Daily Current Affairs in Telugu 03-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
దేశీయ తొలి సర్వర్ రుద్రాను ఆవిష్కరించిన కేంద్ర ఐటి సహాయ మంత్రి :
దేశీయంగా ఆవిష్కరించిన తొలి సర్వర్ ‘రుద్ర’ను ఎలక్ట్రానిక్స్ ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. దీనిని నేషనల్ సూపర్ కంప్యూ టింగ్ మిషన్(ఎన్ఎస్ఎమ్) కింద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సి-డాక్)ను అభివృద్ధి చేసింది. ఈ సర్వర్ డిజైన్ ను సంప్రదాయ వాణిజ్య సర్వర్ల తయారీకీ వినియోగించుకోవచ్చు. అత్యంత ‘భారీ కంప్యూటింగ్ పనితీరును ప్రదర్శించే పెద్ద సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మాణం ‘లోనూ వాడుకోవచ్చు. ‘దేశ కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసి, అభి వృద్ధి పరచి, సర్వర్లను నిర్మించగల సత్తా భారత్ కు ఉందని దీంతో నిరూపితమైందని ఐటీ శాఖ పేర్కొంది. తాజాగా ఆవిష్కరించిన ఈ సొంత సర్వర్ నుంచి అధిక పనితీ రును కనబరిచే కంప్యూటింగ్ (హెచ్పీసీ) సిస్టమ్స్, హైపర్ స్కేల్ డేటా సెంటర్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, బ్యాంకింగ్ అండ్ కామర్స్ తయారీ, చమురు- గ్యాస్ పరిశ్రమ, ఆరోగ్యం సంరక్షణ వంటి వేర్వేరు రంగాలు ప్రయో జనం పొందనున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశీయ తొలి సర్వర్ రుద్రాను ఆవిష్కరించిన కేంద్ర ఐటి సహాయ మంత్రి
ఎవరు: కేంద్ర ఐటి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఎప్పుడు : : డిసెంబర్ 03
బలవంతపు వివాహం పైన నిషేధం విధించిన ఆఫ్గనిస్తాన్ దేశం :
మహిళలపై తీవ్ర వివక్ష’ చూపే తాలిబన్లు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతపు పెళ్ళిళ్లు నిషేధించారు. పురు షులు, మహిళలు సమానమని ఆ ఉత్తర్వుల్లో ‘తెలిపారు.. స్త్రీలను ఆస్తి పరిగణించకూడ దంటూ కూడా పేర్కొన్నారు. తాలిబన్ అధి ప్రతి హిబతుల్లా అఖుందా పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. మహిళలపై తీవ్రమైన వేధింపులు, అణచివే తకు పాల్పడిన చరిత్ర తాలిబన్లకు ఉంది. ఇటీవల అఫ్గాన్లో అధికారం చేజిక్కించు కున్న తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు లేదు. అయితే ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతోనే మహిళల విషయంలో తాలి బన్ ఉదార వైఖరి ప్రదర్శించిందని విశ్లేష కులు అంటున్నారు. అయితే తాజా ఉత్త ర్వుల్లో కనీస వివాహ వయసును పేర్కొన లేదు. గతంలో ఇది 16 ఏళ్లుగా ఉండేది. పేదరికం, పిడి సంప్రదాయవాదం వేళ్లూను కున్న ఆఫ్గాన్ బలవంతపు పెళ్లిళ్లు సర్వ సాధారణంగా మారాయి. ఆడపిల్లల్ని అమ్ము కోవడం, అప్పు కింద చెల్లించడం, సంధి కోసం పణంగా పెట్టడం వంటివి సంప్రదా యంగా చలామణి అవుతున్నాయి. గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు.. భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలన్న నియమం ఉంది. ఇలాంటి – ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబన్ల తాజా ‘ఉత్తర్వులున్నాయి. అలాగే భర్తను కోల్పో యిన మహిళ 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచు కొనే స్వేచ్ఛ ఇస్తున్నట్టు తెలిపింది.
ఆఫ్గనిస్తాన్ దేశ రాజధాని :కాబుల్
ఆఫ్గనిస్తాన్ దేశ కరెన్సీ : ఆఫ్గన్ఆఫ్గని
క్విక్ రివ్యు :
ఏమిటి: బలవంతపు వివాహం పైన నిషేధం విధించిన ఆఫ్గనిస్తాన్ దేశం
ఎవరు: ఆఫ్గనిస్తాన్ దేశం
ఎక్కడ: ఆఫ్గనిస్తాన్ దేశం
ఎప్పుడు : : డిసెంబర్ 03
పీఐసీఎస్ కు వ్యవస్థాపక పరిశోధకునిగా డాక్టర్ నాగేశ్వరరావు కొనేటి నియమకం :
తెలుగు వైద్యునికి అరుదైన గౌరవం దక్కింది. ది పీడియాట్రిక్ అండ్ కంజెనిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియో వాస్క్యులర్ సొసైటీ(పీఐసీఎస్) వ్యవస్థాపక పరిశోధకునిగా ప్రముఖ చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్స నిపు డాక్టర్ నాగేశ్వరరావు కొనేటి నియమితులయ్యారు. పుట్టుకతోనే గుండె వ్యాధులు ఉన్న శిశుపులకు పీఐసీఎస్ సహాయపడుతోంది. తక్కువడంలో ఈ సొసైటీ ముందుంది. అనుభవం, నైపుణ్యంతోపాటు పేషెంట్ కేర్, అభ్యాసం, పరిశోధనలపై కృషి చేసే వారికి ఈ ఫెలోషిప్ అందిస్తుంటారు. డాక్టర్ నాగేశ్వరరావు ప్రస్తుతం రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రుల్లో విదులు నిర్వహిస్తున్నారు. గుండెలోని రెండు జఠరికల మద్య కేంద్రం (వెంట్రిక్యులర్ సెస్టల్ డిఫెక్ట్) మూసి వేయడానికి రెట్రో గ్రేడ్ టెక్నిక్ ను ఈయన గతంలో అభివృద్ధి చేశారు. తల్లి కడుపులో ఉండగానే శిశువు గుండెకు చికిత్సలు చేయ డంతోపాటు ఇతర పద్ధతులను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పీఐసీఎస్ కు వ్యవస్థాపక పరిశోధకునిగా డాక్టర్ నాగేశ్వరరావు కొనేటి నియమకం
ఎవరు: నాగేశ్వరరావు కొనేటి నియమకం
ఎప్పుడు : : డిసెంబర్ 03
అంతర్జాతీయ ద్రవ్య నిధి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎల్డీఎండీ) గా గీతా గోపి నాథ్ నియామకం :
అంతర్జాతీయ సంస్థల్లో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ భారతీయులు సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎల్డీఎండీ)గా మన ఆడపడుచు గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. అంటే ఈ దిగ్గజ సంస్థలో ఆమె రెండో అత్యున్నత అధికార స్థానాన్ని అధిరోహించారు.ఇప్పటి వరకు ఆమె ఐఎంఎస్ లో ప్రధాన ఆర్ధికవేత్తగా ఉన్నారు. కొవిడ్ కల్లోలంతో అతలాకుతల మైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ పదోన్నతి లభించింది. ప్రస్తుత ఎఫ్ ఎండీగా ఉన్న జియోఫ్రై వచ్చే ఏడాది ప్రారంభంలో ఐఎంఎఫ్ ను వీడనున్నారు. ఆ స్థానంలోకి గీతా గోపీనాథ్ వస్తారని ఐఎంఎఫ్ మేనే జింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా ప్రకటించారు. 2022 జనవరి నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించేందుకు వెళ్లాలని గీతా గోపీనాథ్ నిర్ణయించుకు న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఐఎంఎల్లో ఉండటం అవసరమైనందున, తన ప్రణాళికను వాయిదా వేసుకున్నారని క్రిస్టలీనా తెలిపారు.
- ఐ.ఎం.ఎఫ్ ప్రదాన కార్యాలయం :వాషింగ్టన్
- ఐ.ఎం .ఎఫ్ స్థాపన : 1944
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ద్రవ్య నిధి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎల్డీఎండీ) గా గీతా గోపి నాథ్ నియామకం
ఎవరు: గీతా గోపి నాథ్
ఎప్పుడు : : డిసెంబర్ 03
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును అందుకున్న వి.ప్రవీణ్ కుమార్ :
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ (వీసీ)ఐన వీ ప్రవీణ్ రావుగారు 2017-19 సంవత్సర కాలానికి గాను7వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును గెలుచుకున్నారు. ఇది రిటైర్డ్ ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ఎంప్లాయీస్ అసోసియేషన్ (RICAREA) మరియు నూజివీడు సీడ్స్ లిమిటెడ్ ద్వారా అందజేసే ద్వైవార్షిక జాతీయ అవార్డు.ప్రతి 2 సంవత్సరాలక అందిస్తారు. ఈ అవార్డు తోపాటు 2 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రాన్ని ఇస్తారు. వి.ప్రవీణ్ రావు గారు వ్యవసాయ పరిశోధన, బోధన, విస్తరణ మరియు పరిపాలన రంగాలలో చేసిన సేవలను గుర్తించి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేయాలని మాజీ ఐ.సి.ఏ.ఆర్ డైరెక్టర్ జనరల్ఐన ఆర్.ఎస్ పరోడా గారి నేతృత్వంలోని ఎంపిక కమిటీ నిర్ణయించింది. ప్రవీణ్ రావు భారతదేశం, ఇజ్రాయెల్ మరియు దక్షిణాఫ్రికాలో మైక్రో ఇరిగేషన్‌పై 13 పరిశోధన మరియు 6 కన్సల్టెన్సీ ప్రాజెక్టులను నిర్వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ అవార్డును అందుకున్న వి.ప్రవీణ్ కుమార్
ఎవరు: వి.ప్రవీణ్ కుమార్
ఎప్పుడు : : డిసెంబర్ 03
జాతీయ కాలుష్య నియంత్రణ దినం గా డిసెంబర్ 02 :
కాలుష్యం మరియు దాని ప్రమాదకర ప్రభావాల గురించి ప్రజలనదరికి ఒక అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ౦గా జరుపుకుంటారు. 1983 లో జరిగిన భోపాల్ గ్యాస్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన ప్రజల జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు మరియు ఇది అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా పరిగణించబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ కాలుష్య నియంత్రణ దినం గా డిసెంబర్ 02
ఎవరు: దేశ వ్యాప్తంగా
ఎప్పుడు : డిసెంబర్ 03
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |