
Daily Current Affairs in Telugu 02-03-2022
భారత పరిశ్రమల సమాఖ్య చైర్మన్ గా వాగిన్ దీక్షిత్ ఎన్నిక :

2022-23 సంవత్సరానికి గాను భారత పరిశ్రమల సమాఖ్య చైర్మన్ గా వాగిన్ దీక్షిత్ ఎన్నికయ్యారు. అల్పా వరల్డ్ వైడ్ చీఫ్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ గాను, భారత్‌లోని అల్ఫా గ్రూపు మేనే జింగ్ డైరెక్టర్‌గానూ దీక్షిత్ ఉన్నారు. 2021-22 లో ఈయన సీఐఐ తెలంగాణకు వైస్ చైర్మన్ గా వ్యవహరించారు. సీఎస్ఆర్ట్ ఎస్టేట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి. శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఈయన సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ గా వ్యవహరించారు. సీఎస్ఆర్ ఎస్టేట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి. శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఈయన సీఐఐ తెలంగాణ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్ర క్చర్ ప్యానెల్లో కన్వీనర్ గా కొనసాగారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత పరిశ్రమల సమాఖ్య చైర్మన్ గా వాగిన్ దీక్షిత్ ఎన్నిక
ఎవరు: వాగిన్ దీక్షిత్
ఎక్కడ డిల్లి :
ఎప్పుడు: మార్చ్ 02
మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సొంతం చేసుకున్న ప్రియాంక :

తెలుగు తేజం నూతక్కి ప్రియాంక ‘డబ్ల్యూజీఎం’ (మహిళా గ్రాండ్ మాస్టర్) టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం భువనేశ్వర్ ముగిసిన 47వ జాతీయ మహిళా చెస్ ఛాంపియన్ షిప్ లో విజయవాడకు చెందిన ప్రియాంక తొమ్మిది రౌండ్ల నుంచి ఏడు పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. డబ్ల్యూజీఎం మూడో నార్మ్ సొంతం చేసు కుంది. దీంతో ఆమెకు మహిళల గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారైంది. 2301 ఎలో రేటింగ్‌తో ఉన్న ప్రియాంక ఈ ఛాంపియన్షిప్ ద్వారా మరో 25 పాయింట్లు తన ఖాతాలో జమ చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సొంతం చేసుకున్న ప్రియాంక
ఎవరు: ప్రియాంక
ఎప్పుడు: మార్చ్ 02
స్ట్రీట్ అనిమల్స్ కోసం గాను చెన్నై లో అంబులెన్స్‌ను ప్రారంబించిన బ్లూక్రాస్ సంస్థ :

బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా, జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ ఫోర్ పా సహకారంతో తమిళనాడు రాజధాని ఐన చెన్నై లోని వీధి జంతువుల కోసం “మొదటి-రకం” అంబులెన్స్‌ను ప్రారంభించింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ అనిత ప్రారంభించారు. గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్నటువంటి వీధి జంతువులకు ఆన్-సైట్ చికిత్స అందించడానికి పశు వైద్యులతో కూడిన ఆసుపత్రి ఆన్ వీల్స్ అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ ఫోర్ పా వారి సహకారంతో చెన్నైలోని ప్రారంభించారు.
- తమిళనాడు రాష్ట్ర రాజధాని :చెన్నై
- తమిళనాడు రాష్ట్ర సిఎం : ఎన్.కే స్టాలిన్
- తమిళనాడు రాష్ట్ర గవర్నర్ : ఆర్.ఎన్ రవి
క్విక్ రివ్యు :
ఏమిటి: స్ట్రీట్ అనిమల్స్ కోసం గాను చెన్నై లో అంబులెన్స్‌ను ప్రారంబించిన బ్లూక్రాస్ సంస్థ
ఎవరు: బ్లూక్రాస్ సంస్థ
ఎప్పుడు: మార్చ్ 02
31వ ఆగ్నేయాసియా క్రీడల కు ఆతిత్యం ఇవ్వనున్న వియత్నాం దేశం :

31వ ఆగ్నేయాసియా క్రీడలకుగాను వియత్నాం దేశం అతిత్యం ఇవ్వనుంది. కాగా ఇది ఈ ప్రాంతంలో జరిగే అతిపెద్ద క్రీడా ఈవెంట్.ఈ సంవత్సరం 2022 మే 12 నుండి 23 వరకు వియత్నాం దేశంలో జరగనుంది. ఆటలలో 526 ఈవెంట్లతో 40 క్రీడలను కలిగి ఉంటాయి, దాదాపు 10,000 మంది పాల్గొనేవారిని ఆకర్షిస్తుంది. క్వాంగ్ నిన్, ఫు థో మరియు బాక్ నిన్లతో సహా 11 పొరుగు ప్రాంతాలతో పాటు వియత్నా౦ యొక్క రాజధాని ఐన హనోయి కూడా ప్రధాన వేదికగా ఉండనుంది.
- వియత్నాం దేశ రాజధాని :’హనోయ్
- వియత్నాం దేశ కరెన్సీ : వియత్నమీస్ డాంగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: 31వ ఆగ్నేయాసియా క్రీడల కు ఆతిత్యం ఇవ్వనున్న వియత్నాం దేశం
ఎవరు: వియత్నాం దేశం
ఎక్కడ: వియత్నాం దేశం
ఎప్పుడు: మార్చ్ 02
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |