Daily Current Affairs in Telugu 06-03-2022
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో ప్రపంచ రికార్డ్ సాధించిన మిథాలి రాజ్ :
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సాధించింది. మౌంట్ మౌన్ గనుయ్ వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్ లో అత్యధిక వన్డే ప్రపంచకప్ లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచింది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్లో పాల్గొంది. 2000 సంవత్సరం వరల్డ్ కప్ లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్ లో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాకీ, ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ ఎడ్వర్టైనె రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేసింది. హాకలో, ఎడ్వర్డ్స్ వరుసగా ఐదు ప్రపంచకప్ ఆడారు. ఇక ఆరు ప్రపంచకప్ లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. వరుసగా 1992, 1996, 1999, 2003, 2007, 2011 ప్రపంచకప్ లో భారత తరుపున సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ లో ఆడారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో ప్రపంచ రికార్డ్ సాధించిన మిథాలి రాజ్
ఎవరు: కెప్టెన్ మిథాలి రాజ్
ఎక్కడ : న్యూజిలాండ్ దేశం
ఎప్పుడు: మార్చ్ 05
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ అనే పథకం ను ప్రారంబించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ నురాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలని నిర్ణయిచింది. దీనికోసం పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్ హెల్త్ ప్రొఫైల్ పెలెట్ ప్రాజెక్టును మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి హరీశ్ రావుహెల్త్ ప్రొఫైల్ ప్రారబించారు.ఈ ప్రొఫైల్ ను సిద్ధం చేయడంలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటిటికీ వెళ్లి ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరి౦చనున్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్ ఇస్తారు. వారి నుంచి నమూనాలను సేకరించి 30 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల పరంగా వారి ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ అనే పథకం ను ప్రారంబించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు
ఎవరు: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు
ఎక్కడ : తెలంగాణా రాష్ట్రము
ఎప్పుడు: మార్చ్ 05
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంకింగ్ లో 120 వ స్థానంలో నిలిచిన భారత్ :
2015లో 192 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2030 ఎజెండాలో భాగంగా.. ఆమోదించిన 17 స స్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDG)లో భారత్ గత ఏడాది 117 నుంచి మూడు స్థానాలు దిగజారి 120వ ర్యాంకు పడిపోయిందని తాజా నివేదిక పేర్కొంది. తాజా ర్యాంకింగ్ తో భారతదేశం ఇప్పుడు పొరుగున ఉన్న పాకిస్తాన్ మినహా అన్ని దక్షిణాసియా దేశాల కంటే వెనుకబడి ఉంది. ఇది 129వ స్థానంలో ఉంది. భూటాన్ (75), శ్రీలంక (87), నేపాల్ (96) మరియు బంగ్లాదేశ్ (100) తర్వాత భారతదేశం ఉంది. ఈ ర్యాంకింగ్ లో మొదటి 5 దేశాలు: ఫిన్లాండ్, స్వీడన్, డెన్నార్క్, జర్మనీ, బెల్జియం, ఇది కాకుండా కేంద్ర పర్యావరణ మంత్రి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్, 2022ను విడుదల చేశారు. నివేదిక ప్రకారం, SDGల పై ముఖ్యమైన సవాళ్ల కారణంగా భారతదేశం ర్యాంక్ పడిపోయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంకింగ్ లో 120 వ స్థానంలో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: మార్చ్ 06
భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ నటి విద్యాబాలన్ ఎంపిక :
భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నియమితులయ్యారు. విద్యాబాలన్ భీమా సంస్థ “#DoTheSmartThing” అనే ప్రచారాన్ని మరింతగా పెంచడానికి సహాయం చేస్తుంది. కాగా పరాగ్ రాజా ప్రస్తుతం భారతి అక్సా లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ నటి విద్యాబాలన్ ఎంపిక
ఎవరు: విద్యాబాలన్
ఎప్పుడు: మార్చ్ 06
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |