Daily Current Affairs in Telugu 01-12-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్ సభ :
సంతాన సాఫల్య కేంద్రాలు, మహిళల అండాలు, పురుషుల వీర్యాన్ని భద్రపరిచే కేంద్రాల నియంత్రణ, పర్యవేక్షణతో పాటు సంబంధిత సాంకేతిక తల దుర్వినియోగాన్ని అడ్డుకొనే లక్ష్యంతో రూపొందించిన బిల్లుకు లోక్ సభ డిసెంబర్ 01న ఆమోదం తెలిపింది. సంతాన సాఫల్య సహాయక సాంకేతికత (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ-ఏఆర్) నియంత్రణ బిల్లు-2020ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ సభలో ప్రవేశపెట్టారు. స్థాయీ సంఘం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని బిల్లులో చేర్చింది. ఈ బిల్లు ప్రకారం. దేశంలోని సంతాన సాఫల్య కేంద్రాలు ఈ రంగంలో సేవలందించే వైద్య నిపుణుల పేర్ల నమోదు కోసం జాతీయ పట్టిక(నేషనల్ రిజిస్ట్రీ), నమోదు యంత్రాంగం (రిజిస్ట్రేషన్ ఆథారిటీ) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.2020 సెప్టెంబరులోనే ఈ బిల్లు లోక్సభ ముందుకు వచ్చినప్పటికీ సభ్యుల సూచన మేరకు స్థాయీ సంఘానికి పంపించారు. మార్పులు చేర్పుల తర్వాత తాజాగా బిల్లు లోక్ సభ ముందుకు రాగా సభ్యులు ఆమోదించారు. కాగా ఎగువసభకు బిల్లును పంపించనున్నారు. సహజ పద్ధతుల్లో సంతానం కలగని దంపతుల్లో మహిళ నుంచి అండాన్ని, పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించి ప్రయోగశాలలో ఫలదీకరించి, ఆ పిండాన్ని మహిళ నుంచి అండాన్ని, పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించి ప్రయోగశాలలో ఫలదీకరించి, ఆ పిండాన్ని మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. ఇటువంటి సేవలు అందించే సంతాన సాఫల్య కేంద్రాలు; అండం, వీర్యాన్ని భద్రపరిచే బ్యాంకులను నియంత్రించడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు వీలు కల్పిస్తూ ఏఆర్టీ బిల్లును తీసుకొచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్ సభ
ఎవరు: లోక్ సభ
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు:డిసెంబర్ 01
ప్రపంచంలో అత్యంత ఖరీ దైన నగరంగా నిలిచిన ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ :
ప్రపంచంలో అత్యంత ఖరీ దైన నగరంగా ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ నిలి చింది. ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అనే సంస్థ.. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ మేరకు వరల్డ్. కాస్ట్ ఆఫ్ లివింగ్-2021 పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రపంచవ్యా ప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దె, రవాణా తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో తొలి సారిగా టెల్ అవీవ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. పారిస్ (ఫ్రాన్స్), సింగపూర్ సమాన పాయింట్లతో రెండో స్థానాన్ని పంచుకున్నాయి. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) నాలుగో స్థానంలో, హాంకాంగ్ ఐదో స్థానంలో నిలిచాయి. ఆరో స్థానంలో న్యూయార్క్ (అమెరికా), ఏడో స్థానంలో జెనీవా (స్విట్జర్లాండ్). ఎనిమిదో స్థానంలో కోపెన్హాగెన్ (డెన్మార్క్), తొమ్మిదో స్థానంలో లాస్ ఏంజెలెస్ (అమెరికా), పదో స్థానంలో ఒసాకా (జపాన్) ఉన్నాయి. గతే డాది పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో స్థానాల్లో నిలిచాయి. ద్రవ్యోల్బణం ప్రభావం కరోనా కారణంగా నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులతో కొన్ని దేశాల్లో ధరలకు రెక్కలొచ్చాయి. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే నిత్యావసర వస్తువులు ధరలు స్థానిక కరెన్సీలోనే 3.5 శాతం పెరిగినట్లు ఈఐయూ సర్వేలో తేలింది. దీంతో గతంలో 79వ స్థానంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ కూడా 29వ స్థానానికి ఎగబాకింది. దీన్ని బట్టి గతేడాది కంటే ఈ ఏడాది కంటే ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
- అత్యల్ప జీవన వ్యయమున్న (చౌకైన) నగరంగా సిరియా రాజధాని డమాస్కస్ నిలిచింది. గుజరా త్లోని అహ్మదాబాద్ నగరం ఈ జాబితాలో ఏడో స్థానం దక్కించుకుంది.
- పెట్రోల్ ధరలు అత్యంత ఎక్కువగా ఉన్న తొలి పది నగరాల్లో హాంకాంగ్ తొలిస్థానంలో నిలిచింది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.187 (2.5 డాలర్లు) ఉన్నట్లు ఈఐయూ తెలిపింది
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలో అత్యంత ఖరీ దైన నగరంగా నిలిచిన ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్
ఎవరు: ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్
ఎక్కడ: ఇజ్రాయెల్ లో
ఎప్పుడు: డిసెంబర్ 01
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) గా బాద్యతలు స్వీకరించిన వివేక్ జోహ్రి :
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) గా సీనియర్ అధికారి వివేక్ జోహ్రి గారు బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్, పరోక్ష పన్నులు) అధికారి అయిన జోహ్రి ఇప్పటికే బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. నవంబరు 30న చైర్మ న్ గా పదవీ విరమణ చేసిన ఎం. అజిత్ కుమార్ గారి స్థానంలో వివేక్ చేరారు. సీబీఐసీ చైర్మన్ గా జోహ్రి నియామకానికి గత నెలలో ‘ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) గా బాద్యతలు స్వీకరించిన వివేక్ జోహ్రి
ఎవరు: వివేక్ జోహ్రి
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 01
“PIFF విశిష్ట పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ నటుడు అశోక్ సరాఫ్ :
ప్రముఖ సినీ మరియు టెలివిజన్ నటుడు అశోక్ సరాఫ్ భారతీయ సినిమాకు చేసిన సేవలకుగాను “PIFF విశిష్ట పురస్కారం”తో సత్కరించబడతారు. .డిసెంబర్ 2 మరియు 9 మధ్య జరిగే 19వ పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (PIFF) ప్రారంభ రోజున ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అమిత్ దేశముఖ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.మార్చి 2021లో జరగాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక చలన చిత్రోత్సవం PIFF, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది.PIFF యొక్క ఈ ఎడిషన్ కు ప్రారంభ చిత్రం మంగోలియా నుండి “ది ఉమెన్ అనే చిత్రం ప్రదర్శింపబడుతుంది..
క్విక్ రివ్యు :
ఏమిటి: “PIFF విశిష్ట పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ నటుడు అశోక్ సరాఫ్
ఎవరు: సినీ నటుడు అశోక్ సరాఫ్
ఎప్పుడు: డిసెంబర్ 01
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గా డిసెంబర్ 01 :
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నియమించబడినది, HIV సంక్రమణ వ్యాప్తి వలన ఏర్పడే AIDS మహమ్మారి గురించి అవగాహన కల్పించడానికి మరియు వ్యాధితో మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేయడానికి అంకితమైన అంతర్జాతీయ దినోత్సవంగా దీనిని జరుపుకుంటారు. ఇలా.ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు.గణాంకాలను పరిశీలిస్తే 1981 సంవత్సరంలో తొలిసారిగా కనిపెట్టిన ఈ వైరస్ బారిన ఇప్పటి వరకు మూడున్నర కోట్ల మందికి పైగా ప్రజలు పడ్డారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజలలో అవగాహన పెంచడం ద్వారా పెరుగుతున్న హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎయిడ్స్ కేసులను అరికట్టవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 37.9 మిలియన్ల మంది హెచ్ ఐవీ సోకినా వారున్నారు. వీరిలో 79శాతం. మంది మాత్రమే పరీక్షలు చేయించుకున్నారు. ఇక 62 శాతం మంది వైద్య సహాయాన్ని పొందగలిగారు. దాదాపు 53 శాతం మంది హెచ్ఐవీ నుంచి విముక్తులయ్యారు. ఈ వివరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గా డిసెంబర్ 01
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: డిసెంబర్ 01
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |