Daily Current Affairs in Telugu 28-03-2022
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లో ఆరు అవార్డులు గెలుచుకున్న డ్యున్ చిత్రం :

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం ఆదివారం (భారతదేశంలో సోమవారం తెల్లవారుజామున) రాత్రి లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్లో, ఘనంగా జరిగింది. 94వ అకాడమీ’ అవార్డుల వేడుకలో 10 విభాగాల్లో నామినేట్ అయిన ఫిక్షన్ చిత్రం ‘డ్యూన్ ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. భిన్నమైన కామెడీ డ్రామాగా రూపొందిన ‘కోడా’ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ నటీగా జెస్సీకా చాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మూడో ప్రయత్నంలో విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్) గుర్తింపు పొందారు. అంతే కాకుండ అస్కార్ అవార్డు అందుకున్న మహిళా దర్శకుల జాబితాలో తేనె కలిపియన్ పవర్ స్త్రీలకు ఆదర్శమయ్యారు
- ఉత్తమ చిత్రం :కోడా
- ఉత్తమ నటి : జెస్సికా చాస్టేయిన్ (ది ఐస్ ఆఫ్ తే మీ ఫేయ్ )
- ఉత్తమ నటుడు : విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
- ఉత్తమ దర్శకురాలు : జెన్ క్యాంపియాన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్ )
- సహాయనటుడు : ట్రాయ్ క్యాపిటల్ (కోడా)
.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లో ఆరు అవార్డులు గెలుచుకున్న డ్యున్ చిత్రం :
ఎవరు: డ్యున్ చిత్రం
ఎక్కడ: అమెరికా (లాస్ ఏంజిల్స్)
ఎప్పుడు: మార్చ్ 28
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ :

గోవా రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బిజెపిని విజయతీరాలకు చేర్చిన బిజెపి నేత ప్రమోద్ సావంత్ గారు మార్చ్ 28 బాద్యతలు చేపట్టారు. బాంబోలిమ్ లోని ఒక స్టేడియం లో జరిగిన కార్యక్రమం లో సావంత్ చేత గోవా రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్ళై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాద్యతలు స్వీకరించారు. 28,29 వ తేదిల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో సావంత్ బాల పరీక్ష లో మెజారిటి ని నిరుపించుకోవాల్సి ఉంది
- గోవా రాష్ట్ర రాజధాని : పనాజి
- గోవా రాష్ట్ర సిఎం :ప్రమోద్ సావంత్
క్విక్ రివ్యు :
ఏమిటి: గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్
ఎవరు: ప్రమోద్ సావంత్
ఎక్కడ: గోవా రాష్ట్రము
ఎప్పుడు: మార్చ్ 28
కల్యాణ్ జువెలర్స్ చైర్మన్ గా మాజీ కాగ్ వినోద్ రాయ్ నియామకం :
కల్యాణ్ జువెలర్స్ చైర్మన్ గా పూర్వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) వినోద్ రాయ్ నియమితులయ్యారు. ఈయన కంపెనీ బోర్డులో స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించనున్నారు. వినోద్ రాయ్ నియామకానికి నియంత్రణ సంస్థలు, వాటాదారుల అనుమతి తీసుకోవాల్సి ఉందని ఎక్స్ఛేంజీలకు కల్యాణ్ జువెలర్స్ తెలియజేసింది. టి.ఎస్. కల్యాణరామన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరుగా కొన సాగుతారని సంస్థ పేర్కొంది.
- కాగ్ పూర్తి రూపం : కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
- కాగ్ గురించి రాజ్యాంగంలో తెలిపీ ఆర్టికల్ : ఆర్టికల్ 148
- ప్రస్తుత కాగ్ :గిరీష్ చంద్ర ముర్ము
క్విక్ రివ్యు :
ఏమిటి: కల్యాణ్ జువెలర్స్ చైర్మన్ గా మాజీ కాగ్ వినోద్ రాయ్ నియామకం
ఎవరు: వినోద్ రాయ్
ఎప్పుడు: మార్చ్ 28
అసోచామ్ అధ్యక్షుడిగా సియివో గా బాద్యతలు స్వీకరించిన సుమంత్ సిన్హా :
రెన్యూ పవర్ వ్యవస్థాపక చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా అసోచామ్ అధ్యక్షుడిగా మార్చ్ 28న బాధ్యతలు స్వీకరించారు. స్పైస్టెట్ చైర్మన్, మేనే జింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అసోచామ్ నూతన సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ‘అధ్యక్షుడిగా నా పదవీ కాలంలో అసోచామ్ సహచ రులతో కలిసి పని చేసి ప్రభుత్వం,తో ప్రధాని మోదీ ఆకాంక్షల మేరకు స్వావ లంబన భారత్ దిశగా దేశాన్ని నడిపించేందుకు కృషి చేస్తాన’ని సుమంత్ వెల్లడించారు. వివిధ రంగాల వారీ ధోరణులపై అసోచామ్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తుంది. ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి శ్రమ వృద్ధికి సహకరిస్తామని అజయ్ సింగ్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అసోచామ్ అధ్యక్షుడిగా సియివో గా బాద్యతలు స్వీకరించిన సుమంత్ సిన్హా
ఎవరు: సుమంత్ సిన్హా
ఎప్పుడు: మార్చ్ 28
దేశంలో ఎరువుల వినియోగంలో ఐదో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ :
దేశంలో ఎరువుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అయిదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో హెక్టార్ కు 203 కేజీల ఎరువులు వాడుతున్నారు. దానికంటే ముందు తెలంగాణ (262), బిహార్(216), పంజాబ్(213), హరియాణ(210) ఉన్నాయి అని ‘ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030’ పుస్తకం పేర్కొంది. నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఒక సంపాదకుడిగా ఉన్న ఈ పుస్తకం మార్చ్ 28న విడుదలైంది. ఇందులో పేర్కొన్న అంశాల ప్రకారం రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం బాగా అమలవుతోంది. దానివల్ల సాధారణ సాగుదారులతో పోలిస్తే సహజసాగు చేపట్టిన రైతుల నికర ఆదాయంలో గణనీయమైన తేడా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల 2050 కల్లా ఏపీ దక్షిణ ప్రాంతంలో శనగ దిగుబడులు 7-18% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో అత్యధిక నీరు వినియోగించే వారి స్థానంలో ఖరీప్ సీజన్లో కంది, వేరుశ నగ, రబీ సీజన్లో శనగ, నువ్వులవైపు మళ్లేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో సాధారణంగా వరిసాగుకు ఏటా 10,06 శతకోటి ఘనపు మీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో 10-25% వరిసాగు ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లితే 19%, రబీ సీజన్లో ’25-50% మేర ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లితే 10% నీటిని ఆదా చేయడానికి వీలవుతుంది. ఏపీలో 2016లో సామాజిక ఆధారిత సహజ వ్యవసాయ కార్యక్రమం (కమ్యూనిటీ బేస్ట్ నేచురల్ ఫార్మింగ్ ప్రోగ్రాం) చేపట్టారు. ఇక్కడ జరిగిన పంటకోతల అనుభవాలను బట్టి దిగుబడులు గరిష్టంగా పెరిగి, ఖర్చులు తగ్గాయి. సాధారణ సాగు చేసిన రైతులతో పోలిస్తే సహజ వ్యవ సాయం చేసిన వారి నికర ఆదాయం పెరిగింది
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని :అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వ భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలో ఎరువుల వినియోగంలో ఐదో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
ఎవరు: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: మార్చ్ 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |