్డుల బృందం పేర్కొంది. ఫార్మా డ్రగ్ డెలివరి పరిశోదన స్థిర వృద్ది విభాగాలలో నైపుణ్యాలు ప్రదర్శించిన వారిని గుర్తించి ఏటా ఈ అవార్డులు ఇస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సియివో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్న అరాజేన్ లైఫ్ సైన్సెస్ సియివో మన్ని కంటి పూడి
ఎవరు : మన్ని కంటి పూడి
ఎప్పుడు ; నవంబర్ 03
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు లో స్వతంత్ర డైరెక్టర్ గా కెవి కామత్ నియామకం :

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా దిగ్గజ బ్యాంకర్ కెవి కామత్ గారు నియమితులయ్యారు.అయిదేళ్ళ పాటు ఆయన స్వతంత్ర డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్లు స్టాక్ ఎక్స్ చేంజ్ లకు ఇచ్చిన సమాచారంలో ఆర్.ఐ.ఎల్ పేర్కొంది. ఐఐఎం ఆహ్మధాబాడ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కామత్ 1971 లో ఐసిఐసిఐ లో వృత్తి జీవితాన్ని ప్రారంబించారు.1988 లో ఆసియా అబివృద్ది బ్యాంక్ లో చేరి పలు ఏళ్ల పాటు ఆయన పని చేసారు. 1996 లో తిరిగి ఐసిఐసిఐ లోఎండి, సియివో గా చేరారు. ఐసిఐసిఐ బ్యాంక్ లో విలీనం తర్వాత బ్యాంక్ ఎండి,సియివో గా కూడా వ్యవహరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు లో స్వతంత్ర డైరెక్టర్ గా కెవి కామత్ నియామకం
ఎవరు : కెవి కామత్
ఎప్పుడు ; నవంబర్ 03
ఆసియా కాంటినెంటల్ చెస్ టోర్నమెంట్లో టైటిళ్లు గెలుచుకున్న ప్రజ్ఞానంద, పి.వి. నందిద :

ఆసియా కాంటినెంటల్ చెస్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద, పి.వి. నందిద టైటిళ్లు గెలుచుకున్నారు.నవంబర్ 04న ఓపెన్ విభాగంలో చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆదిబన్ తో 63 ఎత్తుల్లో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద 7 పాయింట్లు) విజేతగా నిలిచాడు. ఈ విజయంతో టైటిల్తో పాటు రాబోయే ఏడే ప్రపంచకప్ బెర్తూ దక్కించుకున్నాడు. మరోవైపు చివరి గేమ్ ను డ్రా చేసుకున్న తెలుగుతేజం హర్ష భరతకోటి అధిబన్ తో సమానంగా 6.5 పాయింట్లు సాధిం టాడు. కానీ ఉత్తము టైబ్రేక్ స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. ఆదిబన్ మూడో స్థాన౦ దక్కించుకున్నారు. మహిళల విభాగంలో నందిద విజేతగా నిలిచింది. ఆఖరి రౌండ్లో దివ్య దేశముఖ్ తో గేమ్ ను ఆమె డ్రా చేసుకుంది. దీంతో 7.5 పాయింట్లతో ట్రోఫీ కైవసం చేసుకుంది. తెలుగమ్మాయి నూతక్కి ప్రియాంక రెండో స్థానం సాధించింది
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా కాంటినెంటల్ చెస్ టోర్నమెంట్లో టైటిళ్లు గెలుచుకున్నా ప్రజ్ఞానంద, పి.వి. నందిద
ఎవరు : ప్రజ్ఞానంద, పి.వి. నందిద
ఎప్పుడు ; నవంబర్ 04
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |