Daily Current Affairs in Telugu 06-05-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 06-05-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

నేషన్స్ చెస్ లో ఆరో స్థానానికి  చేరుకున్న భారత్ :

ఆన్ లైన్ ఫిడే నేషన్స్ కప్ చెస్ టోర్నిలో భారత్ వరుస పరాజయాలతో ఆఖరి స్థానానికి దిగజారింది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో రోజు పోటిల్లో భాగంగా బుధవారం జరిగిన నాలుగో రౌండ్లో భారత్ 1.5-2.5 తో చైనా చేతిలో ఓడింది. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి,హరికృష్ణలతో పాటు విశ్వనాథన్ ఆనంద్ తమ గేమ్ లను డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత  విదిత్(భారత్) పై వాంగ్ హో గెలిచి చైనాను ఆధిక్యంలో నిలిపాడు. చివరి రెండు రౌండ్లను యు యాంగితో హరికృష్ణ,హో ఇఫాన్ తో హంపి డ్రాగా ముగించడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అంతకుముందు మూడో రౌండ్లో భారత్ 1.5-2.5 తో యూరప్ చేతిలో ఓటమి పాలైంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : నేషన్స్ చెస్ లో ఆరో స్థానానికి  చేరుకున్న భారత్ :

ఎవరు: భారత్

ఎప్పుడు : మే06

ప్రపంచలోనే తొలి వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించిన  ఇటలీ కంపెనీ :

కరోనా కట్టడికి ప్రపంచంలోనే తోలివ్యాక్సిన్ ను అభివృద్ది చేసిన్నట్లు ఇటలీకి చెందిన బయోటెక్నాలజీ కంపెనీ ‘టకీస్’ ప్రకటించుకుంది. రోమ్ లోని లజారో స్పాలన్ జానీ నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇన్పెక్షియస్ డిసిజెస్ లో ఎలుకలపై జరిగిన ప్రయోగ పరిక్షల్లో సత్పలితాలు వచ్చినట్లు తెలిపింది. వ్యాక్సిన్ లోని యాంటిబాడీలు(ప్రతిరక్షకాలు) శరీర కణాలను చైతన్య పరిచి,కరోనా వైరస్ చొరబడకుండా అడ్డుకుంటాయని ఆ కంపెనీ సీఈవో ల్యూగి ఆగిసిచియో వెల్లడించారు. వేసవి కాలం తర్వాత మనుషులపై ప్రయోగ పరిక్షలు నిర్వహిస్తారని ఇటలీ వార్తా సంస్థ ‘ఏఎన్ఎస్ఏ’ తెలిపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచలోనే తొలి వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించిన  ఇటలీ కంపెనీ

ఎక్కడ: ఇటలీ

ఎప్పుడు : మే 06

పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్ గా కేకే  నియామకం :

పార్లమెంట్ పరిశ్రమల స్థాయి సంఘం(విభాగ సంబంధిత) సభ్యుడిగా ఎన్నికైన తెరాస ఎంపి కేశవరావు ఆ సంఘానికి చైర్మన్ గా నియమితులయ్యారు. కేశవరావును పార్లమెంటు పరిశ్రమల స్థాయి సంఘం(విభాగ సంబంధిత) చైర్మన్ గా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నామినేట్ చేశారని, మే 05 నుంచి ఆదేశాలు అమలులోకి వస్తాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ  మే 05 న బులెటిన్ విడుదల చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్ గా కేకే  నియామకం

ఎవరు: ఎంపి కేశవరావు

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు : మే 06

మాక్స్ బుపా కొత్త ఎండి &సియివో గా కృష్ణ రామచంద్రన్ నియామకం :

కృష్ణన్ రామ చంద్రన్ ను మాక్స్ బుపా హెల్త్ ఇన్సురెన్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి )మరియు చీఫ్ ఎగ్సిక్యుటి వ్ ఆఫీసర్ (సియివో )గా నియమించారు.దీనికి ముందు అతను అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సురెన్స్ యొక్క సియివో గా పని చేశాడు.ఆరోగ్య భీమా హెల్త్ కేర్ ,లైఫ్ సైన్సెస్ విభాగాల్ల్లో ఆయనకు 23 సంవత్సరాల అనుభవం ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : మాక్స్ బుపా కొత్త ఎండి &సియివో గా కృష్ణ రామచంద్రన్ నియామకం

ఎవరు: కృష్ణ రామచంద్రన్

ఎప్పుడు : మే06

రెండవ ప్రపంచ యుద్ద పథకం తో కిం జోంగ్ ను సత్కరించిన వ్లాదిమిర్ పుతిన్ :

రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తరకొరియా నాయకుడు కిం జాంగ్ ఉన్ ను నాజి జర్మని పై విజయం సాధించిన 75 వ వార్షికోత్సవం సందర్భంగా  రెండవ ప్రపంచ యుద్ధం స్మారక పథకం తో సత్కరించారు. ఉత్తరకొరియా భూభాగంలో మరణించిన సోవియెట్ సైనికుల స్మారక చిహ్నాలను  కాపాడుకోవడంలో అయన చేసిన పాత్రకు ఉత్తరకొరియా నాయకుడికి పథకం లబించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : రెండవ ప్రపంచ యుద్ద పథకం తో కిం జోంగ్ ఉన్ ను సత్కరించిన వ్లాదిమిర్ పుతిన్ :

ఎవరు: కిం జోంగ్ ఉన్

ఎప్పుడు : మే 06

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *