Daily Current Affairs in Telugu 01 June -2022
లోక్ పాల్ చీఫ్ గా జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతికి అదనపు బద్యతలు :
లోక్ పాల్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పదవీకాలం పూర్తి కావడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతికి లోక్పాల్ చైర్పర్సన్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.ప్రస్తుతం లోక్పాల్ లో ఆరుగురు సభ్యులున్నారు. రెండు జ్యుడీషియల్ సభ్యుల పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. కొన్ని వర్గాల ప్రభుత్వోద్యోగులపై అవినీతి కేసులను పరిశీలించడానికి కేంద్రంలో లోక్పాల్ మరియు రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించాలని భావించే లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం ఆమోదించబడింది.
- లోక్ పాల్ స్థాపన :2019 మార్చ్ 19
- లోక్ పాల్ ప్రధాన కార్యాలయం :ఢిల్లీ
క్విక్ రివ్యు :
ఏమిటి: లోక్ పాల్ చీఫ్ గా జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతికి అదనపు బద్యతలు
ఎవరు: ప్రదీప్ కుమార్ మొహంతి
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : జూన్ 01
భారత్ లోనే మొదటి సారి రేడియో ఫ్రీక్వేన్సి ఐడెంటిఫికేషణ్ ప్రారంబించిన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ :
భారతదేశంలో మొట్టమొదటిగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ప్రారంభించబడిన బ్యాగేజ్ ట్యాగ్లను ప్రవేశపెట్టింది. ఇది ప్రయాణీకులకు వారి లగేజీ యొక్క స్థానం గురించి నిజసమయ సమాచారాన్ని అందిస్తుంది. RFID సాంకేతికత వ్యక్తిగతీకరించబడుతుంది. మరియు వచ్చే ప్రయాణీకులు వారి చెక్-ఇన్ లగేజీని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.
- డిల్లి సి.ఎం : అరవింద్ కేజ్రివాల్
- డిల్లి ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ : వినయ్ కుమార్ సక్సేన
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లోనే మొదటి సారి రేడియో ఫ్రీక్వేన్సి ఐడెంటిఫికేషణ్ ప్రారంబించిన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్
ఎవరు: ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : జూన్ 01
భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్ పైన రెండేళ్ళ పాటు నిషేధం విధించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ :
భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్ పైన రెండేళ్ల నిషేధం విధించినట్లు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ప్రకటించింది. 2020 టోక్యో పారాలింపిక్స్ సందర్భంగా కేటగిరీ నిర్ణయించే సమయంలో అతను ఉద్దేశపూర్వకంగానే తన సామర్థ్యాలను తప్పుగా చూపించాడని తేలింది. దీంతో 41 ఏళ్ల ఈ డిస్కస్ త్రో అథ్లెట్ పై వచ్చే ఏడాది ‘ఆగస్టు వరకు ఏ పారా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనకుండా వేటు వేశారు. పారాలింపిక్స్ లో ఎప్52 డిస్కస్ త్రోలో పోటీ పడ్డ అతను. మూడో స్థానంలో నిలిచాడని, కానీ సహచర అథ్లెట్లు ఫిర్యాదు. చేయడంతో అతని త్రోను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్ పైన రెండేళ్ళ పాటు నిషేధం విధించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్
ఎవరు: ప్రపంచ పారా అథ్లెటిక్స్
ఎప్పుడు : జూన్ 01
ఆసియా కప్ టోర్నీ లో కాంస్య పథకం గెలుచుకున్న భారత్ :
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగి ఆసియా కప్ ఫైనల్ చేరలేకపోయిన భారత్ ఈ టోర్నీని కాంస్యంతో ముగించింది. జూన్ 01న కంచు పతక పోరులో మన కుర్రాళ్ల జట్టు 1-0 తేడాతో జపాన్ పైన గెలిచింది. ఆరంభం నుంచే భారత్ దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్ధి డిఫెన్స్ ను చేదించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఏడో నిమిషంలో రాజ్ కుమార్ ఫీల్డ్ గోల్ జట్టులో ఆనందం నింపాడు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించుకుంటూ ఉత్తమ్ సింగ్ బంతిని గోల్ పోస్టు వైపు తీసుకురాగా అక్కడే ఉన్న రాజ్ కుమార్ గోల్ కీపరు చాకచక్యంగా బోల్తాకొట్టించి దాన్ని గోల్ గా మలిచాడు. ఆ తర్వాత మూడు నిమిషాలకే భారత్ కు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో స్కోరు సమం చేయాలనే పట్టుదలతో జపాన్ ఆటగాళ్లు దాడిని తీవ్రతరం చేశారు. కానీ భారత డిఫెన్స్ బలంగా నిలబడి వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొట్టి కాంస్య పథకం గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా కప్ టోర్నీ లో కాంస్య పథకం గెలుచుకున్న భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు : జూన్ 01
గబోన్ దేశ పర్యటనను పూర్తి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు :
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గబోన్ దేశ పర్యటన జూన్ 01 తో పూర్తయింది. మూడు దేశాల పర్యట నలో భాగంగా ఉప రాష్ట్రపతి తొలుత మే 30న మధ్య ఆఫ్రికా దేశమైన గబోన్ రాజధాని లిబ్రెవిల్లే చేరుకున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా జూన్ 01న ఆయన ఆ దేశ ప్రత్యేక ఆర్ధిక మండలి (జీసెజ్) ని సందర్శించి, అక్కడి వ్యాపార వర్గాలతో సమావేశమయ్యారు. ఈ సెజ్ లో 50కి పైగా భారతీయ కంపెనీలు ఉన్నాయి. వాటి ప్రతినిధులతో సమావేశమైన ఉపరాష్ట్రపతి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఇండో గబోన్ ఆర్ధిక సంబంధాలను బలోపేతం చేయాలని సూచించారు. కాగా వెంకయ్యనాయుడు మంగళవారం ఆ దేశ ప్రధాని రోజ్ క్రిస్టైన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి సమక్షంలో సంయుక్త కమిషన్ ఏర్పాటు దౌత్యవేత్తలకు శిక్షణకు సంబంధించి రెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి:
క్విక్ రివ్యు :
ఏమిటి: గబోన్ దేశ పర్యటనను పూర్తి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎవరు: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎప్పుడు జూన్ 01
అమెరికా తీరగస్తీ దళం నూతన కమాండెంట్గా తొలిసారి ఓ మహిళ నియామకం :
అమెరికా తీరగస్తీ దళం నూతన కమాండెంట్ గా తొలిసారి ఓ మహిళ నియమితురాలై రికార్డు సృష్టించారు. ఇంతవరకు వైస్ కమాండెంట్ గా ఉన్న లిండా ఫాగన్ ఈ ఘనత సాధించారు. జూన్ 01న జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా దేశాధ్యక్షుడు జో జైడెన్ ఆమె నియామకాన్ని కొనియాడారు. ఇది ఇంతకు ముందే జరిగి ఉండాల్సిందని, మహిళలకు అవకాశమివ్వని రంగమంటూ లేదని ఆయన పేర్కొన్నారు. ఫాగన్ ఉద్యోగ ప్రస్థానాన్ని, అవకాశాలను అందిపుచ్చుకున్న తీరును ప్రస్తావించారు. ఇలాంటి కీలక స్థానాల్లోకి మరింతమంది మహిళలు రావాల్సి ఉందన్నారు. ప్రపంచం ఈరోజు తీసుకునే నిర్ణయాలు 21వ శతాబ్ది మార్గదర్శనం చేస్తాయని పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి అన్నారు.
- అమెరికా దేశ రాజధాని :వాషింగ్టన్
- అమెరికా దేశ కరెన్సీ :యు.ఎస్ డాలర్
- అమెరికా దేశ అద్యక్షుడు :జో బైడెన్
- అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు :కమలా హ్యారిస్
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా తీరగస్తీ దళం నూతన కమాండెంట్గా తొలిసారి ఓ మహిళ నియామకం
ఎవరు: లిండా ఫాగన్
ఎక్కడ : అమెరికా
ఎప్పుడు : జూన్ 01
భారత్-బంగ్లాదేశ్ ప్రజల నడుమ నూతన రైలు ‘మితాలీ ఎక్స్ ప్రెస్’ ప్రారంభం :
భారత్-బంగ్లాదేశ్ ప్రజల నడుమ స్నేహసం బంధాలను పెంపొందించేందుకు ఇరు దేశాలు కొత్త రైలు ‘మితాలీ ఎక్స్ ప్రెస్’ను జూన్ 01నుంచి ప్రారం భించాయి. ఇటీవలే పునరుద్ధరించిన హల్టీబాడీ -చిలాటీ రైలు మార్గంలో ఈ ఎక్స్ ప్రేస్ తిరుగుతుంది. కాగా రెండు దేశాల మధ్య ఇది మూడో రైలు సర్వీసు ఇది. వాస్తవానికి గతేడాది మార్చి 27న భారత్, బంగ్లాదేశ్ దేశప్రధానమంత్రులు ఇద్దరూ ఈ రైలు సర్వీసును వర్చువల్ గా ప్రారంభించారు. కొవిడ్ ఆంక్షల కారణంగా ఆది కార్యరూపం దాల్చలేదు. పరిస్థితులు ఇప్పుడు కొంత కుదుటపడటంతో ఇరు దేశాల రైల్వే మంత్రులు అశ్విని వైష్ణవ్, మహమ్మద్ నూరుల్ ఇస్లాం సుజన్ జూన్ 01నఈ రైలుకు మరోమారు వర్చువల్ గా జెండా ఊపి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ. ఇరుగు పొరుగు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ‘మితాలీ ఎక్స్ ప్రెస్’ ఓ మైలురాయిగా అభివర్ణించారు.
- బంగ్లాదేశ్ రాజధాని :డాకా
- బంగ్లాదేశ్ కరెన్సీ :టకా
- బంగ్లాదేశ్ ప్రధాని : : షేక్ హసీనా
- బంగ్లాదేశ్ అద్యక్షుడు : అబ్దుల్ హమీద్
- భారత్ మరియు బంగ్లాదేశ్ ల మద్య నడుస్తున్న రైలు :మైత్రి ఎక్స్ప్రెస్
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్-బంగ్లాదేశ్ ప్రజల నడుమ నడిచే రైలు ‘మితాలీ ఎక్స్ ప్రెస్’ ప్రారంభం
ఎవరు: భారత్-బంగ్లాదేశ్
ఎప్పుడు : జూన్ 01
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |