Daily Current Affairs in Telugu 29-03-2022
ఫెడెక్స్ సంస్థ నూతన సియివో గా రాజ్ స్సుబ్రమన్యం నియామకం :
అమెరికాకు చెందిన బహుళ జాతి కారియర్ సంస్థ ఫెడెక్స్ కు తదుపరి ముఖ్య కార్యనిర్వ హణాధికారి (సీఈఓ) గా, భారత సంతతికి చెందిన రాజ్ సుబ్రమణియమ్ గారు నియమితులయ్యారు. కంపెనీ ప్రస్తుతం చైర్మన్, సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ జూన్ 1 న పదవీ విరమణ చేస్తారు. అప్పుడు సీఈఓగా రాజ్ బాధ్యతలు స్వీకరిస్తారు. కుపెనీలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో స్మిత్ కొనసాగుతారు. ఫెడెక్స్ ను విజయవంతంగా నడిపించే నాయకత్వ సామర్థ్యాలు, రాజ్ సుబ్రమణియమ్ కు ఉన్నాయని నాకు ఆపార విశ్వాసం ఉందని స్మిత్ పేర్కొన్నారు. బోర్డు పాలనతో పాటు అంతర్జాతీయ ప్రాధాన్య అంశాల పైనా దృష్టి సారిస్తానని స్పిల్ వివరించారు. 1971లో ఫెడెక్స్ ను స్మిత్ ఏర్పాటు చేశారు. ‘ప్రెడ్ ఒక దార్శనికత ఉన్న నాయకుడు వ్యాపార ప్రపంచంలో ఒక దిగ్గజం ప్రపంచంలోని అతిగొప్ప కంపెనీల్లో ఒకటిగా ఫెడెక్స్ ను తీర్చిదిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫెడెక్స్ సంస్థ నూతన సియివో గా రాజ్ స్సుబ్రమన్యం నియామకం
ఎవరు: రాజ్ స్సుబ్రమణ్యం
ఎప్పుడు : మార్చ్ 29
ప్రపంచంలోనే ఎదిగిన అగ్రగామి 10 మంది మహిళా బిలియనీర్ల జాబితాలో పాల్గుని నాయర్ కు చోటు :
ప్రపంచంలోనే స్వయంకృషితో ఎదిగిన అగ్రగామి 10 మంది మహిళా బిలియనీర్లలో నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్ చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో తొలిసారి అడుగు పెడుతూనే, 7.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.57,000 కోట్ల) సంపదతో పాల్గుణి ఈ ఘనత సాధించినట్లు హురున్ రీసెర్చ్. ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ప్రపంచ అగ్రగామి 10 మంది మహిళా కుబేరుల్లో మనదేశం నుంచి ఉన్న ఏకైక వ్యక్తీ పాల్గుణి (58) కావడం విశేషం. ఇప్పటి దాకా 20వ ర్యాంకులో ఉన్న, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా స్థానాన్ని నాయర్ ఆక్రమించారు. సౌందర్య, ఫ్యాషన్ బ్రాండ్లను ఆన్లైన్, ఆఫ్ లైన్ లో విక్రయిస్తున్న వైకాను యూనికార్న్ 7500 కోట్లు. అంతకంటే ఎక్కువ విలువ గల కంపెనీ)గా మార్చిన ఘనత ఈమె సొంతం. ప్రస్తుతం ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగిన 124మహిళా బిలియనీర్లు మంది ఉన్నారు. వీరంతా 10 దేశాలకు చెందిన వారే. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా. దక్షిణ కొరియాల నుంచి ఒక్కరూ జాబితాలో లేరు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే ఎదిగిన అగ్రగామి 10 మంది మహిళా బిలియనీర్ల జాబితాలో పాల్గుని నాయర్ కు చోటు :
ఎవరు: పాల్గుని నాయర్
ఎప్పుడు : మార్చ్ 29
డిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరగైసి :
తెలుగుతేజం అర్జున్ ఇరిగే మరో సారి సత్తా చాటాడు. జోరును కొనసాగిస్తూ ఈ గ్రాండ్ మాస్టర్ డిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. మార్చ్ 29న టోర్నీలో ఆఖరిదైన పదో రౌండ్ లో కార్తీక్ వెంకట్రామన్ ను ఓడించిన అర్జున్ మొత్తం 8.5 పాయింట్లతో హర్ష భరత కోటి. గుకేశ్ తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఉత్తమ ప్రొగ్రెసివ్ స్కోరు ఆధారంగా అర్జున్ టైటిల్ దక్కించుకున్నాడు. గుకేశ్ రన్నరప్ గా, హర్ష మూడో స్థానంలో నిలిచారు. చివరి రౌండ్లో అభిజిత్ గుప్తా పై గుకేశ్ నెగ్గగా సేతురామన్ ను హర్ష ఓడించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరగైసి :
ఎవరు: అర్జున్ ఇరగైసి
ఎప్పుడు : మార్చ్ 29
ప్రపంచ వారసత్వ సంపద కట్టడాలజబితాలో చోటు దక్కించుకున్న లేపాక్షి దేవాలయం :
విజయనగర సామ్రాజ్యాధీకుల, క్రీస్తు పూర్వం కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచే అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం మూలాలతో ని ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల జాబితాలో చోటు సాధించడం ద్వారా అంతర్జాతీయంగా కీర్తి. ప్రతిష్టలు పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. అత్యద్భుత శిల్ప కళా సౌందర్యం. ప్రపంచంలోనే పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు గాలిలో వేలాడే స్థంభం ఏడు పడగల భారీ నాగేంద్రుడు అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతి బింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. యునెస్కో కార్యాలయం మార్చ్ 29న రాత్రి విడుదల చేసిన ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి చోటు దక్కించుకుంది. మన దేశం నుంచి మూడు ప్రాంతాలను ప్రతిపాదించగా అందులో లేపాక్షి ఉండటం విశేషం. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం నాటి రాతి బొమ్మ లు (జియోగ్లిప్స్), మేఘాలయలోని సహజసిద్ధ రబ్బరు చెట్ల మూలాలతో నిర్మించిన వంతెనలు (లివింగ్ రూట్ బ్రిడ్జి) ఈ జాబితాలో ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని :అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వ భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ వారసత్వ సంపద కట్టడాలజబితాలో చోటు దక్కించుకున్న లేపాక్షి దేవాలయం
ఎవరు: లేపాక్షి దేవాలయం
ఎక్కడ: ఆంద్రప్రదేశ్ రాష్ట్రము
ఎప్పుడు : మార్చ్ 29
మాల్టా ప్రదాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాబర్ట్ అబెల :
మాల్లా ప్రధాన మంత్రి, రాబర్ట్ అబేలా 2022 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక 2- మెజారిటీతో గెలుపొందిన తర్వాత నేని పాలక లేబర్ పార్టీ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ లేబర్ పార్టీ నాయకుడు మరియు ప్రధాన మంత్రి జోసెఫ్ మస్కట్ రాష్ట్ర “మా చేసిన తర్వాత 2020 జనవరిలో అబేలా తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- మాల్టా దేశ రాజధాని :వాలెట్ట
- మాల్టా దేశ కరెన్సీ : యూరో
క్విక్ రివ్యు :
ఏమిటి: మాల్టా ప్రదాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాబర్ట్ అబెల
ఎవరు: రాబర్ట్ అబెల
ఎక్కడ: మాల్టా దేశం
ఎప్పుడు : మార్చ్ 29
ఓడిశా లో ప్రారంభం ఐన జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 20వ ఎడిషన్ :
జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 20వ ఎడిషన్ ను మార్చి 28న భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఇండియన్ ఆయిల్ నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి దాదాపు 1200 మంది అథ్లెట్లు పాల్గొంటారు. భువనేశ్వర్లోని కళి౦గ అథ్లెటిక్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ను ఒడిశా రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి తుషార్ కాంతి బెహెరా గారు ప్రారంభించారు. జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 25 శాతం మంది మహిళా క్రీడాకారులు పాల్గొంటున్నారు
- ఓడిశా రాష్ట్ర రాజధాని :భువనేశ్వర్
- ఓడిశా రాష్ట్ర సిఎం : నవీన్ పట్నాయక్
- ఓడిశా రాష్ట్ర గవర్నర్ : గనేషి లాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఓడిశా లో ప్రారంభం ఐన జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 20వ ఎడిషన్
ఎక్కడ: ఓడిశా లో
ఎప్పుడు : మార్చ్ 29
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |