Daily Current Affairs in Telugu 03-04-2022
మహిళల వన్డే ప్రపంచకప్ లో మ్యాచ్ రిఫరీ గా వ్యవహరించిన బి.ఎస్ లక్ష్మి :
మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఫైనల్ చేరలేదు. కానీ టైటిల్ పోరులో భారత్ కు చెందిన బీఎస్ లక్ష్మీ కీలక పాత్ర పోషించనుంది. ఈ ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ ఏప్రిల్ 03న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య తుదిపోరుకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తుంది. ఐసీసీ మ్యాచ్ రిఫరీల అంతర్జా తీయ ప్యానెల్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2020లో ప్రపంచకప్ లీగ్-2 మ్యాచు రిఫరీగా పని చేసిన లక్ష్మి, పురుషుల వన్డేల్లో ఆ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫైనల్లో రిఫరీగా కర్తవ్యాన్ని కొనసాగి౦చి చరిత్రలోనే తొలిసారిగా ఈ పోరుకు లక్ష్మీతో సహా నలుగురు ఆడవాళ్లు మ్యాచ్ ప్రతినిధులుగా ఉండబోతుండడం మరో విశేషం. లారెన్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్) మెదాన అంపైరుగా 2020లో ప్రపంచకప్ లీగ్-2 మ్యాచ్ కు రిఫరీగా పని చేసిన లక్ష్మి పురుషుల వన్డేల్లో ఆ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా రికార్డు నమోదు చేసింది.. 2020లో పురుషులు అంతర్జాతీయ మ్యాచ్ కు మూడో అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించిన జాక్వెలిన్. ఆ ఘనత సాధించిన మరో మహిళగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల వన్డే ప్రపంచకప్ లో మ్యాచ్ రిఫరీ గా వ్యవహరించిన బి.ఎస్ లక్ష్మి
ఎవరు: బి.ఎస్ లక్ష్మి
ఎప్పుడు : ఏప్రిల్ 03
ఫాస్టర్ అనే పేరుతో ఒక సాఫ్ట్ వేర్ ను ప్రారంబించిన ఎన్ విరమణ :
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) ఎన్.వి రమణ గారు “ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్” (ఫాస్టర్) పేరుతో ఒక సాఫ్ట్‌వేర్‌ను మార్చి 31, 2022న ప్రారంభించారు. ఈ వేగవంతమైన సాఫ్ట్‌వేర్ యొక్క లక్ష్యం న్యాయస్థాన ఆదేశాలను త్వరితగతిన కమ్యూనికేషన్ కోసం ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కోర్టు ఉత్తర్వులను సురక్షితంగా మరియు వేగంగా ప్రసారం చేయడం. FASTER ప్లాట్‌ఫారమ్ ద్వారా కోర్టు అధికారులు వారు తక్షణమే ఆర్డర్‌ల ఇ-కాపీలను సురక్షిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఛానెల్ ద్వారా ఉద్దేశించిన పార్టీలకు పంపగలరు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫాస్టర్ అనే పేరుతో ఒక సాఫ్ట్ వేర్ ను ప్రారంబించిన ఎన్ వి. రమణ
ఎవరు: ఎన్ వి. రమణ
ఎప్పుడు : ఏప్రిల్ 03
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా దేశం
:
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ప్రపంచ క్రికెట్ లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది, అద్వితీయ ఆటతీరు. అద్భుత ప్రదర్శన లతో తిరుగులేని ఆసీస్ ఏడోసారి ప్రపంచ కప్ ను ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ”, “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అలీసా, హీలీ (170, 138 బంతుల్లో 26.4) ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుతో చెలరేగిన వేళ ఆసీస్. 71 పరుగులతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్టకు. 350 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. హేలీ శతకంతో సత్తా చాటగా రాచెల్ హేన్స్ (68, 93 బంతుల్లో 7-1), బెల్ మూనీ (62, 47 బంతుల్లో 8-4) ఆర్థ సెంచరీలతో మెరిశారు. అనంతరం ఇంగ్లాండ్ 13:4 ఓవర్లలో 285 పరుగులకు అలౌటైంది. నాట్ సీవర్ (148 నాటౌట్, 121 బంతుల్లో 15-4, 1-00 గొప్పగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ ప్రపంచక ప్ లో ఆడిన 9 మ్యాచ్లోనూ (లీగ్ దశలో 7 సెమీస్, ఫైనల్) నెగ్గిన ఆసీస్ అజే యంగా టోర్నీని ముగించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా దేశం
ఎవరు: ఆస్ట్రేలియా
ఎప్పుడు : ఏప్రిల్ 03
ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కమిటీ వైస్ చైర్ పర్సన్గా అప్రజిత శర్మ నియామకం :
1995 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోస్ట్ & టెలికాం అకౌంట్ అండ్ ఫైనాన్స్ (IP&TAF) సర్వీస్ ఆఫీసర్ గా ఉన్న అప్రజిత శర్మ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్‌పై నియమించిన కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ యొక్క వైస్-ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అప్రజితా శర్మ 2023 మరియు 2024 సంవత్సరాలకు గాను వైస్ చైర్‌మన్గా ఉంటారు. ఆ తర్వాత ఆమె 2025 మరియు 2026 సంవత్సరాలకు చైర్‌పర్సన్ పాత్రను నిర్వహిస్తారు. మార్చి 21 నుండి 31, 2022 వరకు జెనీవాలో జరిగిన ITU కౌన్సిల్ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నే షనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కమిటీ వైస్ చైర్ పర్సన్గా అప్రజిత శర్మ నియామకం
ఎవరు: అప్రజిత శర్మ
ఎప్పుడు : ఏప్రిల్ 03
జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల టైటిల్ ను గెలిచిన జ్యోతి సురేఖ :
ఆర్చర్ జ్యోతి సురేఖ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల టైటిల్ ను గెలిచింది. ఈమె విజయవాడకు చెందినవారు. మార్చి 26న జమ్మూలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జ్యోతి 146 -143 తేడాతో ప్రియ గుర్జార్ (రాజస్థాన్)పై నగెలిచింది. మరోవైపు ర్యాంకింగ్ రౌండ్ల లో 720కి గాను 699 స్కోరుతో ఆమె మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈమె జాతీయ చాంపియన్ గా నిలవడం ఇది ఆరోసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల టైటిల్ ను గెలిచిన జ్యోతి సురేఖ
ఎవరు: జ్యోతి సురేఖ
ఎప్పుడు : ఏప్రిల్ 03
.
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |