Daily Current Affairs in Telugu 20-21-11-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా జెఫ్ అలారైస్ నియామకం :
ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా జెఫ్ అలారైస్ (ఆస్ట్రేలియా) నియమితుడయ్యాడు. 8 నెలలకు పైగా తాత్కాలిక సీఈఓగా వ్యవహరించిన అలార్డెస్కు ఐసీసీ పాలక మండలి నవంబర్ 21న పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. కఠిన సవాళ్ల నడుమ టీ20 ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించడం అలరైసు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా కెరీర్ మొదలు పెట్టిన అలార్డైస్ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియాకు పరిపాలకుడిగా వ్యవహరించాడు. ఎనిమిదేళ్ల పాటు ఐసీసీ జనరల్ మేనేజర్ గా పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా జెఫ్ అలారైస్ నియామకం
ఎవరు: జెఫ్ అలారైస్
ఎప్పుడు: నవంబర్ 21
ఖతార్ గ్రాండ్ టైటిల్ ను గెలుచుకున్న మెర్సిడెస్ రేసర్ హమిల్టన్ :
ప్రపంచ నంబర్వన్ హామిల్టన్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఈ మెర్సిడెజ్ రేసర్ ఖతార్ గ్రాండ్ టైటిల్ ను శైవసం చేసుకున్నాడు. నవంబర్ 21న జరిగిన తుది రేసులో ఈ బ్రిటీష్ డ్రైవర్ 25 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. వెరెవెన్ 19 పాయింట్లతో రెండోస్థానం, అలెనో 15 పాయింట్లతో మూడో స్థానం సాధించారు. ఇటీవలే బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్న హామిల్టన్ (3435) వరుసగా రెండు టైటిళ్లతో ఫార్ములావన్ ఛాంపియన్షిప్ లో అగ్రస్థానంలో ఉన్న వెర్షపెన్ (3515)ను మరింత సమీపించాడు,
క్విక్ రివ్యు :
ఏమిటి: ఖతార్ గ్రాండ్ టైటిల్ ను గెలుచుకున్న మెర్సిడెస్ రేసర్ హమిల్టన్
ఎవరు : మెర్సిడెస్ రేసర్ హమిల్టన్
ఎప్పుడు: నవంబర్ 21
సూడాన్ ప్రధానిగా మళ్లీ పదవీ బాధ్య తలుచేపట్టనున్న అబ్దల్లా హమ్ దోక్ :
సూడాన్ దేశ ప్రధాన మంత్రిగా అబ్దల్లా హమ్ దోక్ మళ్లీ పదవీ బాధ్య తలు చేపట్టనున్నారు. ఈ మేరకు సూడాన్ సైన్యం, రాజకీయ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు నవంబర్ 21న వెల్లడించాయి. అక్టోబర్ 25 నుంచి అరెస్టు చేసిన ప్రభుత్వ అధికారులను,’రాజకీయ నాయకులను విడుదల చేసేందుకు సైన్యం అంగీకరించినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కుదరడం వెనుక ఐక్యరాజ్యసమితి అమెరికా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గత నెలలో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా హమ్హక్ పదవి నుంచి దిగిపో యారు. అయితే. సైన్యంతో ఒప్పందం కుదిరిన అయితే, సైన్యంతో ఒప్పందంపై తాము సంతకం చేయలేదని సూడాన్ అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన ‘ఉమ్మా పార్టీ ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సూడాన్ ప్రధానిగా మళ్లీ పదవీ బాధ్య తలుచేపట్టనున్న అబ్దల్లా హమ్ దోక్
ఎవరు : అబ్దల్లా హమ్ దోక్
ఎక్కడ: సూడాన్ దేశం
ఎప్పుడు: నవంబర్ 21
ఏపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న జర్మని స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ :
జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఈ ఏడాది ఏపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. నవంబర్ 21 ఏకపక్షంగా సాగిన సింగిల్స్ తుది పోరాటంలో జ్వెరెవ్ 6-4, 6-4తో రష్యా కెరటం, ప్రపంచ రెండో ర్యాంకర్ డానియల్ మెద్వెదెవ్ ను ఓడించాడు. సెమీస్ లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ను ఓడించి ఊపు మీదున్న జ్వెరెవ్ న లోనూ అదే జోరు ప్రదర్శించాడు. ఈ మ్యాచ్ లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన అలెగ్జాండర్ ఎనిమిది ఏస్ లు సంధించాడు. కాగా ఈ జర్మనీ ఆటగాడికి ఇది రెండో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్. 2018లోనూ అతడే ట్రోఫీ గెలిచాడు. ఈ ఏడాది మహిళల టూర్ ఫైనల్స్ ట్రోఫీని ముగురుజు (స్పెయిన్) దక్కించుకున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న జర్మని స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్
ఎవరు : అలెగ్జాండర్ జ్వెరెవ్
ఎప్పుడు: నవంబర్ 21
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజుఎన్నిక :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆయన అభ్యర్థిత్వాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాద శ్రీనివాసరావు, బల్లి కల్యాణ చక్రవర్తి బలపర్చారు. రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రాటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాజును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు కలిసి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజుఎన్నిక :
ఎవరు : కొయ్యే మోషేన్ రాజు
ఎక్కడ: : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు: నవంబర్ 21
ఝాన్సీలో అటల్ ఏక్తా పార్క్ ను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :
మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి పేరు మీద ఝాన్సీలో అటల్ ఏక్తా పార్క్ ను ప్రధాని నరేంద్ర మోడి గారు ప్రారంభించారు.దాదాపు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 11 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్కును నిర్మించారు. ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి అయిన ప్రఖ్యాత శిల్పి శ్రీ రామ్ సుతార్ చేత నిర్మించబడిన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని కూడా కలిగి ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఝాన్సీలో అటల్ ఏక్తా పార్క్ ను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు: నవంబర్ 21
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మరోసారి మొదటి స్థానం లో నిలిచిన ఇండోర్ :
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది అయిదోసారి విశేషం.రెండో స్థానంలో సూరత్(గుజరాత్), ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ సర్వేక్షణ్-2021′ అవార్డులను నవంబర్ 20న ప్రకటించింది. విజేతలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మరోసారి మొదటి స్థానం లో నిలిచిన ఇండోర్
ఎవరు: ఇండోర్
ఎక్కడ: మధ్యప్రదేశ్లోని ఇండోర్
ఎప్పుడు: నవంబర్ 20
ఆత్మ నిర్భర్ భారత్ గ్రామ యాత్ర ను ప్రారంబించిన గుజరాత్ సిఎం :
గుజరాత్ ముఖ్యమంత్రి భూపెల్ పటేల్ అత్మనిర్భార్ భారత్ గ్రామ యాత్రను జెండా ఊపి ప్రారంబించారు.ఇందులో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా రూపొంచిందిన వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు తిరుగుతూ వివిధ ప్రభుత్వ పతకాలు మరియు ప్రజలకు సంబంధించిన పరిశుభ్రత వంటి సమస్యలపై అవగాహన కల్పిస్తాయి.ఈ మూడు రోజుల యాత్రలో రూ .441.89 కోట్ల విలువైన దాదాపు 19,600 ప్రాజెక్టు లు ప్రారంబం అవుతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆత్మ నిర్భర్ భారత్ గ్రామ యాత్ర ను ప్రారంబించిన గుజరాత్ సిఎం
ఎవరు : గుజరాత్ సిఎంభుపెల్ పటేల్
ఎప్పుడు: నవంబర్ 21
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |