
తెలంగాణ లో తొలి కరోనా మరణం 65 కు చేరిన కరోనా కేసులు : ఈటెల రాజేందర్:
తెలంగాణ లో తొలి కరోనా మరణం ఈ సంభందించింది. కరోనా వైరస్ తో హైదరాబాద్ కు (ఖైరతాబాద్)చెందిన ఓ వ్యక్తీ(74) చనిపోయాడు. ఇటివల ఈ వ్యక్తీ డిల్లి నుండి వచ్చారు ఈ క్రమంలోనే ఈయనకు కరోనా సోకింది. పాసిటివ్ రాగానే ఈ వ్యక్తీ గ్లోబల్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయారు. ఇవాళ ఒక్క రోజే 6 పాసిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ లో కరోనా పాసిటివ్ కేసులు 65 కు చేరాయి. ఈ మొత్తం 65 మంది పాసిటివ్ కేసుల్లో ఇప్పటి వరకు 10 కోలుకున్నారు.
ఇది ఇలా ఉండగా, దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 160 కి పైగా కేసులు నమోదు కాగా ఇప్పటి వారకి భారత్ లో మొత్తం 933 పాసిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకి 21 మంది చనిపోగా 84 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశలో ఉంది. మూడో దశలో భారత్ చేరకుండా ఏప్రిల్ 21 వరకు లాక్ డౌన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ద్వారా కరోనా ను చాలా వరకు నియంత్రించవచ్చు అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.