Daily Current Affairs in Telugu 16-03-2022
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంస్థ దక్షిణ ప్రాంత చైర్మన్ గా సుచిత్ర కే ఎల్లా ఎన్నిక :
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంస్థ ( సీఐఐ) కు దక్షిణ ప్రాంత చైర్పర్సన్ భారత్ బయోటెక్ కో-ఫౌం డర్, జేఎండీ సుచిత్ర కె ఎల్లా ఎన్నికయ్యారు. 2022-23 సంవత్సరానికిగాను ఆమె ఈ పద విలో ఉంటారు . ఇప్పటి వరకు డిప్యూటీ చైర్ ప ర్సన్ గా ఉన్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కమల్ బాలి డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంస్థ దక్షిణ ప్రాంత చైర్మన్ గా సుచిత్ర కే ఎల్లా ఎన్నిక
ఎవరు : సుచిత్ర కే ఎల్లా
ఎప్పుడు : మార్చ్ 16
మహిళా వన్డే క్రికెట్ లో అరుదైన రికార్డ్ సాధించిన మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి :
భారత మహిళా క్రికెట్ సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఒక అరుదైన రికార్డు సాధించింది. ఇటీవల జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ తో 250 వికెట్ల మార్క్ చేరుకున్న తొలి మహిళా బౌలర్ గా చరిత్ర సృష్టించింది. ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ లో జరిగిన లీగ్ మ్యాచులో ఒక వికెట్ పడగొట్టిన జులన్ ఈ ఘనత సాధించింది. ఇప్పటి వరకు 199 వన్డేలు ఆడిన జులస్ 250 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బౌలర్ ఫిట్జ ప్యాట్రిక్ ప్యాట్రిక్ (80 వికెట్లు) రెండు, వెస్టిండీస్ పేసర్ అనిసా మహమ్మద్ (180 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మహిళా వన్డే క్రికెట్ లో అరుదైన రికార్డ్ సాధించిన మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి :
ఎవరు : జులన్ గోస్వామి
ఎప్పుడు : మార్చ్ 16
రష్యా పైన సస్పెన్షన్ ను విధించిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య :
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మార్చ్ 16న రష్యాను. సస్పెండ్ చేసింది. ఇక పిడే నిర్వహించే ఏ టోర్నీలోనూ రష్యా దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొనలేరు. ఉక్రెయిన్ పైన ఇటీవల రష్యా దురాక్రమణ చేస్తున్న నేపథ్యంలో సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాకు సహకరిస్తున్న బెలారస్ పై కూడా నిషేదం పడింది. అయితే ఆ రెండు దేశాల క్రీడాకారులు పిడే పతాకం కింద టోర్నీల్లో పోటీ లో పాల్గొనరాదు.. “ఐఓసి సూచనలను పరిగణనలోకి తీసుకున్న పీడే రష్యా, బెలారస్ జాతీయ జట్లను తాను నిర్వహించే అన్ని టోర్నమెంట్ల నుంచి నిషేధించింది అని పిడే ఓ ప్రకటనలో తెలిపింది. ఐఓసి సూచన మేరకు ఇప్పటికే అనేక క్రీడా సంఘాలు రష్యాపై నిషేధం విధించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : రష్యా పైన సస్పెన్షన్ ను విధించిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య :
ఎవరు : అంతర్జాతీయ చెస్ సమాఖ్య
ఎప్పుడు : మార్చ్ 16
ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా పొందిన తెలంగాణ కుర్రాడు ప్రణీత్ ఉప్పల :
చదరంగంలో తెలుగు యువ క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. 15 ఏళ్ల తెలంగాణ కుర్రాడు ప్రణీత్ ఉప్పల ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదా సొంతం చేసుకోగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన 14 ఏళ్ల సాహితి వర్షిణి మహిళల ఐఎంను ఖాతాలో వేసుకుంది. తాజాగా బుడా పెస్ట్ టోర్నీ చివరి రౌండ్లో రత్నవేల్ గేమన్ను డ్రాగా ముగించిన ప్రణీత్ మూడో ఐఎం నార్మ్ సాధించాడు. ఈ టోర్నీలో ఆరు విజయాలు, రెండు డ్రాలు, ఒక ఓటమి నమోదు చేసిన ఈ ‘నల్గొండ ఆటగాడు మొత్తం తొమ్మిది రౌండ్ల (నుంచి 7 పాయింట్లు గెలుచుకున్నాడు. ప్రస్తుతం 2103 ఎలో రేటింగ్ సాధిస్తే ఆటను గ్రాండ్ మాస్టర్ గా నిలిస్తాడు.తొలి ఐఎం నార్మ్ ను 2018 లోనే సాధించిన ఆటను రెండో నార్మ్ ను ఈ ఏడాది జనవరి లో గెలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా పొందిన తెలంగాణ కుర్రాడు ప్రణీత్ ఉప్పల
ఎవరు : ప్రణీత్ ఉప్పల
ఎప్పుడు : మార్చ్ 16
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కు ఆతిత్యం ఇవ్వనున్న భారత్ :
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడు భారత్ ఆతిథ్యమివ్వ నుంది. ఉక్రెయిన్ పై దండయాత్ర కారణంగా రష్యా నుంచి తరలించిన ఈ టోర్నీని ఈ ఏడాది చెన్నైలో నిర్వహించను న్నారు. 2013లో ప్రపంచ చాంపియన్షిప్ తర్వాత భారత్ లో జరగనున్న రెండో పెద్ద చెస్ టోర్నమెంట్ ఇదే. ఒలింపయాడ్ కు చెన్నై అతిద్యమివ్వనున్న విషయాన్ని తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “భారత చెస్ 44వ చెస్ ఒలింపియా డ్ కు ఆతిధ్యమివ్వనున్నందుకు సంతోషంగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా చెస్ రాజులు, రాణులను చెన్నై సాదరంగా ఆహ్వానిస్తోంది” అని ఆయన ట్వీట్ చేశారు. “ఇప్పుడిక అధికారికంగాచెస్ ఒలింపి యాడ్ 2022కు చెన్నైలో భారత్ ఆతిథ్యమివ్వ అని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చెప్పింది. టోర్నీకి ఆతిథ్యమివ్వడం కోసం ఫిడేకు ఏఐసీఎఫ్ రూ. 70 కోట్లకు హామీనిచ్చింది. చెస్ ఒలింపియాడ్ ప్రతి రెండేళ్లకు ఓసారి నిర్వహిస్తారు. ఈసారి జులై 26 ఆగస్టు 28 వరకు జరగనుంది. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం వేదిక: 150కి పైగా దేశాల క్రీడాకారులు చెస్ ఒలింపియాడ్లో పోటీపడతారని భావిస్తున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కు ఆతిత్యం ఇవ్వనున్న భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : మార్చ్ 16
చైనా లో నూతన భారత రాయబారిగా భాద్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్ రావత్ :
చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు.డిప్యూటీ నేషనల్ రాయబారి రావత్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమితులైన విక్రమ్ మిస్రి స్థానంలో నియమితులయ్యారు.1990 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, రావత్ గతంలో, నెదర్లాండ్స్ లోను భారత రాయబారిగా ఉన్నారు. రావత్ 1990లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో చేరారు. అతను 1992 మరియు 1997 మధ్య హాంకాంగ్ దేశంలో మరియు బీజింగ్ లో పనిచేశాడు. అతను 1997లో ఢిల్లీకి తిరిగి వచ్చి 3 సంవత్సరాలకు పైగా తూర్పు ఆసియా విభాగంలో పనిచేశాడు. ఆ తర్వాత మారిషస్లో ని ఇండియన్ మిషన్ లో ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు.ప్రదీప్ కుమార్ రావత్ సెప్టెంబరు 2017-డిసెంబర్ 2020 వరకు, ఇండోనేషియా మరియు తైమూర్ లో భారత రాయబారిగా మరియు నెదర్లాండ్స్ లో పనిచేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : చైనా లో నూతన భారత రాయబారిగా భాద్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్ రావత్
ఎవరు : ప్రదీప్ కుమార్ రావత్
ఎక్కడ : చైనా
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |