Daily Current Affairs in Telugu 12-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ గా సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియమకం :
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ ఎంఐఎం పార్టీకి చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై వక్షాన అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు జనవరి 12న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని నిబంధన 184(1) ప్రకారం జరిగిన ఈ నియామకం, 182వ నిబంధన మేరకు మండలికి కొత్త చైర్మన్ ఎన్నికయ్యే వరకు అమల్లో ఉంటుంది. ప్రాటేమ్ చైర్మన్ జాఫ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
- తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి : :K చంద్రశేఖర్ రావు
- తెలంగాణా రాజధాని : హైదరాబాద్
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ గా సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియమకం
ఎవరు: అమీనుల్ హసన్ జాఫ్రీ
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు : జనవరి 12
బీడబ్ల్యూఎఫ్ అండర్-19 బాలికల సింగిల్స్ జాబితాలో అగ్రస్థానం లో నిలిచిన తస్నిమ్ మీర్ :
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో భారత ‘షట్లర్ తస్నిమ్ మీర్ (గుజరాత్) నంబర్వన్ గా నిలిచింది. జనవరి 12న బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన అండర్-19 బాలికల సింగిల్స్ జాబితాలో తస్నిమ్ నంబర్ వన్ ర్యాంకు సొంతం. చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 16 ఏళ్ల తస్నిమ్ రికార్డు సృష్టించింది. గత ఏడాది బీడబ్ల్యూఎస్ జూనియర్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్న సామియా ఇమాద్ ఫారూబీ (తెలంగాణ) నంబర్వన్ ర్యాంకు సాధించలేకపోయింది. 2021లో అండర్-19 విభాగ౦లో టాప్-10లో ఉన్న రస్నిమ్ ఆద్వితీయ ప్రదర్శ నతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బీడబ్ల్యూఎఫ్ అండర్-19 బాలికల సింగిల్స్ జాబితాలో అగ్రస్థానం లో నిలిచిన తస్నిమ్ మీర్
ఎవరు: తస్నిమ్ మీర్
ఎప్పుడు : జనవరి 12
ఇంటర్నేష నల్ మాస్టర్ టైటిల్ను కైవసం చేసుకున్న తెలుగుతేజం బొమ్మిన మౌనిక అక్షయ:
తెలుగు తేజం బొమ్మిన మౌనిక అక్షయ ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐఎం) టైటిల్ ను కైవసం చేసుకుంది. స్పెయిన్ లో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ చదరంగ టోర్నీలో అక్షయ తొమ్మిది రౌండ్ల నుంచి అయిదు పాయింట్లు సాధించింది. ఆ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే డబ్ల్యూఐఎం హోదాకు అవసరమైన మూడో నార్మ్ ను ఆమె సొంతం చేసుకుంది. 2019 జనవరిలో డిల్లీలో జరిగిన అంతర్జాతీయ గ్రౌండ్ మాస్టర్ టోర్నీలో తొలి నార్మ్ సొంతం చేసుకుంది. అక్షయ. 2021 సెప్టెంబరులో హంగేరీలో టోర్నీ సందర్భంగా రెండో నార్మ్ ను కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేష నల్ మాస్టర్ టైటిల్ ను కైవసం చేసుకున్న తెలుగుతేజం బొమ్మిన మౌనిక అక్షయ
ఎవరు: బొమ్మిన మౌనిక
ఎప్పుడు : జనవరి 12
కజకిస్తాన్ దేశ తదుపరి ప్రదనిగా నామినేట్ అయిన అలీఖాన్ స్మైలోవ్ :
కజకిస్తాన్ దేశ ప్రెసిడెంట్ కస్సిమ్ జోమార్ట్ టోకయేవ్ కజకిస్తాన్ యొక్క ప్రధాన మంత్రిగా 49 సంవత్సరాల అలీఖాన్ స్మైలోవ్ ను నామినేట్ చేసారు. స్టేట్ టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం చేసిన సెషన్ లో పార్లమెంట్ దిగువ సభ కూడా అతనికి అనుకూలంగా ఓటు వేసింది. కాగా అలీఖాన్ స్మెలోవ్ 2019లో రిపబ్లిక్ ఆఫ్ కజకిస్థాను మొదటి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 2019 లో, దేశంలో ప్రారంభమైన హింసాత్మక నిరసనల సందర్భంగా అధ్యక్షుడుకసిమ్-జోమార్ టోకయేవ్ చేత తొలగించబడిన మంత్రివర్గంలో అతను మొదటి సారి ఉపప్రదాన మంత్రి అయ్యారు.
- కజికిస్తాన్ దేశ రాజదాని :నూర్ సుల్తాన్
- కజికిస్తాన్ దేశ కరెన్సీ : కజకిస్తానీ తెంగే
క్విక్ రివ్యు :
ఏమిటి: కజకిస్తాన్ దేశ తదుపరి ప్రదనిగా నామినేట్ అయిన అలీఖాన్ స్మైలోవ్
ఎవరు: అలీఖాన్ స్మైలోవ్
ఎక్కడ: కజకిస్తాన్
ఎప్పుడు : జనవరి 12
ICHR నూతన చైర్మన్ గా రఘువేంద్ర తన్వర్ నియామకం :
కురుక్షేత్ర యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్,ప్రొఫెసర్ అయిన రఘువేంద్ర తన్వర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కౌన్సిల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తన్వర్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. ఆగస్ట్ 1977లో కురుక్షేత్ర యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరిన తన్వర్ ఆయన రెండు బంగారు పతకాలతో అత్యుత్తమ విద్యా రికార్డును కలిగి ఉన్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ యొక్క ప్రాథమిక లక్ష్యం చారిత్రక పరిశోధనలను ప్రోత్సహించడం మరియు దిశానిర్దేశం చేయడం మరియు శాస్త్రీయ రచనను ప్రోత్సహిస్తూ ఉండడం. ICHR కార్యకలాపాల అవుట్‌పుట్ ఏమనగా విద్యా ప్రమాణాలని పెంపొందించడం దాని ఎజెండాలో ప్రధాన లక్ష్యం.
- ICHR పూర్తి రూపం : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్
- ICHR స్థాపన :1972 మార్చ్ 27
- ICHR ప్రధాన కార్యాలయం :న్యుడిల్లి
క్విక్ రివ్యు :
ఏమిటి: ICHR నూతన చైర్మన్ గా రఘువేంద్ర తన్వర్ నియామకం
ఎవరు: రఘువేంద్ర తన్వర్
ఎప్పుడు : జనవరి 12
జాతీయ యువజన దినోత్సవంగా గా జనవరి 12 :
ప్రతి సంవత్సరం జనవరి 12 జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా జరుపుతారు. అతను 1863 జనవరి 12న జన్మించాడు. స్వామీ వివేకానంద యొక్క తత్వశాస్త్రం మరియు ఆయన జీవించిన మరియు పనిచేసిన ఆదర్శాలు భారతీయ యువతకు గొప్ప ప్రేరణగా ఉండగలవని ప్రభుత్వం దీనిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.1893 లో చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ భారతదేశం పేరును కీర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ యువజన దినోత్సవంగా గా జనవరి 12
ఎప్పుడు : జనవరి 12
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |