
Daily Current Affairs in Telugu 06-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
జూనియర్ హాకీ ప్రపంచకప్ విజేతగా నిలిచిన అర్జెంటిన దేశం :

అర్జెంటీనా అదరగొట్టింది స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జూనియర్ హాకీ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఇటీవల జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్ ఆరుసార్లు ఛాంపియన్ జర్మనీకి షాకిచ్చింది.. డొమెన్ 10, 25, 50వ నిమిషాల్లో గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫ్రాంకో (60వ) ఒక గోల్ కొట్టాడు. జర్మనీ తరపున జూలియస్ (36వ), మాస్ (47వ) స్కోరు చేశారు. 2005 తర్వాత ఈ టోర్నీలో టైటిల్ గెలవడం అర్జెంటీనాకు ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: జూనియర్ హాకీ ప్రపంచకప్ విజేతగా నిలిచిన అర్జెంటిన దేశం
ఎవరు: అర్జెంటిన దేశం
ఎప్పుడు: డిసెంబర్ 06
ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ విభాగానికి దక్కిన రెండు జాతీయ పురస్కారాలు :

సైబర్ భద్రతకు సంబంధించి అత్యుత్తమ ఆచరణ (టెస్ట్ ప్రాక్టీసెస్) అమలుకుగాను ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగానికి రెండు జాతీయ పురస్కారాలు వరించాయి. సీఐడీ విభాగాధిపతి, అదనపు డీజీపీ ఏవీ సునీలకుమార్ కు నేరాల విభాగం లో ఈ విభాగంలో జీవన సాఫల్య పురస్కారం ఎస్సీ జీఆర్ రాధికకు “సైబర్ స్టార్ పురస్కారం దక్కింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటి లిజెన్స్ అండ్ డిజిటల్ పోరెన్సీ (సీఆర్సీఐడీఎఫ్), సమాచార భద్రత విద్య అవగాహన (ఐఎస్ఈఏ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నైబర్ భద్రతపై జరిగిన మూడో జాతీయ సదస్సులో ఈ పురస్కారాల్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో పీవీ సునీల్ కుమార్, జీఆర్ రాధిక వర్చువల్గా ఆవార్డులు స్వీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ విభాగానికి దక్కిన రెండు జాతీయ పురస్కారాలు :
ఎవరు: ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ విభాగం
ఎక్కడ: ఆంధ్ర ప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 6
మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివరి21 టైటిల్ ను గెలుచుకున్న శ్రుతి సితార :

కేరళలో ఉంటున్న శ్రుతి సితార ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్సిటి 2021 టైటిల్ ను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో స్ఫూర్తిని, విశ్వాసాన్ని నింపడానికి లండన్ వేదికగా ప్రతి యేటా మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివవర్స్ పోటీలు జరుపుతారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఆన్ లైన్ వేదికగా ఈ నెల మొదట్లో ఈ పోటీలు జరిపారు. ప్రపంచం నలుమూలల నుండి పాల్గొన్న డ్రస్స్ ఉమెన్ లో శ్రుతి సితార మొదటి ప్లేస్ లో నిలిచి ఈ కిరీటాన్ని దక్కించుకుంది. మొదటి ఇద్దరు రన్నరప్ గా నిలిచినవారిలో వరుసగా ఫిలిప్పీన్స్, కెనడాకు చెందివారున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్సిటి 20 21 టైటిల్ ను గెలుచుకున్న శ్రుతి సితార
ఎవరు: శ్రుతి సితార
ఎప్పుడు: డిసెంబర్ 06
విలియం హిల్ స్పోర్ట్స్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న “వై వి క్నీల్, హౌ వి రైస్” పుస్తకం :

వెస్టిండీస్ బౌలింగ్ గ్రేట్ మైఖేల్ హోల్డింగ్ రాసిన “వై వి క్నీల్, హౌ వి రైస్” పుస్తకం విలియం హిల్ స్పోర్ట్స్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ పుస్తకం క్రీడలో జాత్యహంకారాన్ని సంబధించిన అంశం ను కవర్ చేస్తుంది. ఈ సమస్య యొక్క మూల కారణాలను పరిశీలిస్తుంది. సమాజాలు మరియు ప్రపంచానికి దాని వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తుంది. హోల్డింగ్స్ బుక్ విలియం హిల్ స్పోర్ట్స్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆరవ క్రికెట్ సంబంధిత పుస్తకం. ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలంగా స్థాపించబడిన మరియు అత్యంత సంపన్నమైన క్రీడా సాహిత్య బహుమతిగా పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: విలియం హిల్ స్పోర్ట్స్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న “వై వి క్నీల్, హౌ వి రైస్” పుస్తకం
ఎవరు: మైఖేల్ హోల్డింగ్
ఎప్పుడు: డిసెంబర్ 06
ఇంటర్ నేషనల్ కోపరేషన్ అలయన్స్ నూతన అద్యక్షుడిగా చంద్రపాల్ సింగ్ యాదవ్ ఎన్నిక :

అంతర్జాతీయ సహకార కూటమి ఆసియా దేశ పసిఫిక్ కొత్త అద్యక్షుడిగా డాక్టర్ చంద్ర పాల్ సింగ్ యాదవ్ ఎన్నికయ్యారు.యాదవ్ ప్రస్తుతం క్రిషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (KRIBHCO) ఛైర్మన్ గా ఉన్నారు. సియోల్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. చరిత్రలో తొలిసారిగా ఒక భారతీయుడు అధ్యక్షుడయ్యాడు. ఈ ఎన్నికల్లో యాదవ్ కు 185 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి జపానకు చెందిన చిటోస్ అరాయు 83 ఓట్లు మాత్రమే వచ్చాయి. వందకు పైగా ఓట్ల తేడాతో భారత్ విజయం సాధించడం అంతర్జాతీయ సహకార రాజకీయాలలో పెద్ద విషయం. ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ అలయన్స్ (ICA) అనేది ప్రపంచ స్థాయి సహకార సమాఖ్య. ఇది ప్రపంచవ్యాప్త సహకార ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలను ఏకం చేయ్యడానికి ఇది 1895లో స్థాపించబడింది. ప్రస్తుతం 112 దేశాల నుండి మొత్తం 318 సహకార సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. దీని ద్వారా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్ నేషనల్ కోపరేషన్ అలయన్స్ నూతన అద్యక్షుడిగా చంద్రపాల్ సింగ్ యాదవ్ ఎన్నిక
ఎవరు: చంద్రపాల్ సింగ్ యాదవ్
ఎప్పుడు: డిసెంబర్ 06
నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా చైర్ పర్సన్ గా అల్కా ఉపాధ్యాయ నియామకం :

సీనియర్ బ్యూరోక్రాట్ అల్కా ఉపాధ్యాయ 4 డిసెంబర్ 2021న నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా (NHAI) చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఉపాధ్యాయ మధ్యప్రదేశ్ కేడరకు చెందిన 1990-బ్యాచ్ IAS అధికారి. ప్రస్తుతం ఆమె గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అలాగే, సంజయ్ బందోపాధ్యాయ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా నియమితులయ్యారు
. క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా చైర్పర్సన్ గా అల్కా ఉపాధ్యాయ నియామకం :
ఎవరు: అల్కా ఉపాధ్యాయ
ఎప్పుడు: డిసెంబర్ 06
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |