Daily Current Affairs in Telugu 01&02-04-2022
తుర్క్మెనిస్థాన్ దేశంతో నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ :
మధ్య ఆసియా దేశమైన తుర్క్మెనిస్థాన్ ఆర్ధిక, విపత్తు నిర్వహణ. తదితర రంగాల్లో భారత్ నాలుగు ఒప్పందాలు కుదుర్చుకుంది. మూడు రోజుల పర్యటనకు తుర్క్ మెసిస్ధాన్ చేరుకున్న భారత రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ గారు ఆ దేశ అధ్యక్షుడు సెర్దార్ బర్దీమహామదోవ్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. ఇరాన్ లో భారత్ నిర్మించిన బాబహార్ నౌకాశ్రయాన్ని వాణిజ్య అవసరాలకు మధ్యాసియా దేశాలు వాడుకోవాలని రాష్ట్రపతి సూచించారు. తుర్క్మనిస్థాన్-ఆఫ్గానిస్థాన్-పాకిస్తాన్ భారత్(తాపీ) సహజవాయువు పైప్ లైన్ అంశాన్నీ కోవింద్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలుపుతున్నందుకు తుర్మొనిస్థాన్ కు రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తుర్క్మెనిస్థాన్ దేశంతో నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్
ఎవరు: తుర్క్మెనిస్థాన్ తో ఎక్కడ:
ఎప్పుడు : ఏప్రిల్ 01
.
మయామి ఓపెన్ డబ్ల్యు.టిఎ-1000 టోర్నీ టైటిల్ ను గెలిచిన టెన్నిస్ స్టార్ స్వియటెక్ :
పోలాండ్ టెన్నిస్ స్టార్ స్వియాటెక్ మయామి ఓపెన్ డబ్ల్యు.టిఎ-1000 టోర్నీ ఫైనల్లో 6-4, 6-0తో మాజీ సంబర్ వన్ అయిన వయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ సీజన్ లో స్వియాటెక్ కిది వరుసగా మూడో ప్రీమియర్ టైటిల్ (ఇతర్ ఓపెన్, ఇండి యన్ వెల్స్ ఓపెన్, మయామి ఓపెన్) వంటివికావడం విశేషం. సెరెనా (అమెరికా-2013లో), వొజ్నియాకి (డెన్మార్క్-2010లో) తర్వాత ఒకే సీజన్లో వరుసగా మూడు డబ్ల్యూటీఏ-1000 టైటిల్ ను నెగ్గిన మూడో ప్లేయర్ గా స్వియాటెక్ గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మయామి ఓపెన్ డబ్ల్యు.టిఎ-1000 టోర్నీ టైటిల్ ను గెలిచిన టెన్నిస్ స్టార్ స్వియటెక్
ఎవరు: స్వియటెక్
ఎప్పుడు : ఏప్రిల్ 01
.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా బాద్యతలు స్వీకరించిన ఎస్.రాజు :
ఏప్రిల్ 01, 2022 నుండి అమలులోకి వచ్చేలా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) యొక్క డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ ఎస్. రాజు గారు బాధ్యతలు స్వీకరించారు. 2022 మార్చ్ 31 న పదవీ విరమణ పొందిన శ్రీ ఆర్.ఎస్. గర్ఖాల్ గారి తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు, డాక్టర్ రాజు GSI హెడ్ క్వార్టర్ లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరియు నేషనల్ హెడ్, మిషన్-III & IV పదవిని కలిగి ఉన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక భారత ప్రభుత్వ శాస్త్రీయ సంస్థ. ఇది 1851లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా బాద్యతలు స్వీకరించిన ఎస్.రాజు
ఎవరు: ఎస్.రాజు
ఎప్పుడు : ఏప్రిల్ 01
.
,2022 BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న మీరాబాయి చాను :
ఒలింపిక్ రజత పతక విజేత భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 2022కిగాను BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. భారత క్రికటర్ యువ ఓపెనింగ్ క్రికెటర్ షఫాలీ వర్మ ‘BBC” ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును అందుకున్నారు. మాజీ వెయిట్‌లిఫ్టర్ కర్ణం మల్లీశ్వరికి ‘BBC లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందజేశారు. BBC ISWOTY అనేది BBC భారతదేశం వారి వారి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి భారత క్రీడాకారులను సత్కరించడానికి ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఈ అవార్డు యొక్క మొదటి ఎడిషన్ 2020లో జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ,2022 BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న మీరాబాయి చాను
ఎవరు: మీరా బాయి చాను
ఎప్పుడు : ఏప్రిల్ 02
.
సిక్కిం మాజీ ముఖ్యమంత్రి BB గురుంగ్ కన్నుమూత :
సిక్కిం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన బిబి గురుంగ్ గారు కన్నుమూశారు. ఆయన వయసు 99ఏళ్ళు. బిబి గురుంగ్ సిక్కిం యొక్క మూడవ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలాన్ని కలిగి ఉన్నారు. 1984లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసి కేవలం 13 రోజులు మాత్రమే ఈయనసీఎంగా పని చేసారు. అతను 1984 సంవత్సరంలో మే 11 తేది నుండి మే 24, వరకు పదవిలో ఉన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: సిక్కిం మాజీ ముఖ్యమంత్రి BB గురుంగ్ కన్నుమూత
ఎవరు: BB గురుంగ్
ఎప్పుడు : ఏప్రిల్ 02
.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా వికాస్ కుమార్ నియామకం :
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC )యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా వికాస్ కుమార్ గారు నియమితులయ్యారు. వికాస్ కుమార్ గారు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ యొక్క 1988 బ్యాచ్ కు చెందిన అధికారిగా ఉన్నారు . మార్చి 31, 2022 తో ఆయన యొక్క పదవీకాలం ముగియగడంతో మంగు సింగ్ తర్వాత అతను బాధ్యతలు స్వీకరించాడు. శ్రీధరన్ మరియు మంగు సింగ్ తర్వాత వికాస్ కుమార్ గారు ఈ డి.ఎం.ఆర్.సి మూడవ మేనేజింగ్ డైరెక్టర్ గా ఐదేళ్లపాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా వికాస్ కుమార్ నియమితులయ్యారు.
. క్విక్ రివ్యు :
ఏమిటి: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా వికాస్ కుమార్ నియామకం
ఎవరు: వికాస్ కుమార్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :ఏప్రిల్ 02
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |