Daily Current Affairs in Telugu 17&18-11-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఐసిసి క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నియామకం :
ఐసిసి క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నియమితుయ్యాడు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీని నియమించినట్లు ఐసీసీ ప్రకటించింది. మూడేళ్ల పదవీ కాలంతో కూడుకున్న ఈ పదవిని గరిష్టంగా మూడు దఫాలు చేపట్టవచ్చు. కుంబ్లే తొమ్మిదేళ్లు ఈ పదవిలో కొనసాగాడు. “ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా సమర్థ పరిపాలకుడిగా గంగూలీ అనుభవం క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గత తొమ్మిదేళ్లు క్రికెట్ కమిటీకి నాయకత్వం వహించిన అనిల్ కుంబ్లేకు కృతజ్ఞతలు. డీఆర్ఎస్ విధానం, అను మానాస్పద బౌలింగ్ యాక్షన్ పరిష్కారానికి పటిష్టమైన వ్యవస్థతో అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల్ని కుంబ్లే మెరుగుపరిచాడు” అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్లో పేర్కొన్నాడు. గానో ఉపయోగపడుతుంది. గత తొమ్మిదేళ్లు క్రికెట్ కమిటీకి నాయకత్వం వహించిన అనిల్ కుంబ్లేకు కృతజ్ఞతలు. డీఆర్ఎస్ విధానం, అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ పరిష్కారానికి పటిష్టమైన వ్యవస్థతో అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల్ని కుంబ్లే మెరుగుపరిచాడు” అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్లో పేర్కొన్నాడు.
- ఐసిసి క్రికెట్ బోర్డు స్థాపన :1909
- ఐసిసి బోర్డు చైర్మన్ : గ్రెగ్ బార్క్లే
- ఐసిసి బోర్డు ప్రదాన కార్యాలయం : దుబాయ్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిసి క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నియామకం
ఎవరు: సౌరబ్ గంగూలీ
ఎప్పుడు: నవంబర్ 17
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ట్రాయ్ కూలీ నియామకం :
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఆస్ట్రే లియా శిక్షకుడు ట్రాయ్ కూలీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ అత్యుత్తమ కోచ్ గా పేరున్న ట్రాయ్ భారత యువ పేసర్లను భవిష్యత్తుకు తగ్గట్లుగా తీర్చిదిద్దుతాడని బీసీసీఐ భావిస్తోంది. 2006 నుంచి 2010-11 సీజన్ వరకు ఆస్ట్రేలియా జట్టుకు ట్రాయ్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరించిన ట్రాయ్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (బ్రిస్బేన్)లో బౌలింగ్ కోచ్ గా ‘చేరాడు. ప్రస్తుత టీమిండియా పేసర్లు ఇషాం త్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ 30ల్లో ఉన్నారు. వీళ్లు మరో రెండేళ్లు మాత్రమే ‘ప్రభావవంతంగా ఆడగలరని బీసీసీఐ భావిస్తోంది. భవిష్యత్తు కోసం ఇప్పట్నుంచే పటిష్టమైన రిజర్వ్ బెంచ్ ను తయారు చేసుకోవాలని బోర్డు నిర్ణయించింది. జూనియర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి పది మంది అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసి ఎన్సీఏలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసమే ట్రాయ్ కూలీకి ఫాస్ట్ బౌలింగ్ అందుకోసమే ట్రాయ్ కూలీకి ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు అప్పగించనుంది. ఎన్సీఏ డైరెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ట్రాయ్ పనిచేయ నున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ట్రాయ్ కూలీ బాద్యతలు
ఎవరు: ట్రాయ్ కూలీ
ఎప్పుడు: నవంబర్ 17
భారతదేశపుమొదటి డిజిటల్ ఫుడ్ మ్యూజియం ను తమిళనాడు లో ప్రారంబించిన పియూష్ గోయల్ :
. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు తమిళనాడులో భారతదేశపు మొదటి డిజిటల్ ఫుడ్ మ్యూజియాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి, పీయూష్ గోయల్ తమిళనాడులోని తంజావూరులో భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ ఫుడ్ మ్యూజియాన్ని వాస్తవంగా ప్రారంభించారు. ఇది 1,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) మరియు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియంలు, బెంగళూరు (కర్ణాటక)తో కలిసి రూ. 1.1 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయబడింది. ఈ మ్యూజియం దానిలో మొదటిది- భారతదేశం యొక్క ఆహార వ్యవస్థ ను మొదటి నుండి భారతదేశంలో అతిపెద్ద ఆహారాన్ని ఎగుమతి చేసే దేశంగా చిత్రీకరించడానికి మంచి ప్రయత్నం. ఈ మ్యూజియం సంచార వేటగాళ్ల నుండి స్థిరపడిన వ్యవసాయ ఉత్పత్తిదారులుగా భారతీయ ఆహార పరిణామాన్ని ప్రదర్శిస్తుంది. ప్రభుత్వ చర్యలు దేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ఎగుమతిదారుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాయి. ఈ మ్యూజియం ప్రజలు ఆహారాన్ని సేకరించే వారి నుండి ఉత్పత్తిదారుల వరకు చరిత్ర మొదటి పంట యొక్క కథ, గ్రామాల పెరుగుదల మరియు డిమాండ్ తయారీని ప్రదర్శిస్తుంది.
- తమిలనాడు రాష్ట్ర రాజధాని : చెన్నై
- తమిలనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి : ఎం.కే స్టాలిన్
- తమిళనాడు రాష్ట్ర గవర్నర్ : ఆర్.ఎన్ రవి
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశపుమొదటి డిజిటల్ ఫుడ్ మ్యూజియం ను తమిళనాడు లో ప్రారంబించిన పియూష్ గోయల్
ఎవరు: పియూష్ గోయల్
ఎక్కడ; తమిళనాడు
ఎప్పుడు: నవంబర్ 17
మహారాష్ట్ర కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్‌గా బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నియామకం :
కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్‌ను నియమించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మహారాష్ట్ర కోవిడ్-వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంబాసిడర్‌గా మారనున్నారు. మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే ప్రకారం, ముస్లిం మెజారిటీ కమ్యూనిటీల్లో యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లను స్వీకరించడంలో సంకోచం ఉంది. కావున ప్రభుత్వం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ యొక్క సహాయాన్ని తీసుకుంటుంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలను ఒప్పించేందుకు ఖాన్ వ్యాక్సిన్ షాట్‌ల సంఖ్య పరంగా మహారాష్ట్ర ముందంజలో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో టీకా వేగం తక్కువగా ఉంది.
- మహారాష్ట్ర రాజధాని : ముంబై
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి : ఉద్ధవ్ థాకరే
- మహారాష్ట్ర గవర్నర్ : భగత్ సింగ్ కోష్యరి
క్విక్ రివ్యు :
ఏమిటి: మహారాష్ట్ర కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్‌గా బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నియామకం
ఎవరు: సల్మాన్ ఖాన్
ఎక్కడ; మహారాష్ట్ర
ఎప్పుడు: నవంబర్ 17
మహిళల బిగ్ బాష్ సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియ ప్లేయర్ స్మృతి మందాన :
టీమిండియా బ్యాటర్ స్మృతి మందాన (114 నాటౌట్; 64 బంతుల్లో 14×4, 3×6) మహిళల బిగ్ బాష్ (డబ్ల్యూబీబీఎల్)లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ లీగ్ లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పిన స్మృతి మందాన. డబ్ల్యూబీబీఎల్ లో అత్యధిక వ్యక్తి గత స్కోరు (ఆష్లీ గార్డెనర్- ఆస్ట్రేలియా) ఘనతను సమంచేసింది. అయితే సిడ్నీ థండర్స్ ఓటడంతో మందాన పోరాటం వృథా అయింది. నవంబర్ 18న జరిగిన ఈ మ్యాచ్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 4 పరుగుల ఆధిక్యంతో సిడ్నీ థండర్ పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు సాధిం చింది. హర్మన్ ప్రీత్ కౌర్ (81 నాటౌట్; 55 బంతుల్లో 11×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ లో సత్తాచాటింది. అనంతరం సిడ్నీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేయగలిగింది. బ్యాటింగ్ లో సత్తాచాటిన హర్మన్ (1/27) బౌలింగ్లోనూ రాణించి మెల్బోర్న్ కు విజయంఅందించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల బిగ్ బాష్ సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియ ప్లేయర్ స్మృతి మందాన
ఎవరు: స్మృతి మందాన
ఎక్కడ; ఆస్ట్రేలియా
ఎప్పుడు: నవంబర్ 17
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్.కె.సిన్హా నియమకం :
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్.కె.సిన్హా గారు నియమితులయ్యారు. ఇప్పటివరకు చైర్మన్ గా ఉన్న ఎస్.కె. హల్దర్ కావేరీ నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ నెలాఖరు వరకే సర్వీసు ఉన్న హల్దర్ ను కావేరీ నదీ యాజ మాన్య బోర్డు చైర్మన్ గా నియమించడంతో అయి దేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. సిన్హా పదవీ కాలం కూడా డిసెంబరు ఆఖరుతో ముగియనుంది. పదవీ విరమణ చేసేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత జల సంఘంలో సీనియర్ గా ఉన్న వోహ్రా చైర్మన్ గా నియమితులయ్యే అవకాశం ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్.కె.సిన్హా నియమకం
ఎవరు: ఆర్.కె.సిన్హా
ఎప్పుడు: నవంబర్ 17
ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న వెన్నం జ్యోతి :
ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో తెలుగమ్మాయి వెన్నం. జ్యోతి సురేఖ సత్తాచాటింది. ప్రపంచ ఛాంపియన్షిప్ మూడు రజతాలతో జోరుమీదున్న సురేఖ ఆసియా టోర్నీ లోనూ అదరగొట్టింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణంతో మెరిసిన సురేఖ. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్ యాదవ్ తో కలిసి రజతం సొంతం చేసుకుంది. నవంబర్ 18న జరిగిన వ్యక్తిగత విభాగం సెమీస్ లో సురేఖ 148-143తో ప్రపంచ మాజీ ఛాంపియన్ కిమ్ యునీ (కొరియా)ను చిత్తుచేసింది. ఫైనల్లో సురేఖ 146-145 యూహ్యున్ (కొరియా)పై నెగ్గి స్వర్ణం చేజిక్కించుకుంది. “రెండు పాయింట్ల ఆధిక్యంతో చివరి సెట్ ప్రారంభించిన సురేఖ వరుసగా 10, 9, 9 పాయింట్లు స్కోరు చేసింది. వరుసగా 10, 10 పాయింట్లతో చెలరేగిన ప్రత్యర్థి మరో 10 సాధిస్తే మ్యాచ్ షూటాఫ్ కు వెళ్లేదే. అయితే యూహ్యున్ సంధించిన బాణం 9 రింగులో పడటంతో ఒక పాయింటు “తేడాతో సురేఖ విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న వెన్నం జ్యోతి
ఎవరు: వెన్నం జ్యోతి
ఎప్పుడు: నవంబర్ 18
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెకు దక్కిన జీవిత సాపల్య పురస్కారం :
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెకు ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఈ మేరకు అవార్డు కమిషన్ సిఫార్సుకు బీడబ్ల్యూ ఎఫ్ మండలి ఆమోదముద్ర వేసింది. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) పదుకొణె పేరును ఈ అవార్డుకు ప్రతిపాదించింది. మాజీ నంబర్ వన్ గా ప్రపంచ ఛాంపియన్షిప్ లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా ఎన్నో ఘనతలు అందుకున్న పదుకొణె బ్యాడ్మింటన్ కు విశేష సేవలు అందించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెకు దక్కిన జీవిత సాపల్య పురస్కారం
ఎవరు: ప్రకాశ్ పదుకొణె
ఎప్పుడు: నవంబర్ 18
డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ ను సొంతం చేసుకున్న టెన్నిస్ స్టార్ గాబ్రైన్ మురుగుజ :
స్పెయిన్ టెన్నిస్ స్టార్, మాజీ నంబర్వన్ గాబ్రైన్ ‘ముగురుజ డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ ను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ముగురుజ 6-3, 7-5తో అనెట్ కొంటావిట్ (ఇస్తోనియా)పై విజయం సాధించింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో మహిళల టైటిల్ గెలిచిన తొలి స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజనే కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ ను సొంతం చేసుకున్న టెన్నిస్ స్టార్ గాబ్రైన్ మురుగుజ :
ఎవరు: గాబ్రైన్ మురుగుజ
ఎప్పుడు: నవంబర్ 18
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |