Daily Current Affairs in Telugu 11&12-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఫార్ములావన్ చాంపియన్ గా నిలిచిన రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్ స్టాపెన్ :
రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్ స్టాపెన్ విశ్వ విజేతగా నిలిచారు. దేని కోసమైతే చిన్నప్పటి నుంచి కల కన్నాడో ఆ ప్రపంచ చాంపియన్ టైటిల్ ను అందుకున్నాడు. డిసెంబర్ 12 నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన సీజన్ చివరిదైన అబుదాబి గ్రాండ్ ప్రి రేసులో అతను విజేతగా నిలిదాడు. ఒక గంట 30 నిమిషాల 17 345 72 న్లలో రేసు ముగించి అగ్రస్థానాన్ని దర్శించుకున్నారు. ఎనిమిదో టైటిల్ రికార్డు సృష్టించాల సుకున్న బ్రిటన్ రేసర్ హామిల్టన్ (మెర్సిడెజ్) కేవల౦ 2.256 సెకన్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ విజయంతో మొత్తం రేషన్ స్ పాయింట్లతో, వెర్ పెన్ ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటీ: ఫార్ములావన్ చాంపియన్ గా నిలిచిన రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్ స్టాపెన్
ఎవరు: మ్యాక్స్ వెర్ స్టాపెన్
ఎప్పుడు: డిసెంబర్ 11
అమెరికా అధ్యక్ష భవనం కీలక బాధ్యతల్లో నియమితులైన గౌతం రాఘవన్ :
ఇండో-అమెరికన్ రాజకీయ సలహాదారు గౌతం రాఘవన్ (40) అమెరికా అధ్యక్ష భవనం కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు. శ్వేత భవనంలోని అధ్య క్షుడి వ్యక్తిగత కార్యాలయం (పీపీవో) కొత్త డైరెక్టరుగా ఈయనను నియమిస్తూ అధ్యక్షుడు జో బ్రెడెన్ డిసెంబర్ 11న ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్ష భవనంలో పనిచేసే సిబ్బంది నియామకాలు, తీరు పరిశీలనలో సీపీవో ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. ఇప్పటిదాకా ఈ పేషీలో చీఫ్ గా ఉన్న కేధీ రసెల్ ను యునిసెఫ్ కు తదుపరి ఎగ్జి క్యూటివ్ డైరెక్టరుగా నియమించనున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించిన నేపథ్యంలో అధ్యక్షుడు జైడెన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. పీపీవో డిప్యూటీ డైరెక్టరుగా కొనసాగుతున్న గౌతం రాఘవన్ అదే విభాగంలో ఇప్పుడు కీలక పదవి బాధ్యతలు చేపడతారు. స్వలింగ సంపర్కుడైన (గే) రాఘ మన్, భారతదేశంలో పుట్టి, అమెరికాలోని సియాటిల్లో స్థిరపడ్డారు.
క్విక్ రివ్యూ :
ఏమిటీ: అమెరికా అధ్యక్ష భవనం కీలక బాధ్యతల్లో నియమితులైన గౌతం రాఘవన్
ఎవరు: గౌతం రాఘవన్
ఎప్పుడు: డిసెంబర్ 11
అంతర్జాతీయ సముద్ర సంస్థ కౌన్సిల్ కు తిరిగి ఎన్నికైన భారత్ :
అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంవో) కౌన్సిల్కు భారత్ తిరిగి ఎన్నికైంది. లండన్లోని సంస్థ అసెంబ్లీలో ఈ ఎన్నిక జరిగింది. 2022-23 వరకు రెండేళ్లపాటు ఈ సభ్యత్వం కొనసాగుతుంది. అంతర్జాతీయంగా సముద్ర వ్యాపారంలో ప్రముఖంగా ఉన్న 10 దేశాల కేటగిరీలో భారత్ ఎన్నికైంది. ‘ఆస్ట్రే లియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ది నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. 32వ కౌన్సిల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ‘వచ్చే డిసెంబర్ 15 తొ ఐఎంవో 126వ బేటీ లాంఛనప్రాయంగా జరగనుంది. ఇదే సమావేశంలో కొత్త కౌన్సిల్ అధ్యక్ష ఉపాద్యక్షులు ఎన్నిక కూడా ఉంటుంది. ఈ కౌన్సిల్ లో -175 సభ్య దేశాలు, మరో మూడు అనుబంధ దేశాలు. ఉన్నాయి. చైనా, గ్రీస్, ఇటలీ, జపాన్, సార్వే, పనామా, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ది రష్యన్ ఫెడరేషన్, బ్రిటన్ ఫెడరేషన్, బ్రిటన్, అమెరికా దేశాలు అంతర్జాతీయ షిప్పింగ్ సర్వీసుల కోటాలో కౌన్సిలకు ఎన్నికయ్యాయి
క్విక్ రివ్యూ :
ఏమిటి: అంతర్జాతీయ సముద్ర సంస్థ కౌన్సిల్ కు తిరిగి ఎన్నికైన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: డిసెంబర్ 12
ఆసియా రోయింగ్ చాంపియన్ షిప్ స్వర్ణ పథకం గెలుచుకున్న భారత క్రీడాకారులు :
ఆసియా రోయింగ్ చాంపియన్ షిప్ లో భారత రోయర్లు అర్జున్ లాల్ రవి సత్తా చాటారు.పురుషుల జాబితాలో డబుల్స్ స్కల్స్ లో వీరు స్వర్ణం గెలుచుకు న్నారు. జరిగిన రేసులో అర్జునవి .జంట 6 నిమిషాల 57.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత “ద్వయం చైనా జంట క్వింగ్ లీ-జాంగ్ (7 నిమి పాల 2.37 సెకన్లు), ఉజ్బెకిస్థాన్ 6 నిమిషాల 57.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత ద్వయం చైనా జంట క్వింగ్ లీజాంగ్ (7 నిమి షాల 2.37 సెకన్లు), ఉజ్బెకిస్థాన్ ద్వయం దారోనోవ్-ముక్మదెవ్ (7 నిమిషాల T.13 సెకన్లు)లను వెనక్కి నెట్టింది. మరోవైపు సింగిల్ స్కల్స్లో పరీందర్ సింగ్ రజతం గెలిచాడు. ఫైనల్లో పర్మీందర్ 8 నిమిషాల 7:32 సెక న్లలో లక్ష్యాన్ని అందుకుని రెండో స్థానంలో నిలిచాడు. షబ్బోజ్ (ఉజ్బెకిస్థాన్..7 నిమిషాల 56.3 సెకన్లు) స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఆసియా రోయింగ్ చాంపియన్ షిప్ స్వర్ణ పథకం గెలుచుకున్న భారత క్రీడాకారులు
ఎవరు: అర్జున్ లాల్ రవి
ఎప్పుడు: డిసెంబర్ 12
UNICEF యొక్క తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ నియామకం :
ఐక్యరాజ్యసమితి UN పిల్లల ఏజెన్సీ UNICEF యొక్క తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ ను నియమించింది. హెన్రిట్టా ఫోర్ స్థానంలో కేథరీస్ రస్పెల్ ఉంటుంది. ప్రస్తుతం వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్ కి అసిస్టెంట్ గా ఉన్న రస్సెల్, యునిసెఫ్ కు అధిపతిగా ఉన్న ఎనిమిదవ అమెరికన్ గా నిలవనుంది. 1946లో స్థాపించబడినప్పటి నుండి UNICEF యొక్క కార్యనిర్వాహ డైరెక్టర్లు అమెరికన్లు
క్విక్ రివ్యూ :
ఏమిటి: UNICEF యొక్క తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ నియామకం
ఎవరు: కేథరీన్ రస్సెల్
ఎప్పుడు: డిసెంబర్ 12
బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన త్రిపుర ప్రభుత్వం :
సబ్రూమ్లోని మను బంకుల్లో బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు త్రిపుర ప్రభుత్వం ఆమోద తెలిపింది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బహుజన హితయ ఎడ్యుకేషన్ ట్రస్టుకు లెటర్ ఆఫ్ 31 దేశాల విద్యార్థులు ప్రతిపాదిత వర్సిటీలో బౌద్ధ సాహిత్యం, సంస్కృతి మరియు సంప్రదాయాలను అధ్యయనం చేయడంతోపాటు పరిశోధన చేయడానికి అవకాశం పొందుతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన త్రిపుర ప్రభుత్వం
ఎవరు: త్రిపుర ప్రభుత్వం
ఎక్కడ: త్రిపుర
ఎప్పుడు: డిసెంబర్ 12
ఆత్మ నిర్బర్ కృషక్ వికాస్ యోజన అనేపథకం కు ఆమోదం తెలిపిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రము :
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు స్వీయ ఆధారిత రైతు అభివృద్ధి పథకానికి ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ అనుమతి మంజూరు చేయబడింది. ఆత్మ నిర్బర్ కృషక్ వికాస్ యోజన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద, వచ్చే మూడేళ్లలో ఒక్కో డెవలప్మెంట్ బ్లాక్ లో 1,475 రైతు ఉత్పత్తిదారులు సంస్థలు (FPOలు) ఏర్పాటు చేయబడతాయి. ఈ పథకం పంటకోత అనంతర నిర్వహణ అవస్థాపన మరియు సమాజానికి ఆచరణీయమైన ప్రాజెక్టలో పెట్టుబడి కోసం దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. 2 కోట్ల రూపాయల మేరకు అన్ని రుణాలకు సంవత్సరానికి 3% వడ్డీ రాయితీ అందించబడుతుంది. ఈ పథకం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF) ద్వారా నిధులు సమకూరుస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఆత్మ నిర్బర్ కృషక్ వికాస్ యోజన అనేపథకం కు ఆమోదం తెలిపిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రము
ఎవరు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రము
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రము
ఎప్పుడు: డిసెంబర్ 11
UNICEF దినోత్సవం గా డిసెంబర్ 11 :
75వ UNICEF దినోత్సవంగా డిసెంబర్ 11, 2021న జరుపుకుంటున్నారు. UNICEF అనగా United Nations International Children’s Emergency Fund . ఈ రోజు ఐక్యరాజ్యసమితి బాలల నిధి స్థాపనకు గాను సూచిస్తుంది. UNICEF వారి ప్రాంతం, జాతి మరియు సంస్కృతితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పిల్లల అభివృద్ధికి కృషి చేస్తుంది. కాగా ఇది 1946లో ఐక్యరాజ్యసమితి జనరల్ ఏజెన్సీచే స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం USAలోని న్యూయార్క్ నగరంలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: UNICEF దినోత్సవం గా డిసెంబర్ 11
ఎప్పుడు: డిసెంబర్ 11
కంప్యూటర్ గేమ్ దిగ్గజం మాసయూకి ఉమురా కన్నుమూత :
జపాన్ హోమ్ కంప్యూటర్ గేమ్ దిగ్గజం మాసయూకి ఉమురా (78) కన్నుమూశారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది గేమింగ్ ప్రియులకు తీరని లోటు మిగిల్చి వెళ్లిపోయారు. ఉమురా మరణించిన విషయాన్ని క్యోటోలోని రిట్సుమైకాన్ విశ్వ విద్యాలయం వెల్లడించింది. 1913లో టోక్యోలో జన్మించిన ఉమురా.ఎలక్ట్రానిక్ ఇంజినీరిం గ్ ను అభ్యసించారు. అనంతరం 1971లో నింటెండో ఎలక్ట్రానిక్, గేమింగ్ సంస్థలో చేరారు. ఆయన చేరికతో ఆ సంస్థ దశ మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక విజయా లను నమోదు చేసింది. 1981లో ఉమురా నేతృత్వంలో డాంకీ కాంగ్ వంటి గేమ్స్ ఆడేందుకు తయారు చేసిన హోమ్ కన్సోల్ యూనిట్లు అమెరికా తదితర దేశాల్లో లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. 1983లో తీసుకొచ్చిన ‘ఫమికామ్ గేమ్ సిస్టమ్’ అప్పట్లో జపాన్ మార్కెట్లను కుదిపేసింది
క్విక్ రివ్యూ :
ఏమిటి: కంప్యూటర్ గేమ్ దిగ్గజం మాసయూకి ఉమురా కన్నుమూత
ఎవరు: మాసయూకి ఉమురా
ఎక్కడ: జపాన్
ఎప్పుడు: డిసెంబర్ 12
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |