Daily Current Affairs in Telugu 04&05-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
దేశంలోనే వంద శాతం వ్యాక్సినేషన్ సాధించిన రాష్ట్ర నిలిచిన హిమాచల్ ప్రదేశ్ :
అర్హులైన ప్రజలందరికీ (100%) కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్ర దేశ్ ఘనత సాధించింది. ఈమేరకు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ పూర్తిస్థాయిలో టీకాలు వేసినట్లు సంబంధిత అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. మొత్తంగా అర్హులైన ప్రజలు 53,86,393 మందికీ రెండో డోసు వేసినట్లు తెలిపారు. ఆగస్టు ఆఖరు సరికే వీరందరికీ మొదటి డోసు వేశామని అప్పట్లో ప్రజలందరికీ తొలిడోసు వేసిన రాష్ట్రంగా కూడా ‘గుర్తింపు పొందినట్లు వివరించారు.
- హిమచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని :వేసవి సిమ్లా ,శీతాకాలం లో ధర్మ శాల
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి :జైరాం టాకూర్
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే వంద శాతం వ్యాక్సినేషన్ సాధించిన రాష్ట్ర నిలిచిన హిమాచల్ ప్రదేశ్ :
ఎవరు: హిమాచల్ ప్రదేశ్
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 4
తొలి సిప్రియన్ పోయస్ బహుమతికి ఎంపికయిన నిఖిల్ శ్రీవాస్తవ :
ప్రముఖ భారతీయ అమెరికన్ గణిత శాస్త్ర వేత్త నిఖిల్ శ్రీవాస్తవ మరో ఇద్దరితో కలిసి అమెరికా గణిత సంఘం (ఏఎంఎస్) తొలి సిప్రియన్ పోయస్ బహుమతికి ఎంపికయ్యారు. ఆపరేటర్ థియరీలో కృషికి సంబంధించి ఆయనకు ఈ గౌరవం దక్కింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీలో బోధిస్తున్న శ్రీవాస్తవ ఆడం మార్కస్ డానియల్ స్పీల్మెన్లతో కలిసి పురస్కారాన్ని అందుకుంటారు. అవార్డులో బాగంగా వీరికి రూ.3.76 లక్షలు (5,000 డాలర్లు) లభించనున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి సిప్రియన్ పోయస్ బహుమతికి ఎంపికయిన నిఖిల్ శ్రీవాస్తవ
ఎవరు: నిఖిల్ శ్రీవాస్తవ
ఎప్పుడు: డిసెంబర్ 05
ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టి రికార్డ్ సృష్టించిన న్యూజిల్యాండ్ స్పిన్నర్ :
న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ‘స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు పడగొట్టాడు. ముంబయిలో జరుగుతున్న రెండో టెస్టు భారత్ తొలి ఇన్నింగ్స్ లో అతను ఈ ఘనత సాధించాడు. 1956లో ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (ఆస్ట్రేలియాపై), 1999లో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే (పాకిస్థాన్ప). మాత్రమే ఇప్పటిదాకా ఈ రికార్డును అందుకున్నారు.
- న్యూజిల్యాండ్ దేశ రాజదాని : వెల్లింగ్టన్
- న్యూజిల్యాండ్ దేశ ప్రదాని : జేసిండ అర్డెం
- న్యూజిల్యాండ్ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ :కెన్ విలియం సన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టి రికార్డ్ సృష్టించిన న్యూజిల్యాండ్ బౌలర్
ఎవరు: న్యూజిల్యాండ్ అజాజ్ పటేల్
ఎక్కడ:
ఎప్పుడు: డిసెంబర్ 05
‘ట్రాఫిక్ ఛాంప్‘ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంబించిన గుజరాత్ ప్రభుత్వం :
ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన పెంచేందుకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ‘ట్రాఫిక్ ఛాంప్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గుజరాత్ సర్కార్. ఈ కార్యక్రమంలో భాగంగా. వడోదరాలో ట్రాఫిక్ రూల్స్ ను పాటించినవారికి రూ.100 పెట్రోల్ ఉచితంగా అందిస్తోంది. ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను విధిగా పాటించిన వారిలో రోజూ 50 మందిని ఎంపిక చేసి వారికి ఉచితంగా పెట్రోల్, డీజిల్ కూపన్స్ అందిస్తున్నట్లు రెస్టారెంట్ కూపన్స్ సైతం అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర హోంమంత్రి హర్షా సంఘ్వీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగుతుందన్నారు.
- గుజరాత్ రాష్ట్ర రాజదాని :గాంధీనగర్
- గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి :భూపేంద్ర భాయ్ పటేల్
- గుజరాత్ రాష్ట్ర గవర్నర్ : ఆచార్య దేవ్ వ్రథ్
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘ట్రాఫిక్ ఛాంప్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంబించిన గుజరాత్ ప్రభుత్వం
ఎవరు: గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు: డిసెంబర్ 05
మూడోసారి డేవిస్ కప్ టైటిల్ ను గెలుచుకున్న రష్యా దేశం :
రష్యా డేవిస్ కప్ ను సాధించింది. 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ముచ్చటగా మూడోసారి డేవిస్ కప్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రీడల్లో తమ దేశంపై డోపింగ్ నిషేధం కొనసాగుతుండడంతో రష్యా టెన్నిస్ సమాఖ్య (ఆర్టీఎస్) పేరుతో ఈ టోర్నీలో పోటీపడ్డ ఆ జట్టు ఫైనల్లో 2-0 తేడాతో క్రొయేషియాను ఓడించింది. తొలి సింగిల్స్ రుబ్లివ్ 6-4, 7-6 (7-5) తో బోర్నా గోటోపై గెలిచి ఆర్టిస్ కు శుభారంభాన్ని అందించాడు. ఇక రెండో సింగిల్స్ జోరు మీదున్న మెడ్వెరెడ్ 7-6 (1-7), 6-2తో సిలిచ్న ను ఓడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రెండు సింగిల్స్ మ్యాచ్లను రష్యానే గెలవడంతో డబుల్స్ పోరు అవసరం లేకుండా పోయింది. డేవిస్ కప్ లో వరుస సెట్లలో గెలవడం మెద్వె దేవ్ కిది అయిదో సారి తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి అతనికి గట్టి పోటీ ఎదురైంది. సిలిచ్ పోరాడటంతో మ్యాచ్ పోటాపోటీగా సాగింది. కానీ టైబ్రేకర్లో మెద్వెదేవ్ కో విజయం దక్కింది. ఇక రెండో సెట్లో అతను పూర్తిగా చెలరేగి ప్రత్యర్థిని చిత్తుచేశాడు. 2006 తర్వాత రష్యాకిదే తొలి డేవిస్ కప్ టైటిల్. ఆ | జట్టు 2002 లోనూ విజేతగా నిలిచింది.
- రష్యా దేశ రాజదాని :మాస్కో
- రష్యా దేశ కరెన్సీ :రష్యా రూబెల్
- రష్యా దేశ అద్యక్ష్దుడు :వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: మూడోసారి డేవిస్ కప్ టైటిల్ ను రష్యా దేశం గెలుచుకున్న రష్యా దేశం
ఎవరు: రష్యా దేశం
ఎప్పుడు: డిసెంబర్ 05
నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీచైర్మన్ గా ప్రదీప్ షా నియామకం :
ఇండియాసియా ఫండ్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు ప్రదీప్ షా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (NARCL) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఆదిత్య బిర్లా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జైన్ ప్రైవేట్ యాజమాన్యంలోని అసెట్ మేనేజ్మెంట్ అయిన ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ ( IDRCL) యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉంటారు NARCL యొక్క విధి ఈ ఆస్తులను నిర్దేశించిన ప్రక్రియలకు అనుగుణంగా రుణదాతల నుండి సరసమైన విలువతో పొందడం అయితే IDRCL పాత్ర వారి ఆస్తుల యొక్క న్యాయమైన రిజల్యూషన్ ను అందించడం దీని యూక కర్తవ్యం.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీచైర్మన్ గా ప్రదీప్ షా నియామకం
ఎవరు: ప్రదీప్ షా
ఎప్పుడు: డిసెంబర్ 05
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడుకు గవర్నర్ గా పనిచేసిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, మాటల మాంత్రికుడు, చతురుడు కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. డిసెంబర్ 4 న బీపీ పల్స్ తగ్గి ఉదయం ఆయన పడిపోగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారా హిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిస్త్స పొందుతూ కన్నుమూసారు. గుంటూరు వంటి రాజకీయ చైతన్యంగల జిల్లా “నుంచి విద్యార్ధి నాయకుడిగా, ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ ఓనమాలు దిద్దుకుని అంచెలం అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమం త్రిగా, గవర్నర్ పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీలో ఈతరం నాయకులంతా ‘పెద్దాయన’గా పిలుచుకునే కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంని 1964లో వేమూరులో పంచాయతీ వార్డు సభ్యునిగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం దశాబ్దాల పాటు అప్రతిహతంగా కొనసాగింది. నవ యువకుడిగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న దశలో ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండటం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత
ఎవరు: రోశయ్య
ఎప్పుడు: డిసెంబర్ 04
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |