Daily Current Affairs in Telugu -13-11-2019
Daily Current Affairs in Telugu -12-11-2019
ఆర్టిఐ యాక్ట్ పై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు :
భారత ప్రదాన న్యాయమూర్తి (సిజేఐ) కార్యాలయం ప్రజా అధికార సంస్థ (పబ్లిక్ అథారిటీ) అని , దానికి సమాచార హక్కు చట్టం ( ఆర్టిఐ) కి వర్తిస్తుందని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో ని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం నవంబర్ 13 న ఈ మేరకు కీలక తీర్పు వెలువడింది. సిజేఐ కి ఆర్ టిఐ వర్తిస్తుందని 2010 లో డిల్లి హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ను సమర్థించింది . సుప్రీం కోర్ట్ సెక్రటరీ జనరల్ న్యాయస్థానం లోని కేంద్ర ప్రజా సమాచార అధికారి దాకలు చేసిన మూడు అప్పీళ్ళను కొట్టివేసింది. ఆర్టిఐ నిఘాకు ఒక సాధనంగా వాడుకోరాదని హెచ్చరించింది. పారదర్శకత విషయంలో లో న్యాయవ్యవస్త స్వతంత్రతను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి: ఆర్టిఐ యాక్ట్ పై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు :
ఎవరు : సుప్రీం కోర్ట్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు:నవంబర్ 13 -2019
భారత్ కు చేరుకున్న ప్రిన్స్ చార్లేస్స్:
రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లేస్స్ నవంబర్13 న ఇక్కడికి చేరుకున్నారు . రాష్ట్రపతి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు . రాష్ట్రపతి భవన్ లో ఒశాదీవనంలో ప్రిన్స్ చార్లేస్స్ కు ఓ చంపా మొక్కను నాటాడు.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి: భారత్ కు చేరుకున్న ప్రిన్స్ చార్లేస్స్
ఎవరు : ప్రిన్స్ చార్లేస్స్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు:నవంబర్ 13 -2019
బ్రెజిల్ చేరిన ప్రదాని మోది :
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే నిమిత్తం భారత ప్రదాని నరెంద్రమోది నవంబర్ 13 న ఇక్కడికి చేరుకున్నారు . సబ్యదేశాలయిన బ్రెజిల్ రష్యా ,ఇండియా ,చైనా దక్షినాఫ్రికా ( బ్రిక్స్ ) సబ్యదేశాల మద్య ఆర్ధిక ,సంస్కృతిక సంబందాలపైను ఈ సదస్సు ను మరింతగా పెంపొందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు .నవంబర్13 మోది రష్యా అద్యక్షుడు పుతిన్ తో బేటి అయ్యారు .మరోవైపు పాడి రైతులను ఉపకరించే దేశీయ పాలశీతలీకరణ యూనిట్ ను కనుగొన్న రవిప్రకాష్ అనే భారతియ శాస్త్రవేత్తకు బ్రిక్స్ యువ ఆవిష్కర్త గా ప్రథమ బహుమతి లభించింది. ఈ బహుమతి కింద ఆయనకు సుమారు రూ.18లక్షలు లభిస్తాయి . భిహార్ కు చెందిన రవిప్రకాష్ బెంగళూర్ లోని జాతీయ డేయిరి పరిశోధనా సంస్థ (ఎన్డి ఆర్ ఐ) లో ఆయన పీహెచ్ డి చేస్తున్నారు.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి: బ్రెజిల్ చేరిన ప్రదాని మోది
ఎవరు ప్రదాని మోది
ఎక్కడ: బ్రెజిల్
ఎప్పుడు:నవంబర్ 13 -2019
ఆఫ్గాన్ మాచ్లో బాల్ టాంపరింగ్ పై ఫూరన్ పై నిషేధం :
అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి బాల్ టాంపరింగ్ ఉదంతం చోటుచేసుకుంది. ఆఫ్గానిస్తాన్ తో వన్డే లో వెస్టిండిస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ నికోలస్ పూరన్ బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అతనిపై ఐసిసి నాలుగు మ్యాచ్ లు నిషేధం విధించింది.ఈ రెండు జట్ల మద్య జరిగినమ్యాచ్ మూడో వన్డే సందర్భంగా పూరన్ బంతిని బొటన వేలితో గోరుతో గికాడు. దానికి సంబంచిన వీడియో బయటకు రావడంతో అతను తన తప్పు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఐసిసి ప్రవర్తనా నియమావళి మూడో స్తాయి నిబందనలను పూరణ్ ఉల్లంగించాడు. నాలుగు సస్పెన్షన్ పాయింట్లు విదించారు
క్విక్ ర రివ్యూ:
ఏమిటి: ఆఫ్గాన్ మాచ్లో బాల్ టాంపరింగ్ పై ఫూరన్ పై నిషేధం
ఎక్కడ: ఆఫ్గనిస్తాన్
ఎప్పుడు:నవంబర్ 13 -2019
డిసెంబర్ 1 నుంచి కబడ్డీ ప్రపంచ కప్ :
కబడ్డీ మహ సంగ్రామానికి ముహూర్తం ఖరారైంది. భారత్ అతిత్యమిస్తున్న 2019 కబడ్డీ ప్రపంచకప్ వచ్చే నెల 1 నుండి ప్రారంభం కానుంది. తొమిది రోజుల పాటు ప్రేక్షకులకు సిసలైన కబడ్డీ మజా అందించనుంది . భారత్ ,యుఎస్ , ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ ,శ్రీలంక , కెన్యా , న్యూజిలాండ్ ,పాకిస్తాన్ , కెనడా జట్లు ఈ మెగా టోర్నమెంట్లో తలపడే అవకాశముంది. పాకిస్తాన్ , కెనడా , జట్ల కు భారత ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు .లుతియనాలోని గురునానక్ స్టేడియం;లో ఆరంభ వేదిక జరనుంది. ఫిరోజ్ పూర్ లోని భగత్ సింగ్ మైదానం లో ముగింపు కార్యక్రమం జరగనుంది.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి:డిసెంబర్ 1 నుంచి కబడ్డీ ప్రపంచ కప్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం
రేబిస్ చికిత్సకు “కైరో ర్యాబ్ “ విడుదల
రేబిస్ చికిత్స కోసం కైరో ర్యాబ్ వాక్సిన్ ను భారత బయోటేక్ ఇంటర్ నేషనల్ నవంబర్ 13 న ఇక్కడ ఆవిష్కరిచింది. సేఈసేసే(పురిఫైడ్ చిక్ ఎంబ్రియో సెల్ )ఆదారిత ఈ రేబిస్ వాక్సిన్ ను కైరాన్ బేరింగ్ వ్యాక్సిన్ కు చెందిన గుజరాత్ లో ని అంకలేశ్వర్ లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్లుహెచ్ఓ) గుర్తింపు పొందిన యూనిట్లో తయరు చేస్తున్నారు. గతంలో ఈ వ్యాక్సిన్ ను ర్యాబిపూర్ అనే బ్రాండు పేరుతో విక్రయించారు .ఇపుడు దీని కైరో ర్యాబ్ అనే బ్రాండు పేరు తో తిరిగి తీసుకు వచ్చారు. కైరాన్ బేరింగ్ వ్యాక్సిన్ ను ఈ ఏడాది మార్చిలో జీ ఎస్కే నుంచి భారత్ బయోటెక్ ఇంటర్ నేషనల్ కొనుగోలు చేసింది.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి:రేబిస్ చికిత్సకు “కైరో ర్యాబ్ “ విడుదల
ఎక్కడ: ఢిల్లీ
ఎప్పుడు: నవంబర్ 13-2019
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
హైదరాబాద్ లో ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చంజ్:
న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మాతృ సంస్థ ఇంటర్ కాంటి నెంటల్ ఎక్స్చేంక్ 500 మంది సిబ్బందితో హైదరాబాద్ లో తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది .భారత కార్య కలాపాలకు ఇదే కేంద్ర స్థానంగా ఉంటుందని ఇంటర్ కాంటి నెంటల్ ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్ బెంజిమిన్ జాసన్ నవంబర్ 13 ఇక్కడ వెల్లడించారు . పలురకాలైన సమాచార సేవలు అందించేల హైదరాబాద్ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. నిపుణుల ;లబ్యత మంచి సదుపాయాలు ఉండడం తో హైదాబాద్ లో తమ కార్యలయాని నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. గచ్చిబౌలి లోని స్కై వ్యూ ప్రాంగణం లో 85000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి హైదరాబాద్ లో ఇంటర్ కాంటి నెంటల్ ఎక్స్చంజ్
ఎక్కడ: ఢిల్లీ
ఎప్పుడు: నవంబర్ 13-2019
16 నెలల గరిష్టానికి రీటైల్ ద్రవ్యోల్బణం :
వినియోగ దారుల సూచీ (సిసిఐ) ఆదారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ లో4.62 శాతంగా నమోదైనది. ఇది 16 నెలల గరిష్టం కావడం గమనార్హం . ఆర్బిఐ నిర్దేశించుకున్న 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం స్థాయి ని అధిగమించింది. గత ఏడాది ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 356 శాతం కాగ , గత సెప్టెంబర్ లో ఏది 3.99 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే . 2018 జూన్ లో నమోదైన 4.92 శాతం తర్వాత ద్రవ్యోల్బణం మల్లి ఆ స్థాయి కి చేరడం ఇదే. కేంద్ర గనక కార్యా లయం గణాంకాల ప్రకారం
ఆహార పదార్తల ద్రవ్యోల్బణం 5.11% నుంచి 7.89 శాతానికి పెరిగింది.
కూరగాయల దరల ద్రవ్యోల్బణం 5.40 శాతం నుంచి 26.10 శాతానికి ఎగబాకింది. పండ్ల దరల ద్రవ్యోల్బణం కూడా 0.83 శాతం నుంచి 4.06 కి చేరింది.
తృణ దాన్యాలు మాంసం చేపలు గుడ్ల దరలు కూడా వరుసగా 2.16 % ,9.75. 6.26 మేర పెరిగాయి.
ఇందన ద్రవ్యోల్బణం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్ -2.18 శాతంగా నమోదు కాగ అక్టోబర్ లో -2.02 శాతానికి పరిమితమైంది.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి:16 నెలల గరిష్టానికి రీటైల్ ద్రవ్యోల్బణం
ఎక్కడ: ఢిల్లీ
ఎప్పుడు: నవంబర్ 13-2019
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆంగ్ల మాద్యమ ప్రత్యెక అధికారిగా వెట్రి సేల్వి :
ప్రభ్త్వ పాతశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రారంబించనున్న ఆంగ్ల మాద్యమ ప్రాజెక్ట్ ప్రత్యెక అధికారిగా వెట్రి సేల్వి ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ప్రస్తుతం సర్వే అసైన్మెంట్ , భూముల కంప్యుటికరణ ప్రాజెక్ట్ సంచాలకులుగా ఉన్న ఆమెకు ఆంగ్ల మాద్యమ ప్రాజెక్ట్ ప్రత్యెక అధికారిగా పూతి అదనపు భాద్యతలు అప్పగించారు.
క్విక్ ర రివ్యూ:
ఏమిటి:ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆంగ్ల మాద్యమ ప్రత్యెక అధికారిగా వెట్రి సేల్వి
ఎక్కడ: ఆంద్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 13-2019
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |