Daily Current Affairs in Telugu 24-03-2022
ఇండియన్ గ్రాండ్-2 రజత పథకం సాధించిన తెలంగాణా అథ్లెట్ జి.మహేశ్వరి :
ఇండియన్ గ్రాండ్-2 సెట్ లో తెలంగాణ అత్లెట్ జి మహేశ్వరి రజత పథకంను సాధించింది. తిరువనంతపురంలో మార్చ్ 23న జరిగిన ఈ మీట్ లో మహేశ్వరి 3000 “మీటర్ల స్టీపుల్ చేజ్ లో 10 నిమిషాల 52.49 సెకన్లలో గమ్యాన్ని చేరింది. పారుల్ (ఉత్తర ప్రదేశ్ :9. 38.20 పెట్టు) స్వర్ణ పతకాన్ని గెలిచింది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో అవినాష్ (మహారాష్ట్ర. 8ని:16:21 సెకన్లు కొత్త జాతీయ రికార్డు సృష్టించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ గ్రాండ్-2 రజత పథకం సాధించిన తెలంగాణా అథ్లెట్ జి.మహేశ్వరి
ఎవరు: జి.మహేశ్వరి
ఎప్పుడు: : మార్చ్ 24
మహిళల టెన్నిస్ క్రీడాకారిణి యాష్లే బార్టే ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :
మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్, మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత యాష్లే బార్జీ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మాజీ డబుల్స్ భాగస్వామి కేసీ డెలాక్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై టెన్నిస్ లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని, అందుకు తగిన ప్రేరణ లభించకపోవడం కూడా రిటైర్మెంట్ కారణమని బార్టీ స్పష్టం చేసింది. 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్వదేశంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన బార్టీ ఆ తర్వాత మరే టోర్నీలోనూ బరిలోకి దిగలేదు. 2008లో ఆస్టిన్ హెనిన్ బెల్జియం) కూడా ఇదే తరహాలో. వరల్డ్ నంబర్ వన్ గా ఉండగానే రిటైర్మెంట్ చేశాను అని ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల టెన్నిస్ క్రీడాకారిణి యాష్లే బార్టే ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :
ఎవరు: యాష్లే బార్టే
ఎప్పుడు: : మార్చ్ 24
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల జాబితాలో మళ్ళి మొదటి స్థానం లో నిలిచిన రవీంద్ర జడేజా :
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల జాబితాలో టీమ్ ఇండియా. ఆటగాడు రవీంద్ర జడేజా తిరిగి ఆగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. మార్చ్ 23న ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో అతను మళ్లీ నంబర్ వన్ గా నిలి చాడు. శ్రీలంకతో తొలి టెస్టులో అజేయంగా 175 పరుగులు చేయడంతో పాటు తొమ్మిది వికెట్లు తీసిన అతను అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత విండీస్ ఆల్ రౌండర్ హోల్డర్ అతణ్ని వెనక్కి నెట్టారు. ఇప్పుడు జడ్డూ మరోసారి హోల్డర్ ను దాటి తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆల్ రౌండర్లలో అశ్విన్ మూడో స్థానాన్ని నిలబె ట్టుకున్నాడు: బౌలర్ల జాబితాలో అశ్విన్, బుమ్రా వరుసగా రెండు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఆగ్ర స్థానంలో ఉన్నాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల జాబి తాలో మళ్ళి మొదటి స్థానం లో నిలిచిన రవీంద్ర జడేజా
ఎవరు: రవీంద్ర జడేజా
ఎప్పుడు: మార్చ్ 24
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ దామి :
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ దామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో మార్చ్ 24న ప్రమాణ స్వీకారం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో 46 ఏళ్ల దామితో పాటు 8 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాద్ సింగ్, నితిన్ గడ్కరీ, బాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
- ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని :డెహ్రాడూన్
- ఉత్తరాఖండ్ రాష్ట్ర సిఎం : పుష్కర్ సింగ్ దామి
- ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ : గుర్మీత్ సింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ దామి
ఎవరు: పుష్కర్ సింగ్ దామి
ఎక్కడ: ఉత్తరాఖండ్
ఎప్పుడు: మార్చ్ 24
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవంగా మార్చ్ 24 :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, క్షయవ్యాధి ప్రపంచంలోనే ప్రతిరోజూ 4,100 మందికి పైగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరియు క్షయవ్యాధి కారణంగా దాదాపు 28,000మంది వ్యక్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. క్షయవ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24న నిర్వహించబడుతుంది. జర్మన్ వైద్యుడు మరియు బ్యాక్టీరియాలజీ వ్యవస్థాపకులలో ఒకరైన డాక్టర్ రాబర్ట్ కోచ్ 1882లో క్షయవ్యా కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నట్లు ప్రకటించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవంగా మార్చ్ 24
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: : మార్చ్ 24
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |