Daily Current Affairs in Telugu 08-04-2020

Manaviyda daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 08-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

కరోనా పై పోరుకు ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్స్ భారీ విరాళం:

కరోనా వ్యాప్తి ని నిరోధించడానికి తీసుకునే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు ట్విటర్ సహవ్యవస్థాపకుడు  ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సిఈవో) జాక్ డోర్స్ రూ.7600కోట్ల రూపాయలు (1బిలియన్ డాలర్ల) భారీ విరాళంను  ప్రకటించారు. ఈ మేరకు తన డిజిటల్ చెల్లింపుల గ్రూప్ స్క్వేర్ లోనుంచి ఈక్విటీ  వాటాలను తన సేవా సంస్థ స్టార్ట్ స్మాల్ కు మల్లించనున్నట్లు వెల్లడించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కరోనా పై పోరుకు ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్స్ భారీ విరాళం

ఎవరు: జాక్ డోర్స్

ఎప్పడు: ఏప్రిల్ 08

2020 విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా బెన్ స్తోక్స్ ఎంపిక :

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్తోక్స్ 2020 విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. 2019 లో  అత్యుత్తమ  ప్రదర్శనకు  గాను బెన్ స్తోక్స్ కు ఈ అవార్డు లబించింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్ పెర్రి కి ఈ అవార్డు దక్కింది. 28 ఏళ్ల స్తోక్స్ నిరుడు ప్రపంచ కప్ ఫైనల్లో “మ్యాన్ ఆఫ్ ధ మ్యాచ్” గా  నిలిచి ఇంగ్లాండ్  వరల్డ్ కప్ కల నెరవేర్చాడు. 2019 లో స్తోక్స్ టెస్టుల్లో 821 పరుగులు ,వన్డే లో 719 పరుగులు సాధించాడు. 2005 లో అండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత  ఈ అవార్డును ఎంపికైన ఇంగ్లాండ్ ఆటగాడు ఇతడే. గత మూడేళ్ళుగా ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నే ఈ అవార్డు గెలుస్తూ వచ్చాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : 2020 విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా స్తోక్స్ ఎంపిక

ఎవరు: బెన్ స్తోక్స్

ఎక్కడ: ఇంగ్లాండ్

ఎప్పడు: ఏప్రిల్ 08

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

దేశంలోనే మూడవ అత్యంత విలువైన సంస్థ గా హెచ్యుఎల్ అవతరణ:

ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసిజి) దిగ్గ్గజం అయిన హిందుస్థాన్ యునిలివర్ కంపెని ఏప్రిల్ 07 న దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థ గా అవతరించింది. హిందుస్థాన్ యునిలివర్ మార్కెట్ క్యాపిటలైజేషణ్  లేదా మార్కెట్ విలువ మొదటి సారి రూ .5లక్షల కోట్లను అధిగమించింది.  దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా కన్సల్తేన్సి సర్వీసెస్ (టిసిఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెని గా హెచ్.యు.ఎల్ అవతరించింది. గ్లాస్కో స్మిత్ క్లైన్ (జిఎస్కె) పిఎల్సీకి చెందిన ఆసియా హెల్త్ ఫుడ్ డ్రింక్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు హెచ్యుఎల్ ప్రకటించింది. దీంతో భారత దేశంలో అతి పెద్ద ఆహార సంస్థ గా అవతరించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : దేశంలోనే మూడవ అత్యంత విలువైన సంస్థ గా హెచ్యు ఎల్  అవతరణ

ఎప్పడు: ఏప్రిల్ 08

కోవిద్ -19 వైరస్ వ్యాప్తి నేపద్యంలో జపాన్ అత్యవసర పరిస్థితి విధింపు :

ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కోవిద్ -19 (కరోనా  వైరస్) తీవ్రత  పెరుగుతున్న నేపద్యంలో  జపాన్ లో అత్యవసర పరిస్థతి ని ప్రకటించారు. నెల రోజుల పాటు ఎమర్జెన్సి విధిస్తున్నట్లు జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే  ఏప్రిల్ 07 న ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి కి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై  రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఇచ్చామని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత నేపద్యంలో ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర  పరిస్థితుల్లో కరోనా పై పోరుకు 993 బిలియన్ డాలర్ల విలువైన ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజి కి ఆమోదం తెలిపినట్లు వివరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కోవిద్ -19 వైరస్ వ్యాప్తి నేపద్యంలో జపాన్ అత్యవసర పరిస్థితి విధింపు

ఎవరు: జపాన్

ఎక్కడ: జపాన్ దేశం

ఎప్పడు: ఏప్రిల్ 08

ఎంఎస్ఎంఇ లకు ఎమర్జెన్సి పని మూలధనాన్ని అందించనున్న సిడ్బి:

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) మైక్రో ,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్  (ఎంఎస్ఎంఈ) లకు అత్యవసరంగా  పని చేసే మూలధనంతో సిడ్బి యొక్క కొత్త రుణ ఉత్పత్తి ,అనగా కరోనా వైరస్ (SAFE) కు వ్యతిరేకంగా అత్యవసర ప్రతిస్పందన ను సులబతరం  చేయడానికి SIDBI సహాయం ప్లస్ అనుశంగికంగా  ఉచితంగా ఇవ్వబడుతుంది. మరియు 48 గంటల్లో 5% వడ్డి రేటుతో పంపిణి  చేయబడుతుంది. మైక్రో  స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ కోసం సిడ్బి మెక్ ఇన్ ఇండియా సాఫ్ట్ లోన్ ఫండ్ అనే ప్రధాన పథకం కింద ఆరోగ్య సంరక్షణ  రంగానికి సెబీ అదనపు ఆర్ధిక విడో ను తెరిచింది.

 క్విక్ రివ్యు :

ఏమిటి : ఎంఎస్ ఎం ఇ లకు ఎమర్జెన్సి పని మూలధనాన్ని అందించనున్న సిడ్బి

ఎవరు:SIDBI

ఎప్పడు: ఏప్రిల్ 08

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *