
Daily Current Affairs in Telugu 31-03-2022
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అద్యక్షుడిగా మళ్లి ఎన్నికైన హిమంత బిశ్వ శర్మ :

అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఐన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ గారు 2022 నుంచి 2026 వరకు మరొక నాలుగేళ్ల కాలానికి ఆయన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అద్యక్షుడిగా తిరిగి మళ్లి ఎన్నికయ్యారు.కాగా అతను 2017 నుంచి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా BAI అద్యక్షుడిగా కొనసాగుతున్నాడు .అంతే కాక ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- అస్సాం రాష్ట్ర రాజధాని : దిస్పూర్
- అస్సాం రాష్ట్ర సిఎం : హిమంత బిశ్వా శర్మ
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అద్యక్షుడిగా మళ్లి ఎన్నికైన హిమంత బిశ్వ శర్మ :
ఎవరు: హిమంత బిశ్వ శర్మ
ఎక్కడ: ఇండియా
ఎప్పుడు: మార్చ్ 31
జాతీయ పారా-స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ 2022 విజేతగా నిలిచిన మహారాష్ట్ర :

ఉదయపూర్‌లోని మహారాణా ప్రతాప్ ఖేల్ గావ్‌లో జరిగిన 21వ జాతీయ పారా-స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో 306 పాయింట్లతో మహారాష్ట్ర విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌ను పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (PCI) మరియు నారాయణ్ సేవా సంస్థాన్ సంయుక్తంగా నిర్వహించాయి.
- మహారాష్ట్ర రాజధాని ;ముంబాయ్
- మహారాష్ట్ర సిఎం : ఉద్దావ్ తాక్రే
- మహారాష్ట్ర గవర్నర్ : భగత్ సింగ్ కోష్యారి
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ పారా-స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ 2022 విజేతగా నిలిచిన మహారాష్ట్ర :
ఎవరు: మహారాష్ట్ర
ఎప్పుడు: మార్చ్ 31
ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ (U-21) టైటిల్‌ను గెలుచుకున్న ప్రీతమ్ శివాచ్ హాకీ అకాడమీ :

లక్నోలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఫైనల్లో స్పోర్ట్స్ హాస్టల్ భువనేశ్వర్‌పై 5-0 తేడాతో విజయం సాధించిన ప్రీతమ్ శివాచ్ హాకీ అకాడమీ, సోనెపట్, ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ (U-21) టైటిల్‌ను కైవసం చేసుకుంది. సోనేపట్ ఆధారిత అకాడమీని భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ ప్రీతమ్ రాణి సివాచ్ నిర్వహిస్తారు. కాగా ఆమె 2021లో ద్రోణాచార్య అవార్డును కూడా గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ (U-21) టైటిల్‌ను గెలుచుకున్న ప్రీతమ్ శివాచ్ హాకీ అకాడమీ
ఎవరు: ప్రీతమ్ శివాచ్ హాకీ అకాడమీ
ఎక్కడ: లక్నోలో
ఎప్పుడు: మార్చ్ 31
ఐఎఫ్ &పి.ఎస్ యొక్క చైర్మన్ గా ఉన్న ఉదయ్ కోటక్ పదవికి రాజీనామా :

ప్రస్తుత౦ ఐఎఫ్ &పి.ఎస్ యొక్క చైర్మన్ గా ఐన ఉదయ్ కోటక్ తన పదవీకాలం ఏప్రిల్ 2, 2022తో ముగియడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (IL&FS) బోర్డు చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ IL&FS మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ రాజన్‌ను కంపెనీ యొక్క ఛైర్మన్ గా మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆరు నెలల పాటు ఏప్రిల్ 3, 2022 నుండి కొనసాగుతారని అమలులోకి తీసుకొచ్చింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఎఫ్ &పి.ఎస్ యొక్క చైర్మన్ గా ఉన్న ఉదయ్ కోటక్ పదవికి రాజీనామా :
ఎవరు: ఉదయ్ కోటక్
ఎప్పుడు: మార్చ్ 31
దేశంలోనే స్పేస్ టెక్ పాలసి ప్రవేశపెడుతున్న తెలంగాణ రాష్ట్రము :

తెలంగాణా రాష్ట్ర౦ను ప్రపంచం లో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్ గా మార్చే దిశగా స్పేస్ టెక్ పాలసి (అంతరిక్ష్ సాంకేతిక విధానం) ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిని 2022 ఏప్రిల్ 18 న వర్చువల్ ప్రపంచం ఐన మోటా వర్స్ వేదికగా విడుదల చేసేందుకు గాను సన్నాహాలు చేస్తుంది. స్పేస్ టెక్ కు సంబంధించి 2021 సెప్టెంబర్ లో కొత్త పాలసి ప్రేం వర్క్ ముసాయిదా రాష్ట్ర ఐటి విభాగం విడుదల చేసింది.స్పేస్ టెక్నాలజీ పైన పట్టున్న నిపుణులు శాస్త్రవేత్తలు స్టార్టప్ లు జాతీయ సంస్థలు స్పేస్ టెక్ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి పాలసికి తుది రూపుదిద్దితుంది.ఈ పాలసీ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో అంతరిక్ష రంగ ఉత్పత్తులు, సేవలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేటువంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది
- తెలంగాణ రాష్ట్ర రాజధాని :హైదరబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం :కెచంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే స్పేస్ టెక్ పాలసి ప్రవేశపెడుతున్న తెలంగాణ రాష్ట్రము :
ఎవరు: తెలంగాణ రాష్ట్రము
ఎప్పుడు: మార్చ్ 31
ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2021 అవార్డు ను అందుకున్న డాక్టర్ పి.రఘురామ్ :

బ్రిటిష్ దేశ రెండో అత్యున్నత ర్యాంకింగ్ అవార్డ్ లలో ఒకటైన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2021 ను హైదరాబాద్ లో ఉషా లక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్ గా ఉన్న ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సియివో డాక్టర్ పి.రఘురామ్ గారు అందుకున్నారు. ఇంగ్లాండ్ దేశ రాజధాని లండన్ సమీపం లో విండ్సర్ క్యాసిల్ లో మార్చ్ 30 న జరిగిన వేడుకలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్ ఈ అవార్డ్ ను ప్రదానం చేసారు.ఈ అవార్డు ను అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా అయన ఘనత సాధించారు.భారత్ లో రొమ్ము కేన్సర్ నుంచి సంరక్షణ శాస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం యుకె భారత్ మద్య సత్సంబందాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను రఘు రాం గారు ఈ అవార్డు ను పొందారు. రఘు రాం గారు అత్యంత చిన్న వయసులో 2015 లో పద్మ శ్రీ ని, 2016 బిసి రాయ్ నేషనల్ అవార్డును అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2021 అవార్డు ను అందుకున్న డాక్టర్ పి.రఘురామ్
ఎవరు: డాక్టర్ పి.రఘురామ్
ఎక్కడ: లండన్
ఎప్పుడు: మార్చ్ 31
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |