Daily Current Affairs in Telugu -28-11-2019
తెలంగాణకు రూ.312 కోట్లు కేటాయింపు
2019 -20 ఆర్ధిక సంవత్సరంలో అనుబంధ పద్దుల్లో దేశ వ్యాప్తంగా రూ.2,1246.16 కోట్ల అదనపు వ్యయం వినియోగానికి పార్లమెంట్ అనుమతిచ్చింది. ఇందులో తెలంగాణకు రూ.312 కోట్లు కేటాయించారు. హైదరాబద్ లో ఐఐటి కి కాపిటల్ ఆస్తుల సృష్టికి రూ300 కోట్లు ,అత్తాపూర్ లోని నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్ ప్రాంతీయ శిక్షణ సంస్థ నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: తెలంగాణకు రూ.312 కోట్లు కేటాయింపు
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: నవంబర్ 28
హెచ్.సి.యు కి “వేర్సిటి ఆఫ్ ది ఇయర్ “ అవార్డ్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని(హెచ్.సి.యు) కి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) తరపున యూనివెర్సిటి ఆఫ్ ది ఇయర్ అవార్డ్ లబించింది. ఈ నెల 27న దిల్లీలో జరిగిన ఫిక్కి 6వ ఉన్నత విద్యా ప్రతిభా పురస్కారాల ప్రదానం సందర్బంగా హెచ్.సి.యు కి ఈ అవార్డ్ దక్కింది. వర్సిటి అనుసరితున్న విదానాలు, బావి లక్ష్యాలు అవార్డులు, ర్యాంకింగ్, స్వర్గ్, ఆచార్యుల పదోన్నతుల తదితర అంశాలపై ఈ నెల 22న హెచ్.సి.యు ప్రతినిధులు ఫిక్కి అవార్డుల జ్యూరి ఎదుట హాజరై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని గుర్తించి 30 ఏళ్లకు పైబడి కొనసాగుతున్న విభాగంలో యూనివెర్సిటి ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ఫిక్కి అందించింది.
క్విక్ రివ్యూ
ఏమిటి: హెచ్ సియు కి “వేర్సిటి ఆఫ్ ది ఇయర్ “ అవార్డ్
ఎక్కడ: హైదరబాద్
ఎప్పుడు: నవంబర్ 28
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
నవంబర్ 29 నుంచి కరీంనగర్ లో పిల్లల వైద్యుల సదస్సు
చిన్నారులకు సోకే వ్యాధులపై అధునాతన విషయాలను తెలుసుకోవటానికి నవంబర్ 29 నుంచి మూడు రోజుల పాటు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నవంబర్ 28 న కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ప్రతిమ కళాశాలలో జరిగే సదస్సు కు రాష్ట్రం నలుమూలల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు అని చెప్పారు. ఈ నెల 30 న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ,పౌర సరపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ,ఎంపి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: నవంబర్ 29 నుంచి కరీంనగర్ లో పిల్లల వైద్యుల సదస్సు
ఎక్కడ: కరీంనగర్
ఎప్పుడు: నవంబర్ 28
గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్
గోదావరి నది యాజమాన్య(జి.ఆర్.ఎం.బి) చైర్మన్ గా చంద్రశేకర్అయ్యర్ ను కేంద్ర జలవనరుల శాఖ నియమించింది. బోర్డు చైర్మన్ గా ఉన్న జైన్ కేంద్ర జలసంఘం (సి.డబ్లు.సి.) చైర్మన్ గా వెళ్ళడంతో ఆ స్థానాన్ని అయ్యర్ తో బర్తీ చేసింది. ఈయన గోదావరి బోర్డు సబ్యకార్యదర్శిగా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి.ఈ.ఓ పనిచేశారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్
ఎవరు: చంద్రశేఖర్ అయ్యర్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: నవంబర్ 28
ఎబివిపి సిడబ్లుసి సబ్యుడిగా ప్రవీణ్ రెడ్డి
అఖిల బారత్ విద్యార్థి పరిషత్తు (ఎబివిపి) సెంట్రల్ వర్కింగ్ కమిటీ సబ్యుడిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఓయూ పరిశోదక విద్యార్థి ప్రవీణ్ రెడ్డి నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో జరిగిన 65వ జాతీయ మహాసబల్లో ప్రవీణ్ రెడ్డి నియామకాన్ని అ సంఘం జాతీయ అద్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య ప్రకటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన ప్రవీణ్ రెడ్డి గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిల్లో పనిచేశారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: ఎబివిపి సిడబ్లుసి సబ్యుడిగా ప్రవీణ్ రెడ్డి
ఎవరు: ప్రవీణ్ రెడ్డి
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: నవంబర్ 28
10లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ మార్కెట్ విలువ-తొలి భారతీయ కంపెనిగా రికార్డ్ :
ముకేష అంబాని సారద్యంలో రిలయన్స్ ఇండస్త్రిస్ లిమిటెడ్(ఆర్.ఐ.ఎల్) చిరస్మరనీయ రికార్డ్ ను నెలకొల్పింది. కంపెని మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్ల మైలు రాయిని చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెని (ఆర్.ఐ.ఎల్) కావడం గమనార్హం. ట్రేడింగ్ ముగిసే నాటికి బిఎస్ఈ లో అర్.ఐ.ఎల్. మార్కెట్ విలువ రూ.1001,555.42 కోట్లుగా నమోదైంది. గత కొన్ని రోజులుగా మార్కెట్ విలువ రూ.10 కోట్ల సమీపంలోనే ఉంటూ వస్తుంది. అయితే నిన్న షెరు 0.65 శాతం పెరిగి రూ.1579.95 వద్ద నమోదవడంతో కంపెని చారిత్రిక మైలు రాయిని అందుకుంది. ముఖ్యంగా గత 8 రోజులుగా షేరు 8 శాతం మేర రాణించడం ఇందుకు కారణమైంది. కేవలం 25 ట్రేడింగ్ రోజుల్లోన్నే ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.9 లక్షలకోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు,చేరడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ లో తొలి సారి రూ.9 లక్షల కోట్ల మైలురాయిని కంపెని అందికుంది.
క్విక్ రివ్యూ
ఏమిటి: 10లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ మార్కెట్ విలువ-తొలి భారతీయ కంపెనిగా రికార్డ్ ఎవరు
ఎక్కడ: ఢిల్లీ
ఎప్పుడు: నవంబర్ 28
దీపిక ,అంకిత లకు ఆసియా స్వర్ణం మరియు ఒలింపిక్ బెర్తు :
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సత్తా చాటింది. ఆసియా ఆర్చరి చాంపియన్ షిప్ లో అద్బుత ప్రదర్శనతో స్వర్ణం గెలవడమే కాక టోక్యో ఒలింపిక్స్ బెర్తు సంపాదించింది. నవంబర్28 న మహిళల రిజర్వ్ విభాగం క్వాలిపైంగ్ లో మొదట 7-2 తో నూర్ అసిపా (మలేషియా ) ను, ఆ తర్వాత 6-2 తో జహ్రా (ఇరాన్) ను ఓడించి సేమిపైనల్ చేరిన దీపిక ఒలింపిక్ కోటానూ సొంతం చేసుకుంది. ఆపై సెమిస్ లో 6-2 తో గుయెత్(వియత్నాం)ను , పైనల్లో 6-0 తో మన దేశానికి చెందిన అంకిత బకాత్ పై గెలిచి స్వర్ణం సాధించింది. అంతకముందు అంకిత తొలి రౌండ్లో 7-1 తో షుక్ చింగ్ (హాంకాంగ్)పై ,ప్రి క్వార్టర్లో 6-0తో థీయ్ పుంగ్ (వియత్నాం) పై క్వార్టర్ లో బనోవా (కజికిస్తాన్)పై 6-4తో గెలిచి సెమిస్ చేరింది. తుది నాలుగు జాబితాలో చోటు సంపాదించడం ద్వారా ఆమె ఒలింపిక్ కోటా కూడా దక్కించుకుంది.సెమిస్ లో(బూటాన్ )పై 6-2 తో గెలిచిన అంకిత తుది సమరంలో దీపిక చేతిలో ఓడినా రజతం గెలిచింది.
క్విక్ రివ్యూ
ఏమిటి: దీపిక ,అంకిత లకు ఆసియా స్వర్ణం మరియు ఒలింపిక్ బెర్తు
ఎవరు: దీపిక ,అంకిత
ఎక్కడ: బ్యాంకాక్
ఎప్పుడు: నవంబర్ 28
పిఎస్ఎల్వి-సి48 ప్రయోగం 11 న
బారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్ జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చే నెల 11 న పోలార్ శాతటిలైట్ లాంచ్ వెహికల్ సి-48 ను ప్రయోగించనున్నారు. ఇందు కోసం శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. షార్ లోని మొదటి ప్రయోగ వేదిక పై ఈ నెల మొదటి వారం నుంచి వాహకనౌక కు సంబంధించిన అనుసందానం చురుగ్గా సాగుతోది. పిఎస్ఎల్వి సి-48 ద్వారా రీశాట్ -2బి ఆర్1 తో పాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వారం క్రితం రీశాట్ -2బిఆర్1 ఉపగ్రహం షార్ కు చేరుకుంది. దానికి పలు పరిక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు జిఎసేఎల్వి ప్రయోగానికి సంబంధించన ఎల్40 స్టేజిని శ్రీహరికోటకు నవంబర్ 28 ప్రత్యెక వాహనంలో తీసుకోచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పిఎస్ఎల్వి-సి48 ప్రయోగం 11 న
ఎక్కడ: నెల్లూర్ (శ్రీహారికోట)
ఎప్పుడు: నవంబర్ 28
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |