Daily Current Affairs in Telugu 03-03-2022
సీనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచిన అర్జున్ ఎరిగైసి :
టోర్నీలో పరాజయమెరుగని గ్రాండ్ మాస్టర్ ఎరిగైన్ అర్జున్ సీనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచాడు. సీనియర్ టైటిల్ ను సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా ఇతను ఘనత వహించాడు. ఆఖరి 11వ రౌండ్ గేమ్ లో 18 ఏళ్ల అర్జున్ మాజీ చాంపియన్ సేతురామన్ (8)తో ‘డ్రా’ చేసుకున్నాడు. టైటిల్ రేసులో ఉన్న గుకేష్ ఇనియన్ జతయ్యాడు. గుకేశ్ కూడా ఆర్యన్ చోప్రా (8)తో డ్రా చేసుకోగా, ఇనియన్ మిత్రభా గుహా (బెంగాల్)ను ఓడించాడు. దీంతో అర్జున్ తో పాటు తమిళ గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ఇనియన్ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా చివరకు టైబ్రేక్ స్కోరుతో అర్జున్ ను విజే తగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్లకు పరుసగ రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడికి ట్రోపీతో పాటు రూ. 8 లక్షలు ప్రైజ్ మనీగా లభించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: సీనియర్ జాతీయ చెస్ చాంపి ని విజేతగా నిలిచిన అర్జున్ ఎరిగైసి
ఎవరు: అర్జున్ ఎరిగైసి
ఎప్పుడు: మార్చ్ 03
అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ప్రపంచకప్ లో రెండో పతకం గెలుచుకున్న ఇషా సింగ్ :
అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ ఎఫ్) ప్రపంచకప్ లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రెండో పతకంతో మెరిసింది. మార్చ్ 03న వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన ఇషా టీమ్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్పెస్టల్ టీమ్ ఈవెంట్ ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. పతక పోరులో జర్మనీ షూటర్లతో తలపడిన బృందం 16 పాయింట్లు సాధిస్తే సాంద్రా. ఆండ్రియా కెరీనాలున్న జర్మనీ జట్టు కేవలం 6 పాయింట్లే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు తొలి క్వాలిఫయింగ్ లో భారత జట్టు 858 పాయింట్లు, రెండో క్వాలిఫయింగ్లో 514 పాయింట్లు స్కోరు చేసింది. జర్మనీ ఈ రెండు అర్హత పోటీల్లోనూ 851, 571 స్కోర్లతో వెనుకంజలోనే ఉంది. 16-80 సింగపూర్ పైన నెగ్గిన చైనీస్ తైపీ జట్టుకు కాంస్యం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సారల్ చౌదరీ, గౌరవ్ రాణా, బాలకృష్ణలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ప్రపంచకప్ లో రెండో పతకం గెలుచుకున్న ఇషా సింగ్
ఎవరు: ఇషా సింగ్
ఎప్పుడు: మార్చ్ 03
మహిళల వన్డే వరల్డ్ కప్-2022కు ఆథిత్యం ఇవ్వనున్న న్యూజిలాండ్ దేశం :
మహిళల వన్డే వరల్డ్ కప్-2022కు గాను న్యూజిలాండ్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు 6 వేదికలలలో టోర్నీ (మొత్తం 31 మ్యాచ్లు) నిర్వహిస్తారు. ఏప్రిల్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.ఈ టోర్నీలో 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ అర్హత సాధించగా, ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాలకు అవకాశం దక్కింది. మహిళల వన్డే వరల్డ్ కప్-2022లో పాల్గొనే భారత మహిళల జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల వన్డే వరల్డ్ కప్-2022కు ఆథిత్యం ఇవ్వనున్న న్యూజిలాండ్ దేశం
ఎవరు: న్యూజిలాండ్ దేశం
ఎక్కడ: న్యూజిలాండ్ దేశం
ఎప్పుడు: మార్చ్ 03
2022 పారాలింపిక్స్ లో రష్యా, బెలారస్ నిషేధం విధించిన పారలింపిక్ కమిటీ :
2022 పారాలింపిక్స్ లో రష్యా మరియు బెలారస్ దేశాలకు చెందిన అథ్లెట్లపై అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. ఇటీవల ఉక్రెయిన్ దేశం పైన జరుపుతున్న రష్యా దాడికి దిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులకు సంబంధించిన క్రీడల్లో ఆ రెండు దేశాల ఐన రష్యా నుంచి 71 మంది, బెలారస్ దేశం నుంచి 12 మంది అథ్లెట్లను ఆడనివ్వబోమని పారాలింపిక్ కమిటీ వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2022 పారాలింపిక్స్ లో రష్యా, బెలారస్ నిషేధం విధించిన పారలింపిక్ కమిటీ
ఎవరు: పారలింపిక్ కమిటీ
ఎప్పుడు: మార్చ్ 03
ఎల్.ఐ.సి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్&సియివో గా టి.ఎస్. రామకృష్ణన్ నియామకం :
ఎల్.ఐ.సి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా టిఎస్ రామకృష్ణన్ ను నియమించినట్లు ప్రకటించింది. దినేష్ పాంగే తర్వాత వచ్చిన రామకృష్ణన్, LIC, దాని అనుబంధ సంస్థలు మరియు అనుబంధ కంపెనీలలో 34 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అతను సౌత్ సెంట్రల్ జోన్ (హైదరాబాద్)లో రీజినల్ మేనేజర్ పెన్షన్ గ్రూప్ మరియు స్కీమ్ మరియు ఢిల్లీ లోసీనియర్ డివిజన్ మేనేజర్ ఇన్ చార్జ్ తో సహా పలు స్థానాల్లో పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎల్.ఐ.సి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్&సియివో గా టి.ఎస్. రామకృష్ణన్ నియామకం
ఎవరు: టి.ఎస్. రామకృష్ణన్
ఎప్పుడు: మార్చ్ 03
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం గా మార్చ్ 03 :
ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వన్యప్రాణులను వేటాడడం తీవ్ర నేరం అనే నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1973లో అంతరించిపోతున్న జాతుల వైల్డ్ ఫోనా అండ్ ఫ్లోరా (CITES) లో అంతర్జాతీయ వాణిజ్యంపై ఒప్పందంపైన మార్చి 3న సంతకం చేశారు. అందువల్ల, డిసెంబర్ 20, 2013న 68వ ఐక్యరాజ్యసమితి నర్వసభ్య సమావేశం (UNGA),నిర్వహించారు. వన్యప్రాణుల దినోత్సవం అనే ఆలోచనను థాయిలాండ్ దేశం ప్రతిపాదించింది. CITES కాంట్రాక్ట్ హోదాలో భారత దేశం కూడా సంతకం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం గా మార్చ్ 03
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: మార్చ్ 03
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |