Daily Current Affairs in Telugu 19-03-2022
మణిపూర్ ముఖ్యమంత్రిగా మళ్లి బాద్యతలు చేపట్టనున్న ఎన్.బిరెన్ సింగ్ :
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మళ్లీ బీరేన్ సింగ్ నే వరించింది. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చ్ 20 రోజు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధిష్టాను పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా సీఎం పదవికి బీరేన్ సింగ్ ఎన్నుకున్నారు.. ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చ్ 19న రోజు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధిష్ఠానం పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందంరు ఏకగ్రీవంగా సీఎం పదవికి బీరేన్ సింగ్ పేరును ప్రతిపాదించడంతో ఆయనే తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మణిపూర్ ముఖ్యమంత్రిగా మళ్లి బాద్యతలు చేపట్టనున్న ఎన్.బిరెన్ సింగ్
ఎవరు: ఎన్.బిరెన్ సింగ్
ఎక్కడ: మణిపూర్
ఎప్పుడు: మార్చ్ 19
బహ్రెయిన్ గ్రాండ్ లో విజేతగా నిలిచిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ :
క్వాలిఫయింగ్ సెషన్ లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ మార్చ్ 20 న జరిగిన ఫార్ములావన్ సీజన్ 30 చేను బహ్రెయిన్ గ్రాండ్ లో విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్ ల ను చార్లెస్ ఒక గంట 37 నిమిషాల 33,584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారి కే చెందిన కార్లోస్ సెయింట్ అనే క్రీడాకారుడు రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్ స్టాపెన్ 54వ ల్యాప్ వైదొలిగారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బహ్రెయిన్ గ్రాండ్ లో విజేతగా నిలిచిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ :
ఎవరు: ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్
ఎప్పుడు: మార్చ్ 19
ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న పంకజ్ అద్వాని :
భారత క్యూ స్టార్ పంకజ్ అడ్వాణీ ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నాడు. మార్చ్ 20న సింగిల్స్ ఫైనల్లో పంకజ్ 6-2తో మరో భారత ఆటగాడు ధ్రువ్ సిత్వాలాపై గెలిచాడు. తుది సమరంలో తొలి మూడు ప్రేమ్ లు గెలిచిన అడ్వాణీకి ఆ తర్వాత నాలుగో ఫ్రేమ్ లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. ఈ ప్రేమ్ ను ధ్రువ్ గెలుచుకున్నాడు. కానీ పుంజుకున్న పంకజ్ ఆ తర్వాత రెండు ప్రేమ్లు దక్కించుకుని అధిక్యాన్ని 5-1కి పెంచుకున్నాడు. కానీ ఏడో ఫ్రేమ్ లో మరోసారి సిత్వాలా పైచేయి సాధించాడు. అయితే ఎనిమిదో ఫ్రేమ్ లో ప్రత్యర్ధికి అవ కాశం ఇవ్వని పంకజ్ ప్రేమ్ తో పాటు టైటిల్ ను చేజిక్కించుకు న్నాడు. కెరీర్ లో అడ్వాణీకి ఇది ఎనిమిదో ఆసియా బిలియర్డ్స్ బైటిల్ మొత్తం మీద అతడికి ఇది 40వ అంతర్జాతీయ టైటిల్:
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న పంకజ్ అద్వాని
ఎవరు: పంకజ్ అద్వాని
ఎప్పుడు: మార్చ్ 19
ఆసియా కప్ ఆర్చరీ లో మరో స్వర్ణం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ధీరజ్ :
ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ ఖాతాలో ఆసియా కప్ ఆర్చరీ లో మరోస్వర్గం చేరింది. వ్యక్తిగత జట్టు విభాగంలో మరో విభాగంలో విఫలమైన ఈ కుర్రాడు ఇద్దరితో కలిసి పసిడి గెలిచాడు. మార్చ్ 20న రికర్వ్ టీమ్ ఫైనల్లో ధీరజ్ పార్ట్, రాహుల్ తో కూడిన భారత బృందం 8 -2లో కజకిస్థాన్ ను ఓడించి పసిడి గెలుచుకుంది. ఇద్దరూ భారత ఆర్చర్ లు తలపడిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఆఖరి సమరంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఈ పోరులో సాక్షి-పనీత్ కౌర్ చెరో 140 పాయింట్లు సాధించడంతో షూటాఫ్ నిర్వహించారు. అందు లోనూ ఇద్దరూ 10 పాయింట్లు సాధించిన మధ్య స్థానానికి చేరువగా బాణాన్ని సంధించిన సాక్షి పసిడి కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా కప్ ఆర్చరీ లో మరో స్వర్ణం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ధీరజ్ :
ఎవరు: ధీరజ్
ఎప్పుడు: మార్చ్ 19
తెలంగాణా సాయుధ పోరాట యోడురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత :
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు తెలంగాణా సాయుధ పోరాట యోడురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూసారు.1945 -48 మద్య మహాజ్వోలంగా జరిగన తెలంగాణా రాష్ట్ర సాయుధ పోరాటం లో తుపాకి చేతబట్టి ఎందఱో మహిళలకు ప్రేరణగా నిలిచారు.గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించేలా సభలు ఆనాటి రజాకార ఆగడాలకు వ్యతిరేఖంగా బతుకమ్మ పాటలతో ఉర్రుతలుంగించే ఉపన్యాసాలతో మహిళల్ని చైతన్య పరచడం లో కీలక పాత్ర పోషించారు.75 ఏళ్ల సుదీర్గ రాజకీయ ప్రజస్థానం లో ఆమె రెండు సార్లు (1978 1983) లలో తుంగతుర్తి శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.అఖిల భారత మహిళా సంఘం నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలపై చేసారు.1945 -48 వరకు సాగిన సాయుధ పోరాటంలో తన 16 వ ఏటనే తుపాకి చేతబట్టిన తొలి మహిళగా రికార్డుగా సృష్టించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా సాయుధ పోరాట యోడురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత :
ఎవరు: మల్లు స్వరాజ్యం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు:మార్చ్ 19
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |