Daily Current Affairs in Telugu 10&11-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్ వ్యవహరించనున్న టాటా గ్రూప్ :
టాటా గ్రూప్ ఈ ఏడాది నుంచి ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది.చైనా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారు వివో స్థానాన్ని టాటా భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ధ్రువీకరించాడు. “అవును. టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వ్యవహరించనుంది” అని ఆయన చెప్పాడు. ఒప్పందం విలువెంతో మాత్రం వెల్లరడించలేదు. వివోకు 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఒప్పందం ఉంది.. అయితే 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ ఏడాదికి స్పాన్సర్ గా వైదొలగింది. దీంతో ఆ సంవత్సరం డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్ గా ఉండగా తిరిగి 2021లో వివో స్పాన్సర్ గా తిరిగొచ్చింది. అయితే ఇంకో సీజన్ కు స్పాన్సర్ కొనసాగే అవకాశమున్నా, వివో వైదొలగాలని నిర్ణయించుకుంది. “వివో స్పాన్సర్ గా ఉండడం వల్ల లీగ్ తో పాటు ఆ కంపెనీకి చెడ్డ పేరు వస్తోంది. చైనా ఉత్పత్తుల పట్ల దేశంలో వ్యతిరేక భావన ఉన్న నేపథ్యంలో ఒప్పందంలో భాగంగా మరో ఏడాది కొనసాగే వీలున్నా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవాలని వివో నిర్ణయించు కుంది” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి:ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్ వ్యవహరించనున్న టాటా గ్రూప్
ఎవరు : టాటా గ్రూప్
ఎప్పుడు: జనవరి 10
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ :
దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దేశ జట్టు టైటాన్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్న మోరిస్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. “అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. టైటాన్స్ జట్టులో శిక్షణ బాధ్యతలు స్వీకరించినందుకు ఆనందంగా ఉంది” అని మోరిస్ పేర్కొన్నాడు. ‘మోరిస్ 4 టెస్టుల్లో 12 వికెట్లు, 173 పరుగులు.. 42 వన్డేల్లో 48 వికెట్లు, 467 పరుగులు.. 23 టీ20 మ్యాచ్ 34 వికెట్లు, 133 పరుగులు రాబట్టాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి:అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్
ఎవరు: క్రిస్ మోరిస్
ఎక్కడ: దక్షిణాఫ్రికా
ఎప్పుడు: జనవరి 10
అత్యాధునిక సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ :
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అత్యాధునిక సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ కు సంబంధించిన నౌకాదళ వెర్షన్ ను భారత్ జనవరి 11న విజయవంతంగా పరీక్షించింది. నేవీకి చెందిన స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం. నుంచి ఈ ఆస్త్ర ను ప్రయోగించడం జరిగింది. లక్ష్యంగా నిర్దేశించిన ఒక నౌకను ఇది విజయవంతంగా డి. కొట్టిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. నౌకా దళ పోరాట సన్నద్ధతను ఈ ఆస్త్ర పరీక్ష మరో సారి తేటతెల్లం చేసిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రయోగాన్ని విజయ వంతంగా నిర్వహించిన నౌకాదళ. కౌల్డీవో బృందాలను ఆయన అభినందించారు. బ్రహ్మోస్ట్ క్షిపణిని భారత్, రష్యాలు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: అత్యాధునిక సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ను విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: జనవరి 10
కన్వర్షన్ థెరపీని నిషేధించిన కెనడా దేశం :
కెనడా కన్వర్షన్ థెరపీని నిషేధించింది. ఒక వ్యక్తి యొక్క లైంగిక ధోరణి లేదా లింగ గుర్తింపును మార్చగలదని చెప్పుకునే అపఖ్యాతి పాలైన చికిత్సను నిలిపివేసిన దేశాల జాబితాలో కెనడా దేశం చేరింది. డిసెంబర్ 2021లో పార్లమెంట్ ఆమోదించిన నిషేధాన్ని కెనడా ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా అమలు చేసింది.
- కెనడా దేశ రాజధాని : ఒట్టావా
- కెనడా దేశ కరెన్సీ :కెనడియన్ డాలర్
- కెనడా దేశ ప్రదాని ; జస్టిస్ ట్రూడో
క్విక్ రివ్యు :
ఏమిటి: కన్వర్షన్ థెరపీని నిషేధించిన కెనడా దేశం
ఎవరు: కెనడా దేశం ఎప్పుడు: జనవరి
పంజాబ్ డిజిపి గా వీరేష్ కుమార్ భావ్రా నియామకం :
అస్సాంలోని దర్రాంగ్ జిల్లాకు చెందిన మాజీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎట్టకేలకు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పోలీస్ ఫోర్స్ హెడ్)గా పంజాబ్ పోలీసులను నడిపించారు!. గత మూడు నెలల వ్యవధిలో పంజాబ్‌లో ఆయన మూడో డీజీపీ గా ఉన్నారు. వీరేష్ కుమార్ భావ్ర 1987 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి మొదట్లో అస్సాం మరియు మేఘాలయ కేడర్‌లో చేరారు మరియు నాగావ్ మరియు జోర్హాట్ జిల్లాలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా నిజాయితీ గా తన సేవలను అందించిన తర్వాత అతను 1992లో దర్రాంగ్ జిల్లాలో 5వ పోలీసు సూపరింటెండెంట్‌గా చేరారు.
- పంజాబ్ రాష్ట్ర రాజధాని :చండీఘర్
- పంజాబ్ రాష్ట్ర సిఎం: చరణ్ జీత్ సింగ్ చన్ని
- పంజాబ్ రాష్ట్ర గవర్నర్ : బన్వర్ లాల్ పురోహిత్
క్విక్ రివ్యు :
ఏమిటి: పంజాబ్ డిజిపి గా వీరేష్ కుమార్ భావ్రా నియామకం:
ఎవరు: వీరేష్ కుమార్ భావ్రా
ఎక్కడ: పంజాబ్
ఎప్పుడు: జనవరి 11
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) యొక్క కొత్త చీఫ్ ఎకనామిస్ట్ గా పియరీ-ఒలివియర్ గౌరించాస్ నియామకం :
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) యొక్క కొత్త చీఫ్ ఎకనామిస్టగా ఫ్రెంచ్ ఆర్థికవేత్త పియరీ-ఒలివియర్ గౌరించాస్ నియమితులయ్యారు. 2019 నుండి ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కు గౌరించాస్ వారసునిగా నియమిస్తారు. గోపీనాథ్ తరువాత ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ కూడా. జనవరి 21న ఐఎమ్ఎఫ్ యొక్క మొదటి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా మారనున్నారు. ప్రస్తుతం, గౌరించాస్ UC బర్కిలీ యొక్క క్లాసెస్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ యొక్క ఫ్యాకల్టీ డైరెక్టర్ గా ఉన్నారు .
- ఐఎమ్ఎఫ్ యొక్క స్థాపన :1944
- ఐఎమ్ఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం :వాషింగ్టన్ డిసి
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) యొక్క కొత్త చీఫ్ ఎకనామిస్ట్ గా పియరీ-ఒలివియర్ గౌరించాస్ నియామకం
ఎవరు: పియరీ-ఒలివియర్ గౌరించాస్
ఎప్పుడు: జనవరి 11
యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ సపోలీ కన్నుమూత
యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ సపోలీ జనవరి 11, 2022 ప్రారంభంలో ఇటలీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. అతని వయస్సు 65. డేవిడ్ సపోలీ చట్టాలను ఆమోదించే లేదా తిరస్కరించే యూరోపియన్ యూనియన్ బాడీకి నాయకత్వం వహించాడు. మరియు బడ్జెట్లను స్థాపించడానికి మరియు సంస్థల కలయికను పర్యవేక్షించడానికి ఈయన బాధ్యత వహించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ సపోలీ కన్నుమూత :
ఎవరు: డేవిడ్ సపోలీ
ఎప్పుడు: జనవరి 11
ప్రముఖ కన్నడ రచయిత ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాటిల్ కన్నుమూత :
ప్రముఖ కన్నడ రచయిత మరియు కవి, ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాటిల్ (83) జనవరి 11న ఉదయం బెంగళూరులో వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో మరణించారు. పాటిల్‌ను ‘చంపా’ అని కూడా పిలిచేవారు. కన్నడ అభివృద్ధి బోర్డు మరియు కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన యొక్క స్వస్థలం హవేరిలోని హత్తిముత్తూరు. అతను 1980లలో ప్రసిద్ధ గోకాక్ నిరసనతో సహా కన్నడ అనుకూల నిరసనలలో కీలక పాత్ర పోషించాడు, అక్కడ కన్నడకు ప్రథమ భాష హోదా పొందడంలో విజయవంతమైన పోరాటం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ కన్నడ రచయిత ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాటిల్ కన్నుమూత :
ఎవరు: ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాటిల్
ఎప్పుడు: జనవరి 10
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |