
Daily Current Affairs in Telugu 24-05-2020
డ్రగ్ రేగ్యులేటరి వ్యవస్థను సంస్కరించడానికి కమిటీని ఏర్పాటు చేసిన MoHFW:

ఔషద నియంత్రన వ్యవస్తను సంస్కరిచడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అయిన (MoHFW) ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ లో 11 మంది సభ్యులు ఉంటారు. వారిలో సీనియర్ ఆరోగ్య అధికారులు శాస్త్రవేత్తలు మరియు ఔషద పరిశ్రమల యొక్క ప్రతినిధులు ఉన్నారు.మరియు రాజేష్ భూషణ్ నేతృత్వంలో ఈ కమిటీ నియమించబడింది.ప్రస్తుతం డ్రగ్ ఔషద నియంత్రణ వ్యవస్థను పరిశీలించడం మరియు వ్యవస్థను మరింత సమర్థవంతగా తీసుకు రావడానికి మరియు ప్రపంచ ప్రమాణాలతో క్రమబద్దికరించడానికి సంస్కరణల కోసం సిపార్సులు ఇవ్వడం ఈ కమిటీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం .
క్విక్ రివ్యు :
ఏమిటి: డ్రగ్ రేగ్యులేటరి వ్యవస్థను సంస్కరించడానికి కమిటీని ఏర్పాటు చేసిన MoHFW
ఎవరు: MoHFW
ఎప్పుడు: మే 24
ఎఫ్.ఎల్.ఓ జాతీయ అద్యక్షుడిగా నియమితులయిన జహ్నాబి పూకాన్ :

ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ అయిన (ఎఫ్.ఎల్.ఓ) తన జాతీయ అద్యక్షుడిగా అస్సాం కు చెందిన పారిశ్రామిక వేత్త అయిన జహ్నంబి పుకాన్ ను నియమించింది. లోక్ సభ స్పీకర్ అయిన ఓం బిర్లా సమక్షంలో 36 వ ఎఫ్.ఎల్.వో వార్షిక సమవేశంలో అవుట్ గోయింగ్ జాతీయ అద్యక్షుడు హర్జిందర్ కౌర్ తల్వార్ నుంచి పుకాన్ బాద్యతలు స్వీకరించారని ఫిక్కి ప్రకటించింది.ఈమె 37వ జాతీయ అధ్యక్షురాలిగా వ్యవస్థాపకత సామర్థ్యాలు మరియు వృత్తి పరమైన నైపుణ్యం కలిగిన మహిళలను సాధికారత సాధించడానికి ఆమె కృషి చేస్తుంది. FICCI FLO మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎఫ్.ఎల్.ఓ జాతీయ అద్యక్షుడిగా నియమితులయిన జహ్నాబి పూకాన్
ఎవరు: జహ్నాబి పూకాన్
ఎప్పుడు: మే 24
పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్ ఉమర్ కు సోకిన కరోనా వైరస్ :

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ అయిన తౌఫిక్ ఉమర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు.మే 24 న కాస్త అస్వస్థత గా ఉండడంతో ఉమర్ కోవిద్ -19 పరీక్ష చేయించుకున్నాడు. పరీక్ష లో పాజిటివ్ పలితం వచ్చిందని అయతే తనలో కరోన లక్షణాలు తీవ్రంగా ఏమి లేవని ఇంట్లో ఉంది చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు.ఈ 38 ఏళ్ల ఉమర్ పాకిస్తాన్ తరపున 44 టెస్టులు ఆది 29,63 పరుగులు 12 వన్డేలు ఆది 504 పరుగులు సాదించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్ ఉమర్ కు సోకిన కరోనా వైరస్
ఎవరు: తౌఫిక్ ఉమర్
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: మే 24
యు.ఎస్ లేజర్ ఆయుధ ప్రయోగం విజయవంతం :

గాలిలోనే యుద్ద విమానాన్ని ద్వంసం చేసే అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని అమెరికా అబివృద్ధి చేసింది.యుద్ద నౌక నుంచి హై ఎనర్జీ క్లాస్ సాలిడ్ స్టేట్ లేజర్ ఫాస్ట్ ఫేజ్ పరీక్షలు మే 16 తేదిన విజయవంతంగా నిర్వహించింది అని యు.ఎస్ నోకాదళం మే 22 న ప్రకటించింది. గాలిలో ఎగురుతున్న డ్రోన్ విమానాన్ని కూల్చిన పొటోలు విడియో విడుదలను కూడా చేసింది.అయితే లేజర్ ఆయుధ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.లేజర్ వెపన్స్ సిస్టం డిమోనిస్త్రెటార్ లో బాగంగా తాజాగా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. యు.ఎస్ ప్రయోగించిన ఆయుధం 150 కిలో వాట్లు లేజర్ అని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఆయుధం కనిపించకుండానే లక్ష్యాన్ని విజయవంతంగా నాశనం చేయగల సామర్థ్యాన్ని అమెరికా సమకూర్చుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యు.ఎస్ లేజర్ ఆయుధ ప్రయోగం విజయవంతం
ఎవరు: యు.ఎస్
ఎప్పుడు: మే 24
అత్యధిక ఆర్జన కలిగిన క్రీడాకారిణిగా నిలిచిన టెన్నిస్ ప్లేయర్ ఒసాకా :

ఇటీవల ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్ కు చెందిన టెన్నిస్ ప్లేయర్ ప్రపంచ మాజీ నంబర్ వన్ అయిన నయోమి ఒసాకా గుర్తిపు పొందింది. ఫోర్బ్స్ పత్రిక మే 23 న వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్ మని ఎండార్స్ మెంట్స్ ద్వారా మొత్తం 3 కోట్ల 74 డాలర్ల ను(284 కోట్లు) సంపాదించింది. గత నాలుగేళ్ళుగా టాప్ ర్యాంక్ లో నిలిచిన అమెరికా టెన్నిస్ దిగ్గజం విలియమ్స్ 3కోట్ల 60లక్షల డాలర్ల (273కొట్లు ) సంపాదనతో రెండో స్థానానికి పడిపోయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అత్యధిక ఆర్జన కలిగిన క్రీడాకారిణిగా నిలిచిన టెన్నిస్ ప్లేయర్ ఒసాకా
ఎవరు: టెన్నిస్ ప్లేయర్ ఒసాకా
ఎక్కడ: జపాన్
ఎప్పుడు: మే 24
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |