Daily Current Affairs in Telugu 08&09-03-2022
నూర్-2 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇరాన్ దేశం :
ఇరాన్ దేశం యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నూర్-2 అనే ఒక ఉపగ్రహాన్ని భూమి నుండి 500 కిలోమీటర్ల (311 మైళ్లు) ఎత్తులో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇరాన్ కి ఇది రెండవ సైనిక ఉపగ్రహం. దీనిని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రారంభించింది.
- ఇరాన్ దేశ రాజధాని ;టెహ్రాన్
- ఇరాన్ దేశ కరెన్సీ : ఇండియన్ రూపి
- ఇరాన్ దేశ అద్యక్షుడు :ఇబ్రహీం రైసి
క్విక్ రివ్యు :
ఏమిటి: నూర్-2 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇరాన్ దేశం
ఎవరు: ఇరాన్ దేశం
ఎక్కడ: ఇరాన్ దేశంలో
ఎప్పుడు: మార్చ్ 08
హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొదటి సారిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహిళా ఆఫీసర్ నియామకం :
హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళా సిఐ మధులతకు SHOగా బాధ్యతలు అప్పగించారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ, నగర సిపి సీవి ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా సీఐకి మధులతకు బాధ్యతలు అప్పగించారు.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పి ఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా సర్కిల్ ఇన్ స్పెక్టర్హైదరాబాద్ నగ పాలను చరిత్రలో మొట్ట మొదటిసా మధులతకు SHOగా బాధ్యతలు అప్పగించారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ, నగర సిపి సీవి ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళాసీఐకి మధులతకు బాధ్యతలు అప్పగించారు. 174ఏండ్ల హైదరాబాద్ పోలీసు చరిత్రలో తొలిసారిగా ఆమె మహిళా స్టేషన్ కరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొదటి సారిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహిళా ఆఫీసర్ నియామకం
ఎవరు: సి ఐ మధులత
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: మార్చ్ 08
భారత్ లో మొదటి సారిగా అతి తక్కువ వయసులో స్కై డైవింగ్ లైసెన్స్ పొందిన అనామిక :
భారత్ లో స్కై డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా అనామిక వార్తల్లో నిలిచింది 21 ఏళ్ల అనామిక శర్మ. ఇంజినీరింగ్ చదువుతున్నది కాగా ఈ యేడాది దుబాయ్ డ్రాప్ జోన్ నుండి ‘ఎ’ కేటగిరీ ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి ఈమె లైసెన్స్ పొందింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లో మొదటి సారిగా అతి తక్కువ వయసులో స్కై డైవింగ్ లైసెన్స్ పొందిన అనామిక
ఎవరు: అనామిక శర్మ
ఎప్పుడు: మార్చ్ 08
గుజరాత్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు కు ఆమోదం :
గుజరాత్లోని జామ్ నగర్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (WHO GCTM) ఏర్పాటుకు మార్చి 9న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవారిగా మరియు హోమియోపతి వంటి ఔషధ రంగాలకు అంకితమైన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది. తెలిపింది.”ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ ఔషధం కోసం ఇది మొదటి మరియు ఏకైక గ్లోబల్ అవుట్ పోస్ట్ WHO GCTM యొక్క ప్రయోజనాలలో ఒకటి. ఇది .
క్విక్ రివ్యు :
ఏమిటి: గుజరాత్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు కు ఆమోదం
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: గుజరాత్ లో
ఎప్పుడు: మార్చ్ 09
.
రష్యాలో తన ఛానెల్ లను నిషేధించిన డిస్కవరీ ఇంక్ చానెల్ :
డిస్కవరీ ఇంక్ (DISCA. O) రష్యాలో తన ఛానెల్ ను మరియు సేవల ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది, ఉక్రెయిన్ పైన దాడికి ప్రతిస్పందనగా ఆ దేశం నుండి వైదొలగుతున్న పెరుగుతున్న కార్పొరేషన్లలో చేరింది. HG’TV, యానిమల్ ప్లానెట్, TLC మరియు యూరోస్పోర్ట్ తో సహా డిస్కవరీ యొక్క పదిహేను వినోద బ్రాండ్ లు రష్యా యొక్క నేషనల్ మీడియా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన మీడియా అలయన్స్ ద్వారా పంపిణీ చేయబడ్డాయి. నేషనల్ మీడియా గ్రూప్ కూడా నెట్క్ భాగస్వామ్యంలో ఉంది,. నెట్ ఫ్లెక్స్ తన రష్యన్ సర్వీసును నిలిపివేసింది.
- రష్యా రాజధాని :మాస్కో
- రష్యా దేశ కరెన్సీ : రుబెల్
- రష్యా దేశ అధ్యక్షుడు ; వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: రష్యాలో తన ఛానెల్ లను నిషేధించిన డిస్కవరీ ఇంక్ చానెల్
ఎవరు: డిస్కవరీ ఇంక్ చానెల్
ఎప్పుడు: మార్చ్ 08
మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కార కోసం ఉద్యమిక పేరుతో ప్రత్యెక విభాగం ఏర్పాటు :
మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక’ పేరుతో. ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ముహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరబాద్
- తెలంగాణ రాష్ట్ర సిఎం : కే.చంద్రశేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ ;తమిలసై సౌందర రాజన్
- తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి : కే.తారక రామ రావు
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కార కోసం ఉద్యమిక పేరుతో ప్రత్యెక విభాగం ఏర్పాటు
ఎవరు: ఐటి శాఖ మంత్రి కేటిఆర్
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: మార్చ్ 08
ఉక్రెయిన్ దేశానికి 723 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంక్:
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది.ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ 100 బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. తెలిపింది. ఉక్రెయిన్ 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్యాకేజీలో 350 మిలియన్ డాలర్లు అనుబంధ రుణం, 139 మిలియన్ డాలర్లు గ్యారెంటీ, 134 మిలియన్ డాలర్లు గ్యాంట్ ఫైనాన్సింగ్, 100 మిలియన్ డాలర్లు ఫైనాన్సింగ్ కోసం నిధులుగా కేటాయించారు. ఈ ప్యాకేజీ ఉక్రేనియన్ ప్రజలకు కీలకమైన సేవలను అందించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఈ నగదును ఆసుపత్రి కార్మికులకు వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు, నిస్సహాయులకు సామాజిక కార్యక్రమాలు కోసం వినియోగించనున్నారు.
- ఉక్రెయిన్ దేశ రాజధాని : క్విట
- ఉక్రయిన్ దేశ కరెన్సీ ; ఉక్రైనియన్ హ్రివినియా
- ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు :వ్లోదిమిర్ జేలస్కి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉక్రెయిన్ దేశానికి 100 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన యుకె
ఎవరు: యుకె
ఎప్పుడు: మార్చ్ 08
హరిప్రసాద్ చౌరాసియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్న అహ్మద్ అలీ ఖాన్ ;
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఇండియన్ క్లాసికల్ సరోద్ వాద్యకారుడు ఉస్తాద్ అమ్హద్ అలీఖాన్ కు ఇటీవల థానేలో జరిగిన ఒక కార్యక్రమంలో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రిప్రసాద్ చౌరాసియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్న అహ్మద్ అలీ ఖాన్
ఎవరు: అహ్మద్ అలీ ఖాన్
ఎప్పుడు: మార్చ్ 08
ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటింపు :
ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని రకాల దేశ వాళీ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ఇటీవల ప్రకటించాడు. శ్రీశాంత్ భారత్ తరపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్ లు ఆడాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి 2020లో ‘నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. అతడు చివరిసారి గత నెలలో కేరళ, మేఘాలయ మధ్య రంజీ మ్యాచ్ లో ఆడాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల శ్రీశాంత్ తన రిటైర్మెంట్ను ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.. 2006లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ లో శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడుగా ఉన్నాడు. 2011లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులోనూ శ్రీశాంత్ ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: శ్రీశాంత్
ఎప్పుడు: మార్చ్ 08
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |