Daily Current Affairs in Telugu 13&14-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
విశ్వసుందరి-2021 కిరీటాన్ని కైవసం చేసుకున్న హర్నాజ్ సందు :
అందాల విశ్వంపై భారత కీర్తి పతాక౦ ను మరోసారి రెపరెపలాడి౦ది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు(21) విశ్వసుందరి-2021 కిరీటాన్ని డ్రైవసం చేసుకుంది. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఘనత మళ్లీ మన దేశా నికి దక్కింది. ఇజ్రాయెల్లోని ఐలాట్ నగరం వేదికగా జరిగిన 70వ విశ్వసుందరి పోటీల్లో 79 దేశాల నుంచి అందగత్తెలు పోటీపడ్డారు. డిసెంబర్ 13న జరిగిన తుది రౌండ్ లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు ఆద్భుతమైన రీతిలో సమాధానం చెప్పి హరాజ్ తొలి స్థానంలో నిలిచారు. పరాగ్వే సుందరి నదియా ఫెరారియా(22) ద్వితీయ స్థానం, దక్షిణాఫ్రికా అందగత్తె అలేలా. మ్యానే (21)’ మూడో స్థానం దక్కించుకున్నారు. విశ్వసుందరిగా ఆవిర్భవించిన హార్నాట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : విశ్వసుందరి-2021 కిరీటాన్ని డ్రైవసం చేసుకున్న హర్నాజ్ సందు
ఎవరు: హర్నాజ్ సందు
ఎప్పుడు: డిసెంబర్ 14
టైమ్ మ్యాగజైన్ ‘పర్సస్ ఆఫ్ ది ఇయర్-2021′గా ఎంపికైన టెస్లా సియివో ఎలాన్ మాస్క్ :
టైమ్ మ్యాగజైన్ ‘పర్సస్ ఆఫ్ ది ఇయర్-2021’గా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్ గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్పేస్ ఎలాన్ మస్క్ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను అధిగమించి ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కూడా అవతరించారు 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రచురిస్తున్నది. ఆ వ్యక్తి ఫొటోను కవర్ పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్యక్తుల ఇన్ఫ్ల్యూయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : టైమ్ మ్యాగజైన్ ‘పర్సస్ ఆఫ్ ది ఇయర్-2021’గా ఎంపికైన టెస్లా సియివో ఎలాన్ మాస్క్
ఎవరు: టెస్లా సియివో ఎలాన్ మస్క్
ఎప్పుడు: డిసెంబర్ 14
గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ (GHS) ఇండెక్స్ 2021 66 వ స్థానం లో నిలిచిన భారత్ :
జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ ప్రకారం గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ (GHS) ఇండెక్స్ 2021, ప్రపంచం యొక్క సగటు మొత్తం GHS ఇండెక్స్ స్కోర్ 38.9 కు 2021 లో, GHS ఇండెక్స్ లో 40.2 మార్కులను నుండి తగ్గిన (100) జరిగినది. 2019 CHS ఇండెక్స్ భాగస్వామ్యంతో న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ (NTI) మరియు బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వద్ద జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ ద్వారా ఈ ఇండెక్స్ విడుదల చేయబడింది. మొత్తం ఇండెక్స్ స్కోర్ 42.8తో 195 దేశాలలో భారతదేశం 66 వ స్థానంలో ఉంది మరియు 2019 నుండి 0.8 మార్పుతో పాటుగా ర్యాంక్ పొందింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) 75.9 స్కోర్ తో ఇండెక్స్ లో మొదటివ స్థానంలో ఉంది, ఆస్ట్రేలియా మరియు ఫిన్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ (GHS) ఇండెక్స్ 2021 66 వ స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: డిసెంబర్ 13
నవంబర్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్‘ విజేతగా నిలిచిన డేవిడ్ వార్నర్ :
నవంబర్ నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలను ఇటీవల ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఈ అవార్డు వరించగా మహిళల్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ హేలీ మ్యాథ్యూస్ విజేతగా నిలిచింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ను తొలిసారి ఆస్ట్రేలియా దేశం కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వార్నర్. దీంతో నవంబరు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్రి రేసులో ఉన్న అబిద్ అలీ, టిమ్ సౌథీలను దాటి విజేతగా నిలిచాడు
క్విక్ రివ్యు :
ఏమిటి : నవంబర్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతగా నిలిచిన డేవిడ్ వార్నర్
ఎవరు: డేవిడ్ వార్నర్
ఎప్పుడు: డిసెంబర్ 13
ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైన దేశంగా నిలిచిన బ్రిటన్ :
ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం బ్రిటన్లో నమోదైందని దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ గారు ప్రకటించారు. పశ్చిమ లండన్లోని టీకా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా బోరిస్ “మీడియాతో మాట్లాతూ. ప్రపంచంలో తొలి బ్రిటన్లో ఒమిక్రాన్ మరణం నమోదైంది అని ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ 63 దేశా లకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైన దేశంగా నిలిచిన బ్రిటన్
ఎక్కడ: బ్రిటన్
ఎప్పుడు: డిసెంబర్ 13
రోబోకాన్ 2022 అంతర్జాతీయ ఫైనల్స్ ను నిర్వహించ నున్న దూరదర్శన్ సంస్థ :
టెక్నాలజీ రంగంలో భారతదేశపు అద్భుతాలకు గుర్తింపుగా దూరదర్శన్ వచ్చే ఏడాది ఆగస్టులో రోబోకాన్ 2022 అంతర్జాతీయ ఫైనల్స్ ను నిర్వహించనుంది. రోబోట్ పోటీని ఆసియా-పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ నిర్వహిస్తుంది మరియు ప్రతి సంవత్సరం వివిధ సభ్య దేశాలచే నిర్వహించబడుతుంది, ఇది 2022లో న్యూఢిల్లీలో జరుగుతుంది.ABU రోబోకాన్ 2021కి చైనా ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో అంతర్జాతీయ రోబోకాన్ పోటీ డిసెంబర్ 12, 2021న జరిగింది. భారతదేశ ఫైనలిస్టులుగా ఉన్న నిర్మా విశ్వవిద్యాలయం మరియు అహ్మదాబాద్ లోని గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (GTU) జట్లు భారతదేశం నుండి అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నాయి. ఆసియా-పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ రోబోట్ కాంటెస్ట్ 2002లో ప్రారంభించబడింది, ఇందులో వివిధ బృందాలు నిర్మించిన రోబోట్లు ఇచ్చిన సమయ వ్యవధిలో టాస్క్లను పూర్తి చేయడానికి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఈ పోటీ 21వ శతాబ్దంలో ఇలాంటి ఆసక్తులు ఉన్న యువకుల మధ్య స్నేహపూర్వక పోటీ మరియు స్నేహం కోసం ఉద్దేశించబడింది, అలాగే ఈ ప్రాంతంలో ఇంజినీరింగ్ మరియు ప్రసార ‘సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : రోబోకాన్ 2022 అంతర్జాతీయ ఫైనల్స్ ను నిర్వహించ నున్న దూరదర్శన్ సంస్థ
ఎవరు: దూరదర్శన్ సంస్థ
ఎప్పుడు: డిసెంబర్ 13
ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్ లెస్ గవర్నమెంట్ గా నిల్చిన దుబాయ్ :
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్ లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షనన్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ ఈ ఘనత అందుకుంది. దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్లెస్ గవర్నమెంట్ ను’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హల్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను1.3 బిలియన్ దిరామ్ (350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్సాక్షన్ తో పాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్ లో ప్రజలకు చేరవేయడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్ లెస్ గవర్నమెంట్ గా నిల్చిన దుబాయ్
ఎవరు: దుబాయ్
ఎక్కడ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఎప్పుడు: డిసెంబర్ 13
ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ -పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు 2021 గెలుచుకున్న బిపిసిఎల్ :
రిఫైనరీ వ్యర్థాలను విలువైన వస్తువులుగా మార్చే భారత్ జీఎస్ఆర్ క్యాట్ ను అభివృద్ధి చేసినందుకు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ -పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు 2021 వరించింది. కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ చిరంజీవి తోట, ఆయన బృందం చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. సుప్రీంకోర్టు మాజీ చీప్ జస్టిస్, జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ ఎంఎన్ వెంకటతాలయ్య నేతృత్వంలోని అవార్డుల జ్యూరీ సిఫారసుల మేరకు డైరెక్టర్ల ఇన్స్టిట్యూట్ (ఐఓడీ) ఈ అవార్డును అందించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ -పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు 2021 గెలుచుకున్న బిపిసిఎల్
ఎవరు: బిపిసిఎల్
ఎప్పుడు: డిసెంబర్ 13
విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ ఎంపిక :
విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి గానూ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ను ఎంపిక చేసింది. నాలుగు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన బైల్స్ టోక్యో ఒలింపిక్స్ సమయంలో తాను ‘ద ట్విస్టీస్ బాధ పడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ మాజీ డాక్టర్ ల్యారీ నానర్ తమపై లైంగిక వేధింపుల పాల్పడ్డాడంటూ సెనేట్ ముందు సాక్ష్యం చెప్పింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ ఎంపిక
ఎవరు: సిమోన్
ఎప్పుడు: డిసెంబర్ 14
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |