Daily Current Affairs in Telugu 13&14-11-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
అంతర్జాతీయ కమిషన్ (ఐఎల్సీ) సభ్యుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ బిమల్ పటేల్ :
అంతర్జాతీయ కమిషన్ (ఐఎల్సీ) సభ్యుడిగా భారత జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ ఎన్నికయ్యారు. 2023 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. మొత్తం 34 మంది సభ్యులుండే అంతర్జాతీయ లా కమిషన్ ఆసియా పసిఫిక్ విభాగానికి కేటాయించిన 8 స్థానాల కోసం ఈసారి 11 దేశాలు పోటీపడ్డాయి. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్ లో 192 సభ్య దేశాలు పాల్గొన్నాయి. భారత్ నుంచి పోటీ చేసిన బిమల్ పటేల్ కు అత్యధి కంగా 163 ఓట్లు వచ్చాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ట్వీట్ చేశారు. తర్వాతి స్థానాల్లో థాయ్లాండ్(162), జపాన్(154), వియత్నాం (145), చైనా(142), దక్షిణ కొరియా (140), సైప్రస్ (139), మంగో లియా(123) స్థానాల్లో నిలిచాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలో అంతర్జాతీయ చట్టాలను క్రోడీకరించి వాటి అమలును ప్రోత్సహించడం, సభ్య దేశాలకు సిఫార్సులు చేయడంలో ఐఎల్సీ కీలక పాత్ర పోషిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ కమిషన్ (ఐఎల్సీ) సభ్యుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ బిమల్ పటేల్
ఎవరు: ప్రొఫెసర్ బిమల్ పటేల్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : నవంబర్ 14
జాతీయ క్రికెట్ ఆకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ నియామకం :
జాతీయ క్రికెట్ ఆకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ గా టీమిండియా మాజీ ఆటగాడు..వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడవడం లాంఛనమే. ఎన్సీఏ తదుపరి చీఫ్ లక్ష్మణ్ అంటూ బీసీసీఐ సీనియర్ అధికారి ధ్రువీకరించాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఎన్సీఏ కొత్త డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణేనా అని అడిగితే “అవును” అన్నాడు. కాగా ఎన్సీఏ పదవి స్వీకరిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ బాధ్యతల నుంచి లక్ష్మణ్ తప్పుకోనున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ క్రికెట్ ఆకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ నియామకం
ఎవరు: వీవీఎస్ లక్ష్మణ్
ఎప్పుడు : నవంబర్ 14
తొలి సారి టి20 వరల్డ్ కప్ టైటిల్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు :
ఆస్ట్రేలియా.అదిరే ఆటతో తొలి సారి టి20 ప్రపంచకప్ ను చేజిక్కించుకుంది. మిచెల్ మార్ష్ (77 నాటౌట్; 50 బంతుల్లో 6×4, 4×6), వార్నర్ (53; 38 బంతుల్లో 4×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో నవంబర్ 14 న జరిగిన ఫైనల్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (85; 48 బంతుల్లో 10×4, 3×6) సంచలన బ్యాటింగ్ తో మొదట కివీస్ 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. హేజిల్వుడ్ (3/16) అద్భు తంగా బౌలింగ్ చేశాడు. జంపా (1/26) తో రాణిం చాడు. మార్ష్, వార్నర్ల జోరుతో లక్ష్యాన్ని ఆస్ట్రే లియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. డేవిడ్ వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. కాగా ప్రపంచకప్ గెలిచిన ఆరో జట్టు గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆ జట్టుకు ఇది తొలి టీ20 టైటిల్. ఇంతకుముందు భారత్ (2007), పాకిస్తాన్ (2009), ఇంగ్లాండ్ (2010), వెస్టిండీస్ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్ (2016) విజేతలుగా నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి సారి టి20 వరల్డ్ కప్ టైటిల్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
ఎవరు: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
ఎప్పుడు : నవంబర్ 14
‘లైన్ ఆఫ్ ప్యారడైజ్ (స్వర్గరేఖ) అనే నగర నిర్మాణం నిర్మాణం ప్రారంబించిన సౌది అరేబియా దేశం :
కాలుష్యమన్నదే లేకుండా ప్రపంచంలోనే అత్యాధునికంగా ‘లైన్ ఆఫ్ ప్యారడైజ్ (స్వర్గరేఖ) అనే నగర నిర్మాణం సౌదీ అరే బియాలో ప్రారంభమైంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, వేగవంతమైన ఉపరితల సేవలను అందించడమే లక్ష్యంగా రూ.7.5 నగరం-1లో లక్షల కోట్లతో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. 2024 నాటికి అందుబాటులోకి రానున్న ఈ .. నగరంలో 10 లక్షల మంది నివసించవచ్చు. వాయవ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్ నుంచి ఎర్ర సముద్రాన్ని కలుపుతూ ఎలాంటి వీధులు లేకుండా ఒకే సరళరేఖ నిర్మాణంలో ఈ సిటిని కడతారు. 170 కిల మీటర్ల పొడవుతో ఉండే ఈ స్వర్గరేఖ’ను మూడు లేయర్లుగా నిర్మిస్తున్నారు. ఉపరితల నగరంలో వాహనాలను అనుమతించరు.కేవలం ప్రజలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఇక్కడ పాఠశా లలు, రెస్టారెంట్లు, దుకాణాలు ఉంటాయి. ఉపరితల నగరం కింద నిర్మించే భూగర్భ నగరం-1లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు, వైద్యసేవలు, డెలివరీ వస్తువులు అందుబాటులో ఉంటాయి. నగరం-1 కింద నిర్మించే భూగర్భ నగరం 2లో ప్యాసింజర్, గూడ్స్ సేవలు అందుబా టులో ఉంటాయి. కృత్రిమ మేథ సాయంతో అల్ట్రా హైస్పీడ్ తో. ఇవి పనిచేస్తాయి..
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘లైన్ ఆఫ్ ప్యారడైజ్ (స్వర్గరేఖ) అనే నగర నిర్మాణం నిర్మాణం ప్రారంబించిన సౌది అరేబియా దేశం
ఎవరు: సౌది అరేబియా దేశం
ఎప్పుడు : నవంబర్ 14
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ :
శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడం ఢిల్లీ కాలుష్య పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దేశం నుంచి ముంబై, కోల్కతా కూడా చేరాయి. స్విట్జర్లాండకు చెందిన క్లైమేట్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్ గాలి నాణ్యత, కాలుష్యాన్ని ప్రమానికాలుగా తీసుకుంటారు. ఆ టాప్-10 జాబితా ఓ సారి చూస్తే పాకిస్థాన్లోని లాహోర్, చైనాలోని చెంగు నగరాలున్నాయి
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ
ఎవరు: ఢిల్లీ
ఎప్పుడు : నవంబర్ 14
సైబర్ ఆర్థిక నేరాల నివారణకు నియో అనే పోర్టల్స్ ను ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి :
సైబర్ ఆర్థిక నేరాల బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ విభాగం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ‘నియో’. నెట్ బ్యాంకింగ్, ఇ-కామర్స్, ఓటీపీ మోసాలను సమర్థంగా అరికట్టేందుకు ఈ పోర్టల్ దోహదపడుతుంది. ఈ పోర్టల్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించింది. ఈ పోర్టల్ ఇలా పనిచేస్తుంది.బాధితులు తాము మోసపోయామని గుర్తించిన 24 గంటల్లోగా సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్ 155260ను అందుబాటులోకి తెచ్చారు. ఆ కాల్ సీఐడీ ప్రధాన కార్యాలయంలోని నియో పోర్టల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుతుంది. ఆ వెంటనే ఫిర్యాదుదారు ప్రత్యేక ఐడీ నంబరు ఇస్తారు. పేరిట త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియో పోర్టల్ ను ప్రారంభిస్తారు
క్విక్ రివ్యు :
ఏమిటి: సైబర్ ఆర్థిక నేరాల నివారణకు నియో అనే పోర్టల్స్ ను ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి
ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ౦
ఎప్పుడు : నవంబర్ 14
మేజర్ ధ్యాన్ చంద్ ఖేలత్న అవార్డు అందుకున్న హైదరాబాద్ క్రికెట్ దిగ్గజం మిథాలి రాజ్ :
హైదరాబాదీ క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేలత్నను అందుకుంది. శనివారం జరిగిన క్రీడా పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మిథాలీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి మహిళా క్రికెట్ మిథాలీనే. మిథాలితో పాటు మరో పదకొండు మందికి ఖేల్త్న లభించింది. వీరిలో పది మంది టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో పతకాలు. గెలిచిన వాళ్లున్నారు. మరో ఖేల్ రత్న అవార్డు ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రికి దక్కింది. టోక్యో ఒలింపిక్స్ లో పెను సంచలనం సృష్టిస్తూ స్వర్ణ పతకం నెగ్గిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాతో పాటు ఇదే క్రీడల్లో హాకీలో చరిత్రాత్మక కాంస్యం గెలిచిన జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మన్ ప్రీత్ సింగ్, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్.. రెజ్లింగ్ రజత పతక విజేత రవి దహియా, బాక్సింగ్లో కాంస్యం నెగ్గిన లవ్లీనా కూడా ఈ అవార్డు అందుకున్నారు.
అర్జున అవార్డు గ్రహీతలు :
అర్పిందర్ సింగ్ (అథ్లె టిక్స్), సిమ్రనీత్ కౌర్ (బాక్సింగ్), శిఖర్ ధావన్ (క్రికెట్), భవానీ దేవి (ఫెన్సింగ్), మౌనిక (హాకీ), వందన (హాకీ), సందీప్ నర్వాల్ (కబడ్డీ), హిమానీ పరబ్ (మల్లకంబ్), అభిషేక్ వర్మ (షూటింగ్), అంకిత రైనా (టెన్నిస్), దీపక్ పునియా (రెజ్లింగ్), దిల్ ప్రీత్ సింగ్ (హాకీ), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), రూపీందర్ పాల్ (హాకీ), సురేందర్ (హాకీ), అమిత్ (హాకీ), బీరేంద్ర లాక్రా (హాకీ), సుమిత్ (హాకీ), నీలకంఠ శర్మ (హాకీ), హార్దిక్ సింగ్ (హాకీ), వివేక్ సాగర్ (హాకీ), గుర్జాంత్ సింగ్ (హాకీ), మన్దాప్ సింగ్ (హాకీ), షంషేర్ సింగ్ (హాకీ), లలిత్ ఉపాధ్యయ్ (హాకీ), సిమ్రన్జత్ సింగ్ (హాకీ), యోగేశ్ (పారా అథ్లెటిక్స్), నిషద్ (పారా అథ్లెటిక్స్), ప్రవీణ్ (పారా అథ్లెటిక్స్), సుభాష్ (పారా బ్యాడ్మింటన్), సింగారాజ్ (పారా షూటింగ్), భవీనా (పారా టీటీ), హర్వీందర్ (పారా ఆర్చరీ), శరద్ కుమార్ (పారా అథ్లెటిక్స్).
ద్రోణాచార్య అవార్డలు: రాధాకృష్ణన్ నాయర్ (అథ్లెటిక్స్), సంధ్య (బాక్సింగ్), ప్రీతమ్ సివాచ్ (హాకీ), జైప్రకాశ్ (పారా షూటింగ్), సుబ్రమణియన్ రామన్ (టీటీ)
ద్రోణాచార్య (జీవిత కాల సాఫల్య): టీపీ ఒసెఫ్ (అథ్లెటిక్స్), సర్కార్ తల్వార్ (క్రికెట్), సర్పాల్ సింగ్ (హాకీ), అషాన్ (కబడ్డీ), తపన్ (స్విమ్మింగ్); ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య అవార్డలు: `లేఖ (బాక్సింగ్), అభిజిత్ కుంతే (చెస్), దేవేందర్ సింగ్ (హాకీ), వికాస్ కుమార్ (కబడ్డి)
క్విక్ రివ్యు :
ఏమిటి: మేజర్ ధ్యాన్ చంద్ ఖేలత్న అవార్డు అందుకున్న హైదరాబాద్ క్రికెట్ దిగ్గజం మిథాలి రాజ్
ఎవరు: క్రికెట్ దిగ్గజం మిథాలి రాజ్
ఎప్పుడు : నవంబర్ 14
ఐసీసీ హాల్ ఆఫ్ లో చోటు దక్కిన్చుకోనున్న మహేల జయ వర్దనే, పొలాక్, జెనెట్ బ్రిటిన్ లు :
శ్రీలంక దిగ్గజం మహేల జయ వర్దనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ పొలాక్, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జెనెట్ బ్రిటిన్లకు టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆరంభానికి ముందు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ చోటు కల్పించనున్నారు. 2017లో మరణించిన బ్రిటిన్ 19 ఏళ్ల వాడు ఇంగ్లాండ్ మహిళల టెస్టు జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది. జయవర్దనే 2014లో టీ20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టు సభ్యుడు. మరో నాలుగు ఐసీసీ మేజర్ టోర్నీల్లో ఫైనల్ చేరిన శ్రీలంక జట్టులో కూడా అతడు ఉన్నాడు. అత్యుత్తమ నేనైతే బౌలింగ్ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరున్న పొలాక్.. టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ 300 వికెట్లు, 3000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ హాల్ ఆఫ్ లో చోటు దక్కిన్చుకోనున్న మహేల జయ వర్దనే, పొలాక్, జెనెట్ బ్రిటిన్ లు
ఎవరు: మహేల జయ వర్దనే, పొలాక్, జెనెట్ బ్రిటిన్ లు
ఎప్పుడు : నవంబర్ 14
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |